Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyber Fraud: బ్యాంకింగ్ మోసాలకు చెక్.. త్వరలో అన్ని సేవలకు ఒకటే నెంబర్?

ఇటీవల కాలంలో బ్యాంకింగ్ రంగంలో పెరిగిన టెక్నాలజీ కారణంగా ప్రజలు ఎక్కువగా తమ సొమ్మును బ్యాంకుల్లోనే నిల్వ ఉంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మంచి ఉన్న చోటే చెడు ఉందనే చందాన బ్యాంకింగ్ రంగంలో మోసాలు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలో మోసాలపై కంప్లైంట్ చేయడానికి ఒక్కో బ్యాంక్ ఒక్కో నెంబర్ పెడుతుంది. ఇది వినియోగదారులకు ఇబ్బందిగా ఉండడంతో అన్ని బ్యాంకులు ఒకే నంబర్ వాడేలా చర్యలు తీసుకోబోతున్నారు.

Cyber Fraud: బ్యాంకింగ్ మోసాలకు చెక్.. త్వరలో అన్ని సేవలకు ఒకటే నెంబర్?
Calling Bank Fraud
Srinu
|

Updated on: May 23, 2025 | 7:30 PM

Share

భారతదేశంలో త్వరలో బ్యాంకులు ఇన్‌కమింగ్ కాల్ సామర్థ్యాలతో వ్యక్తిగత జాతీయ కాలింగ్ నంబర్‌లను ఉపయోగించే అవకాశం ఉందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ చర్యలు ద్వారా అధికారిక కాల్స్‌ను కస్టమర్‌లు సులభంగా గుర్తించవచ్చు. అలాగే బ్యాంకింగ్ రంగ మోసాలు కూడా తగ్గే అవకాశం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం బ్యాంకులు “1600xx” సిరీస్‌లోని మల్టీ అవుట్‌బౌండ్-ఓన్లీ నంబర్‌లను ఉపయోగిస్తున్నాయి. అయితే ఇవి ఇన్‌కమింగ్ కాల్స్‌కు మద్దతు ఇవ్వవు. కాబట్టి ప్రస్తుతం బ్యాంకులు ప్రతి బ్యాంకుకు ఒక ప్రత్యేకమైన జాతీయ నంబర్‌ను కేటాయించే వ్యవస్థను ప్రతిపాదించాయి. ముఖ్యంగా 1600xx సిరీస్‌లో ఉండే నంబర్ ద్వారా ఇన్‌కమింగ్, అవుట్ గోయింగ్ సామర్థ్యాలతో వస్తుంది. 

ప్రతి బ్యాంకుకు ఒక జాతీయ నంబర్, అలాంటి నంబర్లకు ఇన్‌బౌండ్ కాల్‌లను అనుమతించడం వల్ల కస్టమర్ భద్రత, అనుభవం మరింత మెరుగుపడుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపాయని, త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.  అయితే రుణ రికవరీ కోసం ఈ నంబర్లనే ఉపయోగించే అవకాశం ఉందని చెబుతున్నారు. కానీ ఈ విధానాన్ని కొన్ని బ్యాంకులు వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా బ్యాంకులు తమ రికవరీ ప్రక్రియలను అవుట్‌సోర్స్ చేస్తున్నందున మూడో పార్టీ ఏజెంట్లు కూడా 1600xx సిరీస్‌ను ఉపయోగించాల్సి ఉంటుందా. లేదా? అనే దానిపై అనిశ్చితి ఉంది.

ఈ విషయంపై ఆర్‌బీఐ, టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నుంచి స్పష్టత కోరుతున్నట్లు పలువురు నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అదనంగా బ్యాంకులు 1600xx నంబర్‌ల వాడకంపై స్పష్టమైన మార్గదర్శకాలను, సంప్రదించడానికి ముందస్తు అనుమతి ఇచ్చిన క్లయింట్‌లకు మినహాయింపులను అభ్యరిస్తున్నాయని పేర్కొంటున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి