AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Falguni Nair: అత్యంత సంపన్న మహిళగా ఫల్గుణి నాయర్.. విజయమార్గంలో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులెన్నో..

ఫల్గుణి నాయర్.. భారతదేశపు అత్యంత సంపన్న మహిళగా రికార్డు సృష్టించారు. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ - 2022 ప్రకారం టాప్ 100 బిలియనీర్ల జాబితాలో నాయర్ 33వ స్థానంలో నిలిచారు. కొన్నేళ్ల పాటు భారతదేశంలో..

Falguni Nair: అత్యంత సంపన్న మహిళగా ఫల్గుణి నాయర్.. విజయమార్గంలో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులెన్నో..
Falguni Nair
Ganesh Mudavath
|

Updated on: Sep 23, 2022 | 9:51 PM

Share

ఫల్గుణి నాయర్.. భారతదేశపు అత్యంత సంపన్న మహిళగా రికార్డు సృష్టించారు. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ – 2022 ప్రకారం టాప్ 100 బిలియనీర్ల జాబితాలో నాయర్ 33వ స్థానంలో నిలిచారు. కొన్నేళ్ల పాటు భారతదేశంలో అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచిన ముకేశ్ అంబానీ.. ఈ ఏడాది రెండో స్థానంలో నిలిచారు. అతని ప్లేస్ లో భారత అత్యంత రిచెస్ట్ పర్సన్ గా గౌతమ్ అదానీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. ముకేశ్ అంబానీకి ఈసారి రూ. 3 లక్షల కోట్లు తగ్గినప్పటికీ, ఆయన సంపద 11 శాతం పెరిగింది. ఆయన సంపద రూ.7.94 లక్షల కోట్లు కాగా, అదానీ సంపద రూ.10.94 లక్షల కోట్లుగా ఉంది. బ్యూటీ అండ్ వెల్‌నెస్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం Nykaa విజయవంతమైన జాబితాలో ఫల్గుణి నాయర్ కిరణ్ మజుందార్-షాను అధిగమించారు. IIFL వెల్త్ హుర్న్ ఇండియా రిచ్‌లో అత్యంత ధనవంతులైన భారతీయ మహిళగా నిలిచారు. గతేడాది నవంబర్‌లో FSN E-కామర్స్ వెంచర్స్ లిమిటెడ్ Nykaa మాతృ సంస్థ అయిన బ్లాక్‌బస్టర్ లిస్టింగ్‌ను కలిగి ఉంది. స్టాక్ మార్కెట్‌ లో షేర్లు పెట్టడం ద్వారా ఆమె దేశంలోని 20 మంది ధనవంతులలో ఒకరిగా రికార్డు సృష్టించారు. అంతే కాకుండా ప్రపంచంలోని సంపన్న మహిళల జాబితాలోనూ ఆమె పేరు సుస్థిరం చేసుకున్నారు.

50 సంవత్సరాల వయస్సులో ఎటువంటి అనుభవం లేకుండా నైకాను ప్రారంభించినట్లు ఫల్గుణి నాయర్ చెప్పారు. Nykaa లోని దాదాపు సగం షేర్లను ఆమె కలిగి ఉంది. ప్రస్తుతం అవి $6.5 బిలియన్ల విలువ ఉంది. నాయర్ ఒక గుజరాతీ కుటుంబంలో జన్మిమంచారు. ఆమె తండ్రి బేరింగ్ వర్క్స్ కంపెనీ నిర్వహిస్తుండగా.. తల్లి గృహిణి. దీంతో వ్యాపారంలో మెళకువలను తన తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్నట్లు ఆమె తెలిపారు. Nykaa లో ఫల్గుణి నాయర్, ఆమె భర్త మాత్రమే నిధులు సమకూర్చారు. నైకా ప్రారంభించిన సమయంలో ఇన్వెంటరీ-లీడ్ బిజినెస్‌ను నిర్మించడంపై దృష్టి పెట్టారు. అంతే కాకుండా తాను పెట్టుబడిదారుల వద్దకు వెళ్లే సమయానికి కంపెనీ బాగా రన్ అయ్యిందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.

అనంతరం.. Nykaa లక్స్ బ్రాండింగ్ ద్వారా లగ్జరీ మార్కెట్‌పై దృష్టి సారించింది. అందం, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల కోసం అత్యంత ప్రజాదరణ పొందిన ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటిగా మారింది. కామర్స్ గ్రాడ్యుయేట్ అయిన ఫల్గుణి నాయర్ అహ్మదాబాద్‌లోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చదివారు. కార్పొరేట్ రంగంలో పనిచేసిన తర్వాత ఆమె 1993 లో కోటక్ మహీంద్రా క్యాపిటల్ కో.లో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా చేరారు. ఇది ఆమె కెరీర్‌లో ఎక్కువ భాగం కోసం ఒక దీర్ఘకాల ప్రయత్నంగా మారింది. 19 సంవత్సరాల తర్వాత, ఆమె సంస్థాగత ఈక్విటీల వ్యాపారానికి మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహిరించారు. అనంతరం 2012లో తన ఉద్యోగాన్ని వదులుకుని Nykaa ను స్థాపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి