Economic Recession: తగ్గిన బంగారం ధరలు.. ఆర్థిక మాంద్యం ముప్పునకు సంకేతాలేనా?

కమోడిటీ మార్కెట్‌లో అకస్మాత్తుగా అమ్మకాలు జరగడం తీవ్ర మాంద్యం సంకేతంగా పరిగణిస్తారు. మందగమనం ఆర్థిక వ్యవస్థపై ఆధిపత్యం చెలాయిస్తే .. అప్పుడు పరిస్థితి మరింత దిగజారవచ్చు. 2008 లో..

Economic Recession: తగ్గిన బంగారం ధరలు.. ఆర్థిక మాంద్యం ముప్పునకు సంకేతాలేనా?
Follow us

|

Updated on: Jul 07, 2022 | 9:39 PM

ద్రవ్యోల్బణం.. ఆర్దిక మాంద్యం.. ఈమధ్య తరచూ వింటున్న మాటలు. దేశ ఆర్థిక వ్యవస్థ ఆమాటకొస్తే ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో ఈ రెండు మాటలు వినిపిస్తే చాలు అంతా గందరగోళంగా మారిపోతుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. ధరలు పెరుగుతున్న వాతావరణం మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ద్రవ్యోల్బణం తగ్గిందని చెబుతున్నారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం, ఆర్ధిక మాంద్యం ఈ రెండిటి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం.. ప్రస్తుతం క్రూడాయిల్ ధరలు 9 శాతం తగ్గాయి. మలేషియాలో పామాయిల్ కూడా చౌకగా మారింది. పారిశ్రామిక లోహాలు కాపర్, స్టీల్, నికెల్ ధరలు కూడా క్షీణించడం కొనసాగుతోంది. అంటే, 4 నెలల క్రితం భారత ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు అకస్మాత్తుగా ప్రారంభమయ్యాయి. అవి ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంటున్నట్టేనా? ఇప్పుడు ద్రవ్యోల్బణం భయం తొలగిపోతున్నట్లు అనిపిస్తోంది. కాస్త ఊపిరి తీసుకోవచ్చనిపిస్తోంది. ఎంత బ్యాడ్ టైమ్ గడిచిపోయింది. మరి ఇప్పుడు డిమాండ్ పెరుగుతుందా? ఇదీ ప్రశ్న. దీనికి జవాబు బహుశా కాకపోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఎందుకో చూద్దాం..

కమోడిటీ మార్కెట్‌లో అకస్మాత్తుగా అమ్మకాలు జరగడం తీవ్ర మాంద్యం సంకేతంగా పరిగణిస్తారు. మందగమనం ఆర్థిక వ్యవస్థపై ఆధిపత్యం చెలాయిస్తే .. అప్పుడు పరిస్థితి మరింత దిగజారవచ్చు. 2008 లో, ప్రపంచం మొత్తం సరిగ్గా ఇలాంటి మాంద్యం చూసింది. 2008 వంటి పరిస్థితి కమోడిటీ మార్కెట్‌ను భయపెట్టింది. ఆ సంవత్సరం కూడా బంగారం, వెండి, ముడి చమురు రికార్డు స్థాయిల నుంచి బాగా పడిపోయాయి.

ఈ భయం కారణంగా, మంగళవారం ముడి చమురు సుమారు 10 డాలర్లు పడిపోయింది. బంగారం 50 దాలర్లకంటే ఎక్కువ పడిపోయింది. ఇక వెండి ధరలు కూడా సుమారు 6 శాతం పడిపోయాయి. రాగి, అల్యూమినియం, జింక్‌లలో భారీగా అమ్మకాలు జరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోధుమలు, పామాయిల్, పత్తి, సోయాబీన్ ధరలు కూడా పడిపోయాయి.

ఇవి కూడా చదవండి

ఎందుకంటే మాంద్యం ప్రబలితే, వస్తువుల డిమాండ్ తీవ్రంగా ప్రభావితమవుతుంది. వస్తువులలో ఈ పతనం మాంద్యం చిహ్నంగా మార్కెట్ నిపుణులు చూస్తున్నారు. సాధారణ పరిస్థితుల్లోనూ నిత్యావసరాల ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతూనే ఉంటాయని అనుకున్నా.. 2008లో జరిగినట్లే… ఈసారి కూడా… జరిగే అవకాశాలున్నాయని అందరూ భయపడుతున్నారు.

ఇంకోవైపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఖరీదైన రుణాలు డిమాండ్‌ను చంపేస్తాయని సెంట్రల్ బ్యాంకులకు కూడా తెలుసు. క్రెడిట్, డిమాండ్ మధ్య సమతుల్యత దెబ్బతింటుంటే, ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలోకి వెళ్లిపోతోంది. ఇప్పుడు మాంద్యం తలుపు చేరుకోవడానికి ఏక్కువ సమయం పట్టదు.

కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర బ్యాంకులు ద్రవ్యోల్బణాన్ని పెద్ద సవాల్‌గా ఎదుర్కొంటున్నాయి. ఈ సవాలును అధిగమించేందుకు కేంద్ర బ్యాంకులు కూడా కొద్దికాలం మాంద్యాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే బ్యాలెన్స్‌కు భంగం కలిగితే అప్పుడు.. మాంద్యం ఒక పెద్ద సవాలుగా మారవచ్చు. ఇటువంటి పరిస్థితిలో వస్తువుల ధరలు తగ్గడం కూడా పెద్దగా సహాయం చేయదు. కాబట్టి ప్రస్తుతం వస్తువుల ధరలు తగ్గడంతో మాంద్యం ముప్పు పోయిందని భావించడానికి వీలులేదు.