Cibil score: పాన్ కార్డ్ లేకుండానే సిబిల్ స్కోర్ ఎలా తెలుసుకోవాలో తెలుసా.?
సిబిల్ స్కోర్ కచ్చితంగా 700కిపైగా ఉంటేనే రుణాలు సులభంగా పొందొచ్చు. అందుకే ఎప్పటికప్పుడు సిబిల్ స్కోర్‌ను తెలుసుకుంటూ ఉంటారు. అయితే సిబిల్ స్కోర్ తెలుసుకోవాలనుకుంటే కచ్చితంగా పాన్ కార్డ్ ఉండాల్సిందేనని అనుకుంటాం. నిజానికి పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తేనే మన సిబిల్ స్కోర్ తెలుస్తుంది. అలా కాకుండా పాన్ కార్డ్ లేకుండా కూడా సిబిల్ స్కోర్ తెలుసుకోవచ్చని..
పర్సనల్ లోన్ నుంచి కార్ లోన్ వరకు ప్రతీ రుణానికి కచ్చితంగా మంచి సిబిల్ స్కోర్ ఉండాల్సిందేనని తెలిసిందే. సిబిల్ స్కోర్ ఆధారంగానే బ్యాంకులు రుణాలు అందిస్తుంటాయి. ఇక వ్యక్తి ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో అతని సిబిల్ స్కోర్ చెప్పేందుకు. తీసుకున్న రుణాలు సమయానికి చెల్లిస్తున్నాడా.? లేదా ఏమైనా బకాయిలు ఉన్నాయా ఇలా అన్ని విషయాలను సిబిల్ స్కోర్‌తో తెలిసిపోతుంది.
సిబిల్ స్కోర్ కచ్చితంగా 700కిపైగా ఉంటేనే రుణాలు సులభంగా పొందొచ్చు. అందుకే ఎప్పటికప్పుడు సిబిల్ స్కోర్‌ను తెలుసుకుంటూ ఉంటారు. అయితే సిబిల్ స్కోర్ తెలుసుకోవాలనుకుంటే కచ్చితంగా పాన్ కార్డ్ ఉండాల్సిందేనని అనుకుంటాం. నిజానికి పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తేనే మన సిబిల్ స్కోర్ తెలుస్తుంది. అలా కాకుండా పాన్ కార్డ్ లేకుండా కూడా సిబిల్ స్కోర్ తెలుసుకోవచ్చని మీకు తెలుసా.? ఇంతకీ పాన్ కార్డ్ లేకుండా సిబిల్ స్కోర్ ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
* ఇందుకోసం ముందుగా సిబిల్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
* అనంతరం పర్సలన్ సిబిల్ స్కోర్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. అనంతరం మీ ఈమెయిల్ ఐడీ ద్వారా అకౌంట్‌ను ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది.
* తర్వాత మీ పేరు ఎంటర్ చేసి, పాన్‌కార్డ్ స్థానంలో పాస్‌పోర్ట్ నెంబర్ లేదా ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి నెంబర్లను ఎంటర్ చేయాలి.
* ఇక అనంతరం మీ డేట్ ఆఫ్ బర్త్, పిన్ కోడ్‌ను ఎంటర్ చేసి, రాష్ట్రాన్ని సెలక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ బ్యాంక్ అకౌంట్‌లకు లింక్ అయిన ఫోన్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి. తర్వాత కంటిన్యూ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
* వెంటనే మీ నెంబర్‌కు ఓ ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసిన కంటిన్యూపై క్లిక్ చేయాలి.
* ఆ తర్వాత మీ అకౌంట్‌ను మీరు వినియోగిస్తున్న సిస్టమ్‌తో యాడ్ చేయాలని అనుకుంటున్నారా..? అని అడుగుతుంది. యస్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. దీంతో రజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
* ఇక అనంతరం లాగిన్ కోసం మీ మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత గో టు డాష్‌బోర్డ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. వెంటనే మీ సిబిల్ స్కోర్ ప్రత్యక్షమవుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..