AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Masked Aadhaar: ఆధార్‌లో ఆ సదుపాయం తెలుసా.? మీ డేటా మరింత సేఫ్

భారతదేశంలో ఇటీవల కాలంలో ఆధార్ కార్డు అనేది ప్రతి చిన్న అవసరానికి తప్పనిసరిగా మారుతుంది. వ్యక్తిగత ధ్రువీకరణతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అర్హత నిర్ణయించడానికి ఆధార్ కీలకంగా మారుతుంది. అయితే ఇటీవల సంవత్సరాల్లో ఆధార్ ఆధారిత మోసాల కేసులు పెరుగుతున్నాయి. సాధారణంగా ఈ మోసపూరిత కార్యకలాపాలతో బ్యాంకుల్లోని సొమ్మను తస్కరించేందుకు ముష్కరులు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా మనం ఏమరపాటు ఎక్కడైన ప్రూఫ్ కింద ఇచ్చే ఆధార్ కార్డుల ద్వారా ఓటీపీ, సీవీవీ లేకుండా మన ఖాతాల్లోని సొమ్మును మాయం చేస్తుంది.

Masked Aadhaar: ఆధార్‌లో ఆ సదుపాయం తెలుసా.? మీ డేటా మరింత సేఫ్
Aadhaar (representative image)
Nikhil
|

Updated on: Oct 15, 2024 | 3:30 PM

Share

భారతదేశంలో ఇటీవల కాలంలో ఆధార్ కార్డు అనేది ప్రతి చిన్న అవసరానికి తప్పనిసరిగా మారుతుంది. వ్యక్తిగత ధ్రువీకరణతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అర్హత నిర్ణయించడానికి ఆధార్ కీలకంగా మారుతుంది. అయితే ఇటీవల సంవత్సరాల్లో ఆధార్ ఆధారిత మోసాల కేసులు పెరుగుతున్నాయి. సాధారణంగా ఈ మోసపూరిత కార్యకలాపాలతో బ్యాంకుల్లోని సొమ్మను తస్కరించేందుకు ముష్కరులు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా మనం ఏమరపాటు ఎక్కడైన ప్రూఫ్ కింద ఇచ్చే ఆధార్ కార్డుల ద్వారా ఓటీపీ, సీవీవీ లేకుండా మన ఖాతాల్లోని సొమ్మును మాయం చేస్తుంది. ముఖ్యంగా ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్‌ని సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేస్తున్నారని అనేక నివేదికలు వెలువడ్డాయి. ఈ మోసాల నుంచి రక్షణగా ఆధార్‌లో కొత్త సదుపాయం ఉందని చాలా మందికి తెలియదు. అదే మాస్క్‌డ్ ఆధార్. మన పూర్తి ఆధార్ నెంబర్ కనిపించకుండా వచ్చే ఈ మాస్క్‌డ్ ఆధార్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్‌ ద్వారా చేసే ఈ స్కామ్‌లలో సిలికాన్ ఫింగర్‌ప్రింట్‌లు, అనధికారిక బయోమెట్రిక్ పరికరాలను ఉపయోగించి వ్యక్తుల ఆధార్-లింక్డ్ వేలిముద్రలను డూప్లికెట్ చేసి బాధితుల బ్యాంకు ఖాతాల నుండి నిధులు కొట్టేస్తున్నారు. అయితే ఇలాంటి మోసాలను అరికట్టేందుక  బయోమెట్రిక్‌లను లాక్ చేయడం మెరుగైన మార్గంగా ఉన్నప్పటికీ అసలు మన ఆధార్ డేటా ముష్కరుల చేతికి వెళ్లకుండా మాస్క్‌డ్ ఆధార్ ఉపయోగపడుతుంది. మాస్క్‌డ్ ఆధార్ అనేది గోప్యతను మెరుగుపరచడానికి, ఆధార్ వివరాలను బహిర్గతం చేయడాన్ని పరిమితం చేయడానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా పరిచయం చేసిన ఓ మేలైన ఫీచర్. మాస్క్‌డ్ ఆధార్‌లో ఆధార్ నంబర్‌లోని కొన్ని అంకెలు అస్పష్టంగా ఉంటాయి, అయితే పేరు, ఫోటోగ్రాఫ్, క్యూఆర్ కోడ్ వంటి కీలకమైన జనాభా సమాచారం కనిపిస్తుంది. ముఖ్యంగా ఆధార్ లెటర్, ఆధార్ పీవీసీ కార్డ్, ఈ ఆధార్ వంటి వాటిల్లో కూడా మాస్క్‌డ్ ఆధార్ అందుబాటులో ఉంది. మీ మాస్క్‌డ్ ఆధార్ పీడీఎఫ్ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేఅవుతుంది. మీరు మీ ఆధార్ నంబర్‌ను అందించాల్సిన అవసరం వచ్చినప్పుడు మీరు ఈ కార్డును ప్రింట్ చేసి ఉపయోగించవచ్చు.

ఇవి కూడా చదవండి

మాస్క్‌డ్ ఆధార్‌ ప్రయోజనాలివే

  • ఇది మీ గోప్యతను కాపాడుతుంది.
  • ఇది మీ ఆధార్ నంబర్ దుర్వినియోగం కాకుండా నిరోధిస్తుంది.
  • ఇది చాలా సంస్థల ద్వారా ఆమోదంలో ఉంది.
  • మీరు మీ ఆధార్ నంబర్‌ను షేర్ చేయాల్సిన అవసరం ఉంటే మీరు మీ పూర్తి నంబర్‌కు బదులుగా మాస్క్‌డ్ ఆధార్‌ను అందించవచ్చు. ఇది మెరుగైన గోప్యతా రక్షణను అందిస్తుంది.

మాస్క్‌డ్ ఆధార్‌ను డౌన్‌లోడ్ ఇలా

  • యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి
  • అక్కడ “మై ఆధార్” విభాగం కింద, “డౌన్‌లోడ్ ఆధార్”పై క్లిక్ చేయాలి. 
  • మీరు ఆధార్ డౌన్‌లోడ్ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ పూర్తి పేరు, పోస్ట్‌కోడ్, భద్రతా కోడ్ వంటి ఇతర అవసరమైన వివరాలతో పాటు మీ 12-అంకెల ఆధార్ నంబర్ లేదా 16-అంకెల వర్చువల్ ఐడీను నమోదు చేయాలి.
  • “మీ ప్రాధాన్యతను ఎంచుకోండి” విభాగంలో “మాస్క్డ్ ఆధార్” ఎంపికను ఎంచుకోవాలి.
  • అనంతరం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. మీ వ్యక్తిగత ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేయడానికి ఓటీపీను నమోదు చేయండి.
  • పాస్ వర్డ్‌తో సెక్యూర్డ్ పీడీఎఫ్ ఫార్మాట్‌లో మాస్క్‌డ్ ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us