ఓలాకు పోటీగా మార్కెట్‌లోకి నయా స్కూటర్‌ ఎంట్రీ.. స్టైలిష్‌ లుక్‌తో దుమ్మురేపే ఫీచర్లు..!

మార్కెట్‌లోకి ఎన్ని రకాల ఈవీలు అందుబాటులోకి వచ్చినా ఓలా ఎస్‌1 జోరును మాత్రం కట్టడి చేయలేకపోతున్నాయి. అయితే తాజాగా ఓలాకు చెక్‌ పెడతామంటూ సింపుల్ ఎనర్జీ తన సరసమైన స్కూటర్ సింపుల్ డాట్ వన్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ స్కూటర్‌ డిసెంబరు 15న విడుదల కానున్నది. ఈ స్కూటర్ ఇటీవలి సింపుల్ వన్‌ను ప్రవేశపెట్టిన తర్వాత కంపెనీ పెరుగుతున్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలలో ఉప వేరియంట్‌గా రిలీజ్‌ చేస్తున్నారు. డాట్ వన్ ప్రభావం ఓలా ఎస్‌1 ఎయిర్ వంటి వాటిపై పడుతుందని మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు.

ఓలాకు పోటీగా మార్కెట్‌లోకి నయా స్కూటర్‌ ఎంట్రీ.. స్టైలిష్‌ లుక్‌తో దుమ్మురేపే ఫీచర్లు..!
Simple Dot One
Follow us
Srinu

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 29, 2023 | 9:49 PM

ప్రస్తుతం మార్కెట్‌లో ఈవీ వాహనాల జోరు నడుస్తుంది. ముఖ్యంగా ఈవీ వాహనాల వల్ల పెట్రోల్‌ ఖర్చులకు చెక్‌ పడడంతో పర్యావరణానికి మేలు చేస్తున్నట్లు అవుతుంది. అందువల్ల భారతదేశంలో ఈవీ వాహనాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా అన్ని కంపెనీలు సరికొత్త ఈవీలను మార్కెట్‌లోకి లాంచ్‌ చేస్తున్నాయి. మార్కెట్‌లోకి ఎన్ని రకాల ఈవీలు అందుబాటులోకి వచ్చినా ఓలా ఎస్‌1 జోరును మాత్రం కట్టడి చేయలేకపోతున్నాయి. అయితే తాజాగా ఓలాకు చెక్‌ పెడతామంటూ సింపుల్ ఎనర్జీ తన సరసమైన స్కూటర్ సింపుల్ డాట్ వన్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ స్కూటర్‌ డిసెంబరు 15న విడుదల కానున్నది. ఈ స్కూటర్ ఇటీవలి సింపుల్ వన్‌ను ప్రవేశపెట్టిన తర్వాత కంపెనీ పెరుగుతున్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలలో ఉప వేరియంట్‌గా రిలీజ్‌ చేస్తున్నారు. డాట్ వన్ ప్రభావం ఓలా ఎస్‌1 ఎయిర్ వంటి వాటిపై పడుతుందని మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా అందుబాటులో ధర ఉండడం అనేది ఈ స్కూటర్‌ వినియోగదారులకు చేరువ చేస్తుంది. ఈ సింపుల్‌ వన్‌ డాట్‌ స్కూటర్‌ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

సింపుల్‌ డాట్‌ వన్‌ స్కూటర్‌సరసమైన ధరతో అధిక నాణ్యతతో రూపొంది. ముఖ్యంగా పనితీరుతో ఫీచర్లకు సంబంధించిన అద్భుతమైన కలయికను అందిస్తుంది. సింపుల్ వన్‌తో దాని ప్లాట్‌ఫారమ్‌ను పంచుకుంటూ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక లక్ష కంటే తక్కువ ధరతోనే అందుబాటులో ఉంటుందని అంచనా ఈ నేపథ్యంలో ఈ స్కూటర్‌ మార్కెట్‌లో గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా 3.7 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీతో వచ్చే డాట్ వన్ స్కూటర్‌ 151 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుందని కంపెనీ పేర్కొంటుంది. అలాగే ఐడీసీలో 160 కిమీలను సాధిస్తుందని వివరిస్తుంది. ప్రత్యేకంగా రూపొందించిన టైర్లు ఆన్-రోడ్ రేంజ్ ఆప్టిమైజ్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని, తద్వారా వాహన మొత్తం సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.

30 లీటర్ల కంటే తక్కువ సీటు నిల్వతో వచ్చే డాట్ వన్ పనితీరుతో ప్రాక్టికాలిటీని మిళితం చేస్తుంది. అదనంగా ఇది వివిధ ఫంక్షన్‌లను నిర్వహించే టచ్‌స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంది. అదనపు సౌలభ్యం కోసం యాప్ కనెక్టివిటీని అందిస్తుంది. డాట్ వన్ కోసం ప్రత్యేకమైన ప్రీ-బుకింగ్‌లు డిసెంబర్ 15న తెరుస్తామని కంపెనీ పేర్కొంటుంది. ఇంకా ఇప్పటికే ఉన్న కస్టమర్‌లు సింపుల్ వన్‌కు ప్రత్యామ్నాయంగా డాట్ వన్‌ను పరిగణించవచ్చని వారికి వివిధ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని తెలుస్తుంది. సింపుల్‌ డాట్‌ వన్‌ స్కూటర్‌ రిలీజ్‌పై సింపుల్ ఎనర్జీ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీ సుహాస్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ సింపుల్ డాట్ వన్‌ అనేది తమమార్గదర్శక సింపుల్ వన్ సిరీస్‌కి సరికొత్త సరసమైన జోడింపుగా పేర్కొన్నారు. ఈ స్కూటర్‌ను మార్కెట్‌లో రిలీజ్‌ చేయడం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లి్క్ చేయండి..