AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electric Vehicles: వ్యక్తిగత అవసరాలకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఇంకా తక్కువగానే.. ప్రభుత్వ డేటా ఏం చెబుతుందంటే

భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ (Electric Vehicles) ఇప్పటికీ వ్యక్తిగత వినియోగం కంటే ప్రజా రవాణా మోడ్‌కే ప్రాధాన్యతనిస్తున్నాయని లోక్‌సభలో ప్రభుత్వం సమర్పించిన డేటా వెల్లడించింది. అయితే, కొన్ని రాష్ట్రాల్లో బైక్‌ల వైపు కూడా మొగ్గు పెరుగుతోంది.

Electric Vehicles: వ్యక్తిగత అవసరాలకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఇంకా తక్కువగానే.. ప్రభుత్వ డేటా ఏం చెబుతుందంటే
Electric Vehicles
KVD Varma
|

Updated on: Mar 31, 2022 | 10:51 AM

Share

(ఆకాష్ గులాంకర్)

భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ (Electric Vehicles) ఇప్పటికీ వ్యక్తిగత వినియోగం కంటే ప్రజా రవాణా మోడ్‌కే ప్రాధాన్యతనిస్తున్నాయని లోక్‌సభలో ప్రభుత్వం సమర్పించిన డేటా వెల్లడించింది. అయితే, కొన్ని రాష్ట్రాల్లో బైక్‌ల వైపు కూడా మొగ్గు పెరుగుతోంది. భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి క్రిషన్ పాల్ గుర్జార్ ఈ డేటాను పార్లమెంట్‌(Parliament)కు అందించారు. అధికారిక సమాచారం ప్రకారం, భారతదేశంలో 64.3 శాతం EVలు మూడు చక్రాల వాహనాలు కాగా దాదాపు 32 శాతం ద్విచక్ర వాహనాలు లేదా బైక్‌లు. మిగిలిన మూడున్నర శాతం నాలుగు చక్రాల వాహనాలు (లేదా కార్లు), గూడ్స్ క్యారియర్లు ఇతర యుటిలిటీ వాహనాలుగా విభజించారు.

చార్ట్ 1: భారతదేశంలో కేటగిరీ వారీగా EVలు

రవాణా లేదా వ్యక్తిగత ఉపయోగం

అధికారిక సమాచారం ప్రకారం, భారతదేశంలో ప్రస్తుతం 10.51 లక్షల రిజిస్టర్డ్ EVలు ఉన్నాయి, అవి మార్చి 22 నాటికి రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. ఇది దేశంలోని మొత్తం నమోదిత వాహనాలలో అర శాతం కంటే తక్కువ. లోక్‌సభకు ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం భారతదేశంలో మొత్తం 27.79 కోట్ల రిజిస్టర్డ్ వాహనాలు ఉన్నాయి. వర్గాల వారీగా చూసుకుంటే మొత్తం భారతదేశంలో ప్రస్తుతం రోడ్లపై తిరుగుతున్న ఈవీలలో గరిష్టంగా లేదా మూడింట రెండు వంతుల త్రీ-వీలర్లేనని ప్రభుత్వ లెక్కలు సూచిస్తున్నాయి. అంటే, ఇవి ప్రధానంగా ప్రజా రవాణా కోసం ఉపయోగించే ఆటో-రిక్షాలు. భారతదేశంలోని సగానికి పైగా త్రీవీలర్, EVలు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లో నమోదు అయ్యాయి. ఇవి ముఖ్యంగా ఢిల్లీ NCR ప్రాంతంలో ఎక్కువ.

డేటా ప్రకారం, అధిక సంఖ్యలో త్రీవీలర్ EVలను కలిగి ఉన్న మిగిలిన రాష్ట్రాలుఢిల్లీకి పొరుగున ఉన్న హర్యానా (19,519 EVలు), రాజస్థాన్ (31,525 EVలు), ఉత్తరాఖండ్ (22,728 EVలు), పశ్చిమ బెంగాల్ (41,335 EVలు) ఉన్నాయి. త్రీ-వీలర్ EVల వాస్తవ వాటా మొత్తం EVలలో 64.3 శాతం కాగా మిగిలినవి ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు, గూడ్స్ క్యారియర్లు. పైన పేర్కొన్న అనేక స్థానిక సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా రవాణా కోసం EVలను ఉపయోగించడాన్ని ఆశ్రయించిన తర్వాత మాత్రమే మూడు చక్రాల EVల పెరుగుదల కనిపించింది.

EVలలో పెరుగుదల

రోడ్డు రవాణా, హైవే మంత్రి నితిన్ గడ్కరీ చెప్పినట్లుగా, భారతదేశం వాహనాల EV-ఆధారిత పర్యావరణ వ్యవస్థగా మారే దిశగా అడుగులు వేయడాన్ని చూడవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఈవీల కొనుగోళ్లతో పాటు ఛార్జింగ్ స్టేషన్లపై రాయితీలు ఇవ్వడం ద్వారా ఈవీల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. ప్రస్తుతం, కేంద్ర ప్రభుత్వం ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఫేమ్ ఇండియా) పథకం రెండవ దశను అమలు చేస్తోంది, ఇది ఏప్రిల్ 2019 నుండి ప్రారంభమయ్యే ఐదేళ్లలో రూ.10,000 కోట్ల బడ్జెట్ కేటాయింపుతో ఉంది.

ప్రజలు ఇప్పుడు తమ వ్యక్తిగత ఉపయోగం కోసం కూడా EVలను కొనుగోలు చేయడం ప్రారంభించినట్లు సంఖ్యలు స్పష్టంగా సూచిస్తున్నాయి. మహమ్మారికి ముందు కేవలం 2.8 లక్షల EVలను కలిగి ఉన్న దేశం నేడు 10.51 లక్షల EVలకు పెరిగింది.

చార్ట్ 2: భారతదేశంలోని EVల సంఖ్య (రాష్ట్రాల వారీగా)

మార్చి 22 నాటికి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గరిష్టంగా (2.89 లక్షల) EVలు ఉన్నాయి, ఇవి భారతదేశంలోని మొత్తం EVలలో దాదాపు మూడింట ఒక వంతు. ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ (1.39 లక్షలు), కర్ణాటక (89,869) గత రెండేళ్లుగా ఈ విభాగంలో భారీ వృద్ధిని కనబరిచాయి. ఈ మూడు రాష్ట్రాలు కలిపి భారతదేశంలోని EVలలో సగం ఉన్నాయి. మహారాష్ట్ర (77,049 EVలు), బీహార్ (69,177 EVలు), తమిళనాడు (61,063 EVలు), రాజస్థాన్ (60,152 EVలు) EV రిజిస్ట్రేషన్లలో వృద్ధి పరంగా కొన్ని ఇతర ప్రముఖ రాష్ట్రాలని ఈ డేటా చెబుతోంది.

బైక్‌లు వేగం పుంజుకుంటున్నాయి

ద్విచక్ర వాహనాల EV బైక్‌ల భారీ వాటా కూడా ప్రజలు తమ వ్యక్తిగత వాహనాలకు EVలను ఒక ఎంపికగా పరిగణించడం ప్రారంభించారనే వాస్తవం స్పష్టంగా కనిపిస్తుంది. బైక్‌లలో ఈ వృద్ధిని ప్రధానంగా మూడు రాష్ట్రాలు – కర్ణాటక, మహారాష్ట్ర అలాగే తమిళనాడులో చూడవచ్చు. ఈ మూడు రాష్ట్రాల్లో కలిపి భారతదేశంలో నమోదైన EV బైక్‌లలో దాదాపు సగానికి పైగా ఉన్నాయి.

చార్ట్ 3: అన్ని EVలలో కనీసం సగం ద్విచక్ర వాహనాలు ఉన్న రాష్ట్రాలు

ప్రతి రాష్ట్రంలో ద్విచక్ర వాహన EVల వాటా ఈ ప్రాంతంలో EV బైక్‌లకు ఉన్న ప్రజాదరణను చూపుతుంది. అధికారిక డేటా ప్రకారం, మొత్తం 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మొత్తం EV రిజిస్ట్రేషన్లలో 50 శాతానికి పైగా ద్విచక్ర వాహనాల EVలను కలిగి ఉన్నట్లు నివేదించాయి. ఈ రాష్ట్రాల్లో కర్ణాటక (72.5 శాతం), కేరళ (71.4 శాతం), మహారాష్ట్ర (80.3 శాతం), తమిళనాడు (85.7 శాతం), గుజరాత్ (72 శాతం ) వంటి పెద్ద రాష్ట్రాలే కాకుండా అరుణాచల్ ప్రదేశ్ (70 శాతం), నాగాలాండ్ (81.5 శాతం) వంటి చిన్న ఈశాన్య రాష్ట్రాలు కూడా ఉన్నాయి.

జాబితాలో మిగిలిన రాష్ట్రాలు చత్తీస్‌గఢ్, గోవా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, లడఖ్, ఒడిశా, పుదుచ్చేరి, జమ్మూ & కాశ్మీర్ అలాగే డామన్ & డయ్యూ.

Also Read: 

ECLGS: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్‌ 5 లక్షల కోట్లకు పెంపు..!

Vastu Tips: పెళ్లయిన మహిళలు ఆ దిక్కున అస్సలు పడుకోకూడదు..!

ఉద్యోగులకి శుభవార్త.. రోజుకి 12 గంటల పని.. మూడు రోజులు సెలవులు..?