Gold Price Today: మహిళలకు బ్యాడ్‌ న్యూస్‌.. పెరిగిన బంగారం ధర.. తులం రేటు ఎంతుందంటే..?

Gold Price Today: పసిడి ప్రియులకు మళ్లీ నిరాశే మిగిలింది. నిన్న తగ్గిన బంగారం ధరలు ఈరోజు పెరిగాయి. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి.

Gold Price Today: మహిళలకు బ్యాడ్‌ న్యూస్‌.. పెరిగిన బంగారం ధర.. తులం రేటు ఎంతుందంటే..?
Gold
uppula Raju

|

Nov 17, 2021 | 5:52 AM

Gold Price Today: పసిడి ప్రియులకు మళ్లీ నిరాశే మిగిలింది. నిన్న తగ్గిన బంగారం ధరలు ఈరోజు పెరిగాయి. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీపావళీ.. పెళ్లిళ్ల సీజన్ కావడంతో పైపైకి వెళ్లాయి. తాజాగా బుధవారం దేశీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. దాదాపుగా రూ.250 వరకు పెరిగింది. దీంతో మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46,150కు చేరింది. అలాగే 10 గ్రాముుల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 45,900కు చేరింది. దీంతో దేశంలోని పలు ప్రధాన నగరాల్లోనూ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి.

ఈరోజు ఉదయం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46,150ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,350కు చేరింది. అలాగే దేశీయ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,300కు చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 52,670కు చేరింది. అలాగే చెన్నై మార్కెట్లో ఈరోజు ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల ధర గోల్డ్ రేట్ రూ. 46,500కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,730కు చేరింది. అలాగే ముంభైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 48,360కు చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 49,360కు చేరింది. ఇక విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46,150ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,350కు చేరింది.

అయితే అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధరలలో మార్పులు.. కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు.. వాటీ వడ్డీ రేట్లు.. వంటి అంశాలు పసిడి ధరలపై ప్రభావం చూపే అంశాలు. ఇక గత కొద్ది రోజులుగా బంగారం ధరలలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రోజు రోజూకీ స్వల్పంగా పసిడి ధరలు పెరుగుతూ బంగారం కొనాలనుకునేవారికి షాకిస్తున్నాయి.

AP IAS Officers Transfer: ఏపీలో పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీ.. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారంటే..?

పెద్దవారిలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..! అయితే కచ్చితంగా ఆ వ్యాధే..?

Viral Photos: భూమిపై ఉన్న అందమైన భవంతి ఈ హోటల్‌.. 6000 అడుగుల ఎత్తులో నిర్మించారు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu