AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జిమ్‌ చేస్తూ గాయాలు అయితే.. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కింద కవర్‌ అవుతుందా? పూర్తి వివరాలు..

జిమ్‌లో గాయపడితే ఆరోగ్య బీమా కవరేజ్ లభిస్తుందా అనేది చాలామందికి సందేహం. సాధారణంగా, సాధారణ జిమ్ గాయాలకు బీమా కవర్ చేస్తుంది. అయితే, ప్రమాదకర క్రీడలు, మాదకద్రవ్యాల దుర్వినియోగం వంటి సందర్భాల్లో క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. OPD కవర్, వ్యక్తిగత ప్రమాద కవర్ వంటి యాడ్-ఆన్‌లు అదనపు రక్షణను అందిస్తాయి.

జిమ్‌ చేస్తూ గాయాలు అయితే.. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కింద కవర్‌ అవుతుందా? పూర్తి వివరాలు..
Gym Injury
SN Pasha
|

Updated on: Sep 10, 2025 | 4:28 PM

Share

ప్రస్తుతం కాలంలో జిమ్ వర్కౌట్లు చాలా మంది జీవితాల్లో భాగమయ్యాయి. కానీ, జిమ్‌ చేస్తూ కొంతమంది గాయపడుతుంటారు. వీరిలో చాలా మందికి హెల్త్‌ పాలసీ ఉంటుంది.  మరి అలాంటి గాయాలకు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ కవరేజ్‌ లభిస్తుందా? దీనిపై ఇన్సూరెన్స్‌ నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం..

జిమ్ సంబంధిత గాయాలు సాధారణంగా ఆరోగ్య బీమా పరిధిలోకి వస్తాయి. అయితే ​కొన్ని సందర్భాల్లో క్లెయిమ్ రిజక్ట్‌ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈ విషయంపై TATA AIG జనరల్ ఇన్సూరెన్స్ కన్స్యూమర్ అండర్ రైటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దినేష్ మోసమ్కర్ మాట్లాడుతూ.. సాధారణంగా ఆరోగ్య బీమా కింద జిమ్ సంబంధిత గాయాలకు కవరేజీ ఉంటుంది. కానీ అవి కొన్ని నిబంధనలు, షరతులకు లోబడి ఉంటాయి. ప్రమాదకరమైన క్రీడలు, మాదకద్రవ్య దుర్వినియోగం లేదా వ్యసనపరుడైన పరిస్థితులకు మాత్రం క్లైయిమ్‌ రిజక్ట్‌ అయ్యే అవకాశం ఉంది.

ఈ విషయంపై జ్యూరిచ్ కోటక్ జనరల్ ఇన్సూరెన్స్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ (అండర్ రైటింగ్ అండ్‌ ప్రొడక్ట్‌) పంకజ్ వర్మ మాట్లాడుతూ.. ఆసుపత్రి నోట్స్‌లో స్టెరాయిడ్ దుర్వినియోగం లేదా ఆల్కహాల్ మత్తు గురించి ప్రస్తావించినప్పుడు క్లెయిమ్‌లు రిజక్ట్‌ అవుతాయి. జిమ్‌ చేసే సమయంలో హై-రిస్క్ యాక్టివిటీలో భాగంగా గాయమైతే కూడా బీమా సంస్థలు క్లైయిమ్‌ రిజక్ట్‌ చేసే అవకాశం ఉంది.

అలాగే ఛాయిస్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ రాజేంద్ర ఉపాధ్యాయ మాట్లాడుతూ.. చాలా పాలసీలు జిమ్ సంబంధిత గాయాలను పాలసీ కింద కవర్‌ చేస్తాయి. కానీ ఆ చర్య వైద్య సలహాకు విరుద్ధంగా ఉంటే, లేదా స్టెరాయిడ్ల దుర్వినియోగం లేదా గుండె జబ్బుతో అతిగా శ్రమించడం వంటి నిర్లక్ష్య ప్రవర్తనను కలిగి ఉంటే, క్లెయిమ్ రిజక్ట్‌ అయ్యే ప్రమాదం ఉంది.

పాలసీకి యూజ్‌ఫుల్‌ యాడ్-ఆన్‌లు

  • జిమ్ గాయాల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన రైడర్ లేనప్పటికీ, కొన్ని యాడ్-ఆన్‌లు రక్షణను బలోపేతం చేస్తాయి. అవి ఏంటంటే..?
  • అవుట్ పేషెంట్ (OPD) కవర్:కన్సల్టేషన్లు, ఫిజియోథెరపీ, ఫార్మసీ బిల్లుల ఖర్చులకు సహాయపడుతుంది.
  • వ్యక్తిగత ప్రమాద కవర్: తీవ్రమైన ప్రమాదాలకు ఆర్థిక సహాయం అందిస్తుంది.
  • వినియోగ వస్తువుల రైడర్లు:బేస్ పాలసీలలో తరచుగా మినహాయించబడిన వైద్యేతర ఖర్చులను కవర్ చేస్తుంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం