Today Petrol and Diesel Price: భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా
Today Petrol and Diesel Price: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పరుగులు పెడుతున్నాయి. ధరలను పరిశీలిస్తే ఇప్పట్లో ఏ మాత్రం తగ్గేలా కనిపించడం లేదు. రోజురోజుకు...
Today Petrol and Diesel Price: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పరుగులు పెడుతున్నాయి. ధరలను పరిశీలిస్తే ఇప్పట్లో ఏ మాత్రం తగ్గేలా కనిపించడం లేదు. రోజురోజుకు పరుగులు పెడుతూనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా దేశీయ చమురు కంపెనీలు తొమ్మిదవ రోజు కూడా ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 25 పైసలు చొప్పున పెంచుతు నిర్ణయం తీసుకున్నాయి చమురు సంస్థలు.
తాజాగా పెరిగిన ధరల ప్రకారం తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 93.10 కాగా, లీటర్ డీజిల్ ధర రూ. 87.20 గా ఉంది. వరంగల్ జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 92.83 ఉండగా, డీజిల్ 86.94 ఉంది. కరీంనగర్ జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 93.22 ఉండగా, డీజిల్ రూ. 87.31 ఉంది. అలాగే ఏపీలో విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.95.32 ఉండగా, డీజిల్ రూ.88.87 ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ.95.12 ఉండగా, డీజిల్ రూ.88.74 ఉంది.
పెట్రోల్ ధరల తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రికార్డు స్థాయిలో రూ.89.54కి చేరింది. లీటరు డీజిల్ ధర రూ.79.95గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.96 ఉండగా, డీజిల్ రూ.86.98 ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.91.68 ఉండగా, డీజిల్ రూ. 85.01 ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.92.54 ఉండగా, డీజిల్ రూ.84.75 ఉంది. ఇలా వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో సామాన్యుడికి భారంగా మారుతోంది. దీంతో ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.