Credit Score: మీ లోన్ దరఖాస్తులు ఎందుకు రిజెక్ట్ అవుతాయి? సిబిల్ స్కోర్ ప్రభావం ఏంటి? పూర్తి వివరాలు

సిబిల్ లేదా క్రెడిట్ స్కోర్ అనేది ఎంత ఎక్కువ ఉంటే, అంత సులభంగా మీకు లోన్లు మంజూరవుతాయి. పైగా తక్కువ వడ్డీకి లోన్లు వస్తాయి. ఈ క్రమంలో చాలా మంది తరచూ తమ సిబిల్ స్కోర్ ఎంత ఉందో తనిఖీ చేసుకుంటూ ఉంటారు. దీని వల్ల ప్రయోజనం ఉంటుందా? తరచూ సిబిల్ తనిఖీ చేసుకోవడం వల్ల నష్టం ఉంటుందా? క్రెడిట్ స్కోర్ సాఫ్ట్ ఎంక్వైరీ అంటే ఏమిటి? హార్డ్ ఎంక్వైరీ అంటే ఏమిటి?

Credit Score: మీ లోన్ దరఖాస్తులు ఎందుకు రిజెక్ట్ అవుతాయి? సిబిల్ స్కోర్ ప్రభావం ఏంటి? పూర్తి వివరాలు
Bank Loan
Follow us
Madhu

|

Updated on: Mar 11, 2024 | 2:22 PM

క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్.. మీరు కనుక ఇప్పటికే పర్సనల్ లోన్ లేదా హోమ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ వంటివి తీసుకుని ఉంటే దీని గురించి అవగాహన ఉండి ఉంటుంది. ఈ సిబిల్ లేదా క్రెడిట్ స్కోర్ అనేది ఎంత ఎక్కువ ఉంటే, అంత సులభంగా మీకు లోన్లు మంజూరవుతాయి. పైగా తక్కువ వడ్డీకి లోన్లు వస్తాయి. ఈ క్రమంలో చాలా మంది తరచూ తమ సిబిల్ స్కోర్ ఎంత ఉందో తనిఖీ చేసుకుంటూ ఉంటారు. దీని వల్ల ప్రయోజనం ఉంటుందా? తరచూ సిబిల్ తనిఖీ చేసుకోవడం వల్ల నష్టం ఉంటుందా? క్రెడిట్ స్కోర్ సాఫ్ట్ ఎంక్వైరీ అంటే ఏమిటి? హార్డ్ ఎంక్వైరీ అంటే ఏమిటి? రెండింటికీ మధ్య తేడాలు ఏంటి? అసలు ఈ క్రెడిట్ స్కోర్ కి ఎందుకంత ప్రాధాన్యం తెలుసుకుందాం రండి..

క్రెడిట్ స్కోర్ అంటే..

వ్యక్తుల ఆర్థిక పరిస్థితిని అంచనా వేసేందుకు బ్యాంకర్లకు అంటే రుణదాతలకు ఉపయోగపడే అతి ముఖ్యమైన టూల్ ఇది. దీనినే క్రెడిట్ రిపోర్టు అని అంటారు. వ్యక్తుల అప్పులు, ఈఎంఐలు.. వారు ఆ అప్పులను తిరిగి చెల్లించే విధానం గురించి, వ్యక్తుల రాబడి, వారి ఖర్చులు, అకౌంట్లో నిఖర నిల్వలు, మొత్తం అప్పులు వంటివన్నీ ఈ క్రెడిట్ రిపోర్టులో నిక్షిప్తమై ఉంటాయి. ఈ రిపోర్టు ఆధారంగా క్రెడిట్ బ్యూరో ఏజెన్సీలు స్కోర్ ని ఇస్తాయి. మీకు అప్పులు తక్కువ ఉండి.. పాత అప్పులన్నీ కూడా క్రమ పద్ధతిలో తిరిగి చెల్లించేస్తే మంచి స్కోర్ నమోదవుతుంది. సాధారణంగా ఈ క్రెడిట్ స్కోర్ 650 నుంచి 900 మధ్య ఉంటుంది. 750కిపైన ఉంటే అది మంచి క్రెడిట్ స్కోర్ గా బ్యాంకర్లు నమ్ముతారు. అలాంటి వారికి సులభంగా లోన్లు మంజూరవడంతో పాటు.. తక్కువ వడ్డీకి లోన్లు వస్తాయి.

క్రెడిట్ స్కోర్ తనిఖీ చేస్తే..

రుణాలు పొందడంతో ఈ క్రెడిట్ స్కోర్ కి అధిక ప్రాధాన్యం ఉంది కాబట్టి తరచూ దీనిని తనిఖీ చేసుకుంటూ ఉండటం మంచిది. అయితే అది ఎంత తరచూ ఉండాలి? మన స్కోర్ మనం తనిఖీ చేసుకోవడం వల్ల ఇబ్బంది ఉండదు కానీ.. బ్యాంకర్లు మన క్రెడిట్ స్కోర్ తనిఖీ చేస్తే మాత్రం మన స్కోర్ ప్రభావం పడుతుంది. అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

సాఫ్ట్ ఎంక్వైరీ అంటే..

మీరు మీ స్వంత క్రెడిట్ స్కోర్‌ను తనిఖీ చేస్తే , దీనిని సాఫ్ట్ ఎంక్వైరీ అని కూడా పిలుస్తారు. ఇది సాధారణంగా క్రెడిట్ స్కోర్‌కు హాని కలిగించదు. మీరు మీ స్వంత క్రెడిట్ స్కోర్‌ను తనిఖీ చేసినప్పుడు, క్రెడిట్ ఆఫర్ కోసం రుణదాత మిమ్మల్ని ముందస్తుగా ఆమోదించినప్పుడు లేదా ప్రచార ప్రయోజనాల కోసం కంపెనీ మీ క్రెడిట్‌ని తనిఖీ చేసినప్పుడు సాధారణంగా సాఫ్ట్ విచారణలు జరుగుతాయి. దీని వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ మరీ నెలలో రెండు మూడు సార్లు తనిఖీ చేయడం మంచిది కాదు.

హార్డ్ ఎంక్వైరీ..

మీరు లోన్ల కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు బ్యాంకర్లు మీకు రుణం ఇవ్వాలా? వద్దా అని నిర్ణయం తీసుకునే క్రమంలో మీ క్రెడిట్ స్కోర్ ను వారు తనిఖీ చేస్తారు. దీనినే హార్డ్ ఎంక్వైరీ అని పిలుస్తారు. ఈ హార్డ్ ఎంక్వైరీలు తరచూ చేస్తే మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ప్రతి హార్డ్ ఎంక్వైరీకి కొన్ని పాయింట్లు తగ్గుతూ వస్తాయి. ఈ ప్రభావం సాధారణంగా కాలక్రమేణా ఎక్కువగా ఉంటుంది. పైగా హార్డ్ ఎంక్వైరీలు ఎక్కువగా జరుగుతున్నాయంటే బ్యాంకర్లు మిమ్మల్ని రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మీరు లోన్ల కోసం బాగా ప్రయత్నాలు చేస్తున్నట్లు వారు అర్థం చేసుకుంటారు.

మీరు తనిఖీ చేసుకోవడం మంచిదే..

మీ క్రెడిట్ స్కోర్‌ను తరచుగా తనిఖీ చేయడం మంచిది. కచ్చితత్వం కోసం మీ క్రెడిట్ నివేదికను క్రమం తప్పకుండా పర్యవేక్షించడం, మీ క్రెడిట్ స్థితి గురించి తెలియజేయడం చాలా ముఖ్యం. అయితే, మీరు చాలా తరచుగా క్రెడిట్ కోసం దరఖాస్తు చేయడం గురించి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తక్కువ వ్యవధిలో ఎక్కువ హార్డ్ ఎంక్వైరీలు జరిగగితే రుణదాతలకు అది నెగిటివ్ ఫీడ్ ను అందిస్తాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..