LIC Policy: ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లింపులో ఇబ్బందులా.? పేటీఎమ్, ఫోన్‌పే ద్వారా ఇలా సింపుల్‌గా పే చేయండి..
ఇన్సూరెన్స్ చేసుకునే వారిలో ఎక్కువ మంది తమ మొదటి ప్రాధాన్యతను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC)కి ఇస్తుంటారనే విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా కోట్లాది మంది పాలసీదారులు ఉన్న ఈ సంస్థ ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన ప్లాన్స్‌తో..
ఇన్సూరెన్స్ చేసుకునే వారిలో ఎక్కువ మంది తమ మొదటి ప్రాధాన్యతను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC)కి ఇస్తుంటారనే విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా కోట్లాది మంది పాలసీదారులు ఉన్న ఈ సంస్థ ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన ప్లాన్స్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటూ వస్తోంది. ఇక ఇన్సూరెన్స్ చెల్లించే విషయంలో వినియోగదారులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. సాధారణంగా ప్రీమియంను ఎల్‌ఐసీ ఏజెంట్‌కు లేదా ఎల్‌ఐసీ ఆఫీసులో చెల్లిస్తుంటారు. అయితే అలా కాకుండా సింపుల్‌గా స్మార్ట్‌ఫోన్‌లో ఉండే యూపీఐ పేమెంట్స్ ద్వారా చెల్లించే వెసులుబాటు ఉందని మీకు తెలుసా.? పేఏటీఎమ్, ఫోన్‌పే ద్వారా ఎల్‌ఐసీ ప్రీమియంను ఎలా చెల్లించాలి.? ఇందు కోసం ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పేటీఎమ్ ద్వారా ఇలా చెల్లించండి..
* ఇందుకోసం ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో పేటీఎమ్ యాప్‌ను ఓపెన్ చేయాలి.
* అనంతరం అందులో ఉండే ఎల్‌ఐసీ ఇండియా ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి.
* తర్వాత మీ ఎల్‌ఐసీ పాలసీ నెంబర్‌ను ఎంటర్ చేసి, ఇతర వివరాలను అందించారు.
* ఇక చివరిగా చెల్లింపు చేయడానికి ప్రోసీడ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
* వెంటనే అమౌంట్ ఎంటర్ చేసి, మీ యూపీఐ పిన్‌తో సబ్‌మిట్ నొక్కితో సరి వెంటనే మీ ప్రీమియం చెల్లింపు పూర్తవుతుంది.
ఫోన్‌పే ద్వారా ఎలా చెల్లించాలంటే..
* ఇందుకోసం ముందుగా ఫోన్‌పే యాప్‌ను ఓపెన్ చేయాలి.
* అనంతరం ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లింపు ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.
* తర్వాత మీ ఎల్‌ఐసీ నెంబర్, ఈమెయిల్ ఐడీని ఎంటర్ చేయాలి.
* వెంటనే మీరు చెల్లించాల్సిన మొత్తం కనిపిస్తుంది. సేవింగ్స్ అకౌంట్ నుంచి లేదా డెబిట్, క్రెడిట్ కార్డు నుంచి అమౌంట్ పే చేయొచ్చు.
నోట్: ఆన్‌లైన్‌లో బిల్స్ పే చేసమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఫోన్‌కు కొందరు సైబర్ నేరగాళ్లు ఫేక్ లింక్స్ పంపిస్తూ ప్రీమియం చెల్లించుకోవచ్చని ఆకర్షిస్తుంటారు. ఇలాంటి వాటిని ఒకటికి రెండు సార్లు సరిచూసుకొని చెల్లించాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..