సింగిల్ ఛార్జ్‌తో 203 కిలో మీటర్ల ప్రయాణం.. ఓలాకు పోటీగా విడుదలైన మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
Simple One Electric Scooter: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తాకిడి మొదలైంది. ఆగస్టు 15న ఓలా స్కూటర్ విడుదలైన సంగతి తెలసిందే. అయితే ఓలా స్కూటర్‌కు పోటీగా మరో కంపెనీ కూడా నేడు తన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది.
Simple One Electric Scooter: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తాకిడి మొదలైంది. ఆగస్టు 15న ఓలా స్కూటర్ విడుదలైన సంగతి తెలసిందే. అయితే ఓలా స్కూటర్‌కు పోటీగా మరో కంపెనీ కూడా నేడు తన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. బెంగళూరు ఆధారిత కంపెనీ సింపుల్ వన్ సంస్థ విడుదల చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్, సబ్సిడీలను మినహాయించి)గా నిర్ణయించింది. రూ. 1,947 ధరతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బుకింగ్ చేసుకోవచ్చంటూ తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. అయితే ఈ బుకింగ్ ఎమౌంట్‌ను రీఫండ్ చేయనుందంట. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ తమిళనాడులోని హోసూర్‌లోని EV మేకర్స్ ప్లాంట్‌లో తయారు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ ప్లాంట్ సంవత్సరానికి ఒక మిలియన్ వాహనాల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉందంట. కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, గోవా, ఉత్తర ప్రదేశ్‌తో సహా మొదటి దశలో దేశవ్యాప్తంగా మొత్తం 13 రాష్ట్రాలలో ఈ-స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సంస్థ పేర్కొంది.
సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ, ఛార్జర్: సింపుల్ ఎనర్జీ నుంచి విడుదలయ్యే ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 4.8 kWh పోర్టబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ అందించనున్నారు. ఇది ఆరు కిలోగ్రాముల బరువు ఉంటుంది. ఈ బ్యాటరీని మార్చుకునే సదుపాయం కూడా కల్పించారు. అలాగే పోర్టబుల్‌గా ఉండి మన ఇంటి వద్ద కూడా ఛార్జ్ చేసుకునేందుకు చాలా సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొంది. సింపుల్ లూప్ ఛార్జర్‌తో సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను 60 సెకన్ల వ్యవధిలో 2.5 కిమీ రేంజ్ వరకు ఛార్జ్ చేయగల సామర్థ్యం ఉందని సంస్థ తెలిపింది. EV కంపెనీ రాబోయే మూడు నుంచి ఏడు నెలల్లో దేశవ్యాప్తంగా 300 కంటే ఎక్కువ పబ్లిక్ ప్లేస్‌లలో ఫాస్ట్ ఛార్జర్‌లను కూడా ఇన్‌స్టాల్ చేయనుందంట.
సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్, పనితీరు: ఈ-స్కూటర్ సింగిల్ ఛార్జ్‌లో ఏకో మోడ్‌లో 203 కిలోమీటర్లు.. ఇండియన్ డ్రైవ్ సైకిల్ (IDC) మోడ్‌లో 236 కి.మీ. దూసుకపోనుందంట. దీని గరిష్టంగా 105 kmph వేగాన్ని అందుకుంటుంది. అలాగే ఇది 3.6 సెకన్లలో 0 నుంచి 50 kmph, 2.95 సెకన్లలో 0 నుంచి 40 kmph వరకు దూసుకెళ్తుంది. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్లు: ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్యూచరిస్టిక్ డిజైన్‌ను కలిగి ఉంది. మిడ్ డ్రైవ్ మోటార్‌పై ఆధారపడి పనిచేస్తుంది. ఇది 12-అంగుళాల వీల్స్, 7-అంగుళాల డిజిటల్ డాష్‌బోర్డ్, ఆన్-బోర్డ్ నావిగేషన్, జియో-ఫెన్సింగ్, SOS మెసేజ్, డాక్యుమెంట్ స్టోరేజ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్‌తోపాటు బ్లూటూత్ కనెక్టివిటీ వంటి అనేక ఫీచర్లతో రానుంది.
సింపుల్ వన్ ఇ -స్కూటర్ ఎరుపు, తెలుపు, నలుపు, నీలం అనే నాలుగు రంగుల్లో విడుదల కానున్నట్లు సంస్థ పేర్కొంది. సింపుల్ వన్ ఈ-స్కూటర్ ఏథర్, హీరో ఎలక్ట్రిక్, ఒకినావాతోపాటు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు గట్టి పోటీ ఇవ్వనుందని నిపుణులు అంటున్నారు.
PAN Card: పాన్‌కార్డ్ పోగొట్టుకున్నారా..! అయితే చింతించనవసరం లేదు.. సింపుల్‌గా ఇలా చేయండి..