Fake GST Bill: నకిలీ జీఎస్టీ బిల్లును ఎలా గుర్తించాలి? ఇన్‌వాయిస్ అంటే ఏమిటి?
పన్ను ఎగవేత భారతదేశంలో చాలా సాధారణ సమస్య. అలాగే ప్రభుత్వానికి నిరంతరం ఇదో తలనొప్పి. జీఎస్టీ అమలులోకి వచ్చినా పన్ను ఎగవేత ఆగలేదు . చాలా మంది వ్యాపారులు బిల్లులు అస్సలు జనరేట్ చేయడం లేదు. వినియోగదారుడు అడగకుంటే బిల్లు చెల్లించే పరిస్థితి లేదు. అలాగే నకిలీ బిల్లులు సృష్టించి వినియోగదారులకు ఇచ్చే వ్యాపారులు కూడా ఉన్నారు. అలాగే, ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ పొందడానికి నకిలీ ఇన్‌వాయిస్‌లను..
How To Identify Fake Bill: పన్ను ఎగవేత భారతదేశంలో చాలా సాధారణ సమస్య. అలాగే ప్రభుత్వానికి నిరంతరం ఇదో తలనొప్పి. జీఎస్టీ అమలులోకి వచ్చినా పన్ను ఎగవేత ఆగలేదు . చాలా మంది వ్యాపారులు బిల్లులు అస్సలు జనరేట్ చేయడం లేదు. వినియోగదారుడు అడగకుంటే బిల్లు చెల్లించే పరిస్థితి లేదు. అలాగే నకిలీ బిల్లులు సృష్టించి వినియోగదారులకు ఇచ్చే వ్యాపారులు కూడా ఉన్నారు. అలాగే, ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ పొందడానికి నకిలీ ఇన్‌వాయిస్‌లను (నకిలీ GST ఇన్‌వాయిస్) సృష్టించే చాలా మంది వ్యాపారులు ఉన్నారు. ఈ అక్రమాల వల్ల ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయానికి గండి పడుతుందని అంటున్నారు.
నకిలీ జీఎస్టీ ఇన్‌వాయిస్ అంటే ఏమిటి?
ఒక వస్తువు లేదా సేవ కోసం వసూలు చేసే ధరకు జీఎస్టీ పన్ను వర్తించబడుతుంది. మనం ఒక స్టోర్‌లో వస్తువును కొనుగోలు చేసినప్పుడు, బిల్లు మొత్తానికి కొంత శాతం జీఎస్టీ జోడించడం జరుగుతుంది. ఈ జీఎస్టీ సొమ్ము ప్రభుత్వానికి చెల్లిస్తుంది. అయితే, ఏ వస్తువులు లేదా సేవలు అందించకపోయినా జీఎస్టీ ఇన్‌వాయిస్‌లను రూపొందించే వారు ఉన్నారు. ఇది నకిలీ ఇన్‌వాయిస్‌గా పరిగణిస్తారు.
నకిలీ GST ఇన్‌వాయిస్‌ను ఎలా గుర్తించాలి?
వస్తువులు లేదా సేవలను అందించే ప్రతి నమోదిత సంస్థకు GSTIN జారీ చేస్తారు. జీఎస్టీఐఎన్ అనేది స్టేట్ కోడ్ నంబర్, పాన్ నంబర్, యూనిక్ రిజిస్ట్రేషన్ నంబర్‌ల కలయిక. ఇది 15 అంకెల ప్రత్యేక సంఖ్య. మీరు GST పోర్టల్ ( www.gst.gov.in/ ) కి వెళితే, మీరు GST నంబర్‌ని తనిఖీ చేయవచ్చు. పోర్టల్‌లోని సెర్చ్ ట్యాక్స్‌పేయర్ విభాగానికి వెళ్లి, నంబర్ ద్వారా సెర్చ్ చేయండి. నంబర్ నిజమైనదైతే అది ఎవరి పేరు మీద రిజిస్టర్ చేయబడింది..? వారి చిరునామా ఏమిటో పూర్తి వివరాలు కనిపిస్తాయి.
అలాగే, జీఎస్టీ బిల్లులోని ఇన్‌వాయిస్ నంబర్, తేదీ సరిగ్గా ఉందో లేదో తనిఖీ చేయండి. అలాగే వస్తువుల విక్రయానికి హెచ్‌ఎస్‌ఎన్ కోడ్ ఉంది. సేవల విక్రయానికి సర్వీసెస్ అకౌంటింగ్ కోడ్ (SAC) కేటాయిస్తారు. ఈ రెండు కోడ్ నంబర్లను జీఎస్టీ పోర్టల్‌లో ధృవీకరించవచ్చు. అలాగే, విక్రేత పన్ను చెల్లింపు చరిత్రను కూడా జీఎస్టీ పోర్టల్‌లో తనిఖీ చేయవచ్చు. నిర్దిష్ట బిల్లులో నమోదు చేస్తే ప్రభుత్వానికి పన్ను సమర్పించబడిందా లేదా అనేది తెలుసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి