ఇకపై ఇంటికే డీజిల్ సరఫరా

కరోనా మహమ్మారి ప్రభావం అన్ని రంగాలపై పడింది. ఆర్థికంగా కుదేలైన కంపెనీలు తిరిగి గాడిలో పడేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా అయిల్ కంపెనీలు తమ వ్యాపారాన్ని విస్తరించడంలో భాగంగా డీజిల్ డోర్ డెలివరీ చేసేందుకు సన్నద్ధమవుతున్నాయి.

ఇకపై ఇంటికే డీజిల్ సరఫరా
Follow us
Balaraju Goud

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 22, 2020 | 4:18 PM

కరోనా మహమ్మారి ప్రభావం అన్ని రంగాలపై పడింది. ఆర్థికంగా కుదేలైన కంపెనీలు తిరిగి గాడిలో పడేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా అయిల్ కంపెనీలు తమ వ్యాపారాన్ని విస్తరించడంలో భాగంగా డీజిల్ డోర్ డెలివరీ చేసేందుకు సన్నద్ధమవుతుంది. ఇందుకు అనుగుణంగా డోర్‌‌ స్టెప్ డెలివరీస్‌ కోసం స్టార్టప్‌లను పెంచే యత్నంలో దేశీ ఆయిల్ కంపెనీలు ఫ్లాన్ చేస్తున్నాయి. బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియమ్ కార్పొరేషన్, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌లు హై స్పీడ్ డీజిల్‌ను డోర్‌‌ స్టెప్ డెలివరీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు కంపెనీలు ఇప్పటికే హోం డెలివరీ చేస్తున్నాయి. ఫ్యుయల్ బడ్డీ, రెపోస్ ఎనర్జీ, పెప్‌ ఫ్యుయల్స్, మై పెట్రోల్ పంప్‌తోపాటు హమ్ సఫర్ లాంటి ఫిర్మ్స్ ఇంటింటికి డీజిల్ సరఫరా చేస్తున్నాయి. ఇక ‘ఫ్యుయల్ డెలివరీ చేయడానికి సుమారు 30 వేల ఎంటర్‌‌ప్రెన్యూర్స్‌ ఫ్యుయల్ ఎంట్స్‌ రిజిస్టర్ చేసుకున్నారు. ఇందుకోసం రూ.9 వేల కోట్లు ఇన్వెస్ట్‌మెంట్ క్లౌడ్ ప్రపోజిషన్ అనుకుంటున్నామని రెపోస్ ఎనర్జీ సీఈవో చెరన్ వాలున్జ్ చెప్పారు. రెపోస్ ఎనర్జీకి రతన్ టాటా అండగా నిలిచింది. ఇకపై పెట్రోల్ బంక్ వెళ్లకుండానే నట్టింట్లోకి డీజిల్ వచ్చి చేరనుంది.