AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Muvi 125 5G: అన్ని అవసరాలకు ఉపయోగపడే ఈ-స్కూటర్.. సింగిల్ చార్జ్‌పై 100కిలోమీటర్ల రేంజ్..

ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ మేకర్ ఈబైక్‌గో తన కొత్త మువీ 125 5జీ ఎలక్ట్రిక్ స్కూటర్ ను పరిచయం చేసింది. ఈ కొత్త ఈ-స్కూటర్ ఇప్పటికే ఈ కంపెనీ నుంచి అందుబాటులో ఉన్న 4జీ మోడల్ స్థానాన్ని భర్తీ చేయనుంది. భారతీయ వినియోగదారుల అవసరాలు, వారి కోరుకుంటున్న అంశాలను జోడించి ఈ కొత్త స్కూటర్ తీసుకువచ్చినట్లు ఈబైక్ గో కంపెనీ ప్రకటించింది.

Muvi 125 5G: అన్ని అవసరాలకు ఉపయోగపడే ఈ-స్కూటర్.. సింగిల్ చార్జ్‌పై 100కిలోమీటర్ల రేంజ్..
Ebikego Muvi 125 5g
Madhu
|

Updated on: Jun 30, 2024 | 5:22 PM

Share

మన దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ ఉన్న నేపథ్యంలో అనేక కంపెనీలు తప్ప ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. వాటిల్లో టాప్ బ్రాండ్లు చాలానే ఉన్నాయి. అలాంటి బ్రాండ్లలో ఒకటైన ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ మేకర్ ఈబైక్‌గో తన కొత్త మువీ 125 5జీ ఎలక్ట్రిక్ స్కూటర్ ను పరిచయం చేసింది. ఈ కొత్త ఈ-స్కూటర్ ఇప్పటికే ఈ కంపెనీ నుంచి అందుబాటులో ఉన్న 4జీ మోడల్ స్థానాన్ని భర్తీ చేయనుంది. భారతీయ వినియోగదారుల అవసరాలు, వారి కోరుకుంటున్న అంశాలను జోడించి ఈ కొత్త స్కూటర్ తీసుకువచ్చినట్లు ఈబైక్ గో కంపెనీ ప్రకటించింది. ఈ కొత్త స్కూటర్ కు సంబంధించిన స్పెసిఫికేషన్లు, ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

100కిలోమీటర్ల రేంజ్..

కొత్త మువీ 125 5జీ ఎలక్ట్రిక్ స్కూటర్ 100కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. దీనిలో 5కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది మూడు గంటల సమయంలోనే సున్నా నుంచి 80 శాతం బ్యాటరీ చార్జ్ అవుతుంది. ఇది మార్కెట్లో ఉన్న ఇతర స్కూటర్ల చార్జింగ్ టైంతో పోల్చితే చాలా తక్కువ సమయం అని కంపెనీ పేర్కొంది.

ఈబైక్ గో మువీ 125 5జీ ఫీచర్స్..

ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లో స్మార్ట్ ఎల్ఈడీ డిజిటల్ డిస్ ప్లే డ్యాష్ బోర్డు ఉంటుంది. మొబైల్ యాప్ తో కనెక్ట్ చేసిన అనేక ఫీచర్లు ఉంటాయి. ఈ కొత్త స్కూటర్ గురించి ఈబైక్ గో ఫౌండర్ అండ్ సీఈఓ డాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ మాట్లడుతూ అర్బన్ మొబలిటీలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చేందుకు నడుం బిగించామన్నారు. అందులో భాగంగానే కొత్త రవాణా సాధనాలను పరిచయం చేస్తున్నట్లు చెప్పారు. వాటిల్లో మువీ 125 5జీ ఈ-స్కూటర్ భారతీయ వినియోగదారులకు సరిగ్గా సరిపోతుందని, వారి అవసరాలకు అనుగుణంగా తయారు చేసినట్లు చెప్పారు.

ఈబైక్ గో భవిష్యత్ ప్రణాళికలు..

ఈబైక్ గో తమ భవిష్యత్ ప్రణాళికలు కూడా ప్రకటించింది. రానున్న ఆర్థిక సంవత్సరంలోపు తమ ద్విచక్ర వాహనాల శ్రేణిలో ఒక లక్ష ఈవీలను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో గత మూడేళ్లుగా తమ ఆపరేషన్స్ ను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. కాగా మార్కెట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల శ్రేణిలో ఓలా టాప్ సెల్లర్ గా ఉంది. ఆ తర్వాత స్థానంలో ఏథర్, టీవీఎస్, బజాజ్ చేతక్ వంటి ఇతర బ్రాండ్లు ఉన్నాయి. అయితే ఈ స్కూటర్ ఇంటి అవసరాలను తీర్చడంలో బాగా ఉపకరిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..