AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO Update: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. మీ అకౌంట్‌లో రూ.81,000.. బ్యాలెన్స్‌ తనిఖీ చేయండిలా..

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ)కు చెందిన 7 కోట్ల మంది చందాదారులకు ఈ నెలాఖరు నాటికి శుభవార్త రాబోతోంది. 2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీని..

EPFO Update: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. మీ అకౌంట్‌లో రూ.81,000.. బ్యాలెన్స్‌ తనిఖీ చేయండిలా..
EPFO
Subhash Goud
|

Updated on: Oct 16, 2022 | 6:04 PM

Share

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ)కు చెందిన 7 కోట్ల మంది చందాదారులకు ఈ నెలాఖరు నాటికి శుభవార్త రాబోతోంది. 2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీని ప్రభుత్వం ఈపీఎఫ్ ఖాతాదారుల ఖాతాకు బదిలీ చేయబోతోంది. ఈసారి 8.1 శాతం వడ్డీ లభిస్తుందని తెలుస్తోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ 2022 ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్ ఖాతాలో వచ్చిన వడ్డీని లెక్కించింది. త్వరలో ఇది ఖాతాదారుల ఖాతాకు బదిలీ చేయబడుతుంది. ఈసారి ప్రభుత్వ ఖాతాలో జమ అయిన మొత్తం రూ.72 వేల కోట్లు ఖాతాలోకి చేరనుంది.

డబ్బు ఎప్పుడు బదిలీ చేయబడుతుంది?

గతేడాది వడ్డీ కోసం 6 నుంచి 8 నెలల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. కానీ, గతేడాది కోవిడ్ కారణంగా వాతావరణం భిన్నంగా మారింది. ఈ ఏడాది ప్రభుత్వం జాప్యం చేయదు. వడ్డీ డబ్బును ఈ నెలాఖరులోగా ఖాతాదారుల అకౌంట్‌కు బదిలీ చేయవచ్చు. ఈ ఏడాది వడ్డీ 40 ఏళ్ల కనిష్ఠ స్థాయిలో ఉంది.

ఎంత వడ్డీ..

☛ మీ పీఎఫ్ ఖాతాలో రూ. 10 లక్షలు ఉంటే మీకు రూ. 81,000 వడ్డీ లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

☛ మీ పీఎఫ్ ఖాతాలో రూ.7 లక్షలు ఉంటే మీకు వడ్డీ కింద రూ.56,700 లభిస్తుంది.

☛ మీ పీఎఫ్ ఖాతాలో రూ.5 లక్షలు ఉంటే రూ.40,500 వడ్డీ వస్తుంది.

☛ మీ ఖాతాలో లక్ష రూపాయలు ఉంటే 8,100 రూపాయలు వస్తాయి.

మిస్డ్ కాల్ నుండి బ్యాలెన్స్ తెలుసుకోండి

☛ మీ పీఎఫ్‌ డబ్బును చెక్ చేయడానికి మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 011-22901406కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. దీని తర్వాత, మీరు ఈపీఎఫ్‌వో​సందేశం ద్వారా పీఎఫ్‌ వివరాలను పొందుతారు. ఇక్కడ కూడా మీ యూఏఎన్‌, పాన్‌, ఆధార్‌ను లింక్ చేయడం తప్పనిసరి.

ఆన్‌లైన్‌లో..

☛ ఆన్‌లైన్‌లో బ్యాలెన్స్‌ని తనిఖీ చేయడానికి మీరు ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వాలి, epfindia.gov.inలో ఇ-పాస్‌బుక్‌పై క్లిక్ చేయండి.

☛ ఇప్పుడు మీ ఇ-పాస్‌బుక్‌పై క్లిక్ చేస్తే, passbook.epfindia.gov.inకి కొత్త పేజీ వస్తుంది.

☛ ఇప్పుడు ఇక్కడ మీరు మీ వినియోగదారు పేరు (యూఏఎన్‌ నంబర్), పాస్‌వర్డ్, క్యాప్చార్‌ చేయాలి.

☛ అన్ని వివరాలను పూరించిన తర్వాత, మీరు కొత్త పేజీకి వెళ్తారు. ఇక్కడ మీరు సభ్యుల ఐడీని ఎంచుకోవలసి ఉంటుంది.

☛ ఇక్కడ మీరు ఇ-పాస్‌బుక్‌లో మీ ఈపీఎఫ్‌ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.

 మీరు ఉమాంగ్‌ యాప్

☛ దీని కోసం మీరు మీ ఉమాంగ్‌ యాప్ ఓపెన్‌ చేసి ఈపీఎఫ్‌వోపై క్లిక్ చేయండి.

☛ ఇప్పుడు మరొక పేజీలో ఉద్యోగి-కేంద్రీకృత సేవలపై క్లిక్ చేయండి.

☛ ఇక్కడ మీరు ‘View Passbook’పై క్లిక్ చేయండి. దీనితో, మీరు మీ UAN నంబర్, పాస్‌వర్డ్ (OTP) నంబర్‌ను ఎంటర్‌ చేయండి.

☛ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దీని తర్వాత మీరు మీ PF బ్యాలెన్స్‌ని చెక్ చేసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి