Cheque Bounce Cases: దేశంలో ఎన్ని చెక్ బౌన్స్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయో తెలుసా..?

చెక్ బౌన్స్ కావడం అనే వార్తలను మనం తరచూ వింటుంటాము. ప్రముఖులు, రాజకీయవేత్తలు, సినీ నిర్మాతలు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయంటూ కేసులు కూడా నమోదవుతాయి. దేశంలో కొన్ని ఆర్థిక లావాదేవీలు నిర్వహించడానికి చెక్కులు చాలా అవసరం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాటిని అందజేస్తేనే పనులు జరుగుతాయి. కాగా..చెక్ బౌన్స్ కేసులు మన దేశంలో విపరీతంగా పెరిగాయి. దాదాపు 43 లక్షలకు పైగా పెండింగ్ లో ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి.

Cheque Bounce Cases: దేశంలో ఎన్ని చెక్ బౌన్స్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయో తెలుసా..?
Cheque Bounce Cases
Follow us
Srinu

| Edited By: Janardhan Veluru

Updated on: Dec 31, 2024 | 4:46 PM

బ్యాంకులో ఖాతా ఉన్నవారికి నిబంధనల మేరకు చెక్కుబుక్ లు మంజూరు చేస్తారు. ఎవ్వరికైనా డబ్బులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆ మొత్తాన్ని చెక్కుపై రాసి ఇవ్వవచ్చు. ఆ వ్యక్తి బ్యాంకులో ఆ చెక్కు వేసుకునేటప్పటికీ మీ ఖాతాలో సొమ్ములు ఉండాలి. లేకపోతే చెక్ బౌన్స్ అవుతుంది. అలాగే సరైన సంతకం లేకపోవడం, అక్షర దోషం, ఖాతా నంబర్ పొరపాటు, నకిలీ చెక్కు అందించడం కూడా బౌన్స్ కావడానికి కారణాలుగా ఉంటాయి. బ్యాంకింగ్ భాషలో చెక్ బౌన్స్ కావడాన్ని డిషనోర్డ్ చెక్ అంటారు. చట్ట ప్రకారం చెక్ బౌన్స్ ను శిక్షార్షమైన నేరంగా పరిగణిస్తారు.

మన దేశంలోని వివిధ కోర్టుల్లో డిసెంబర్ 18 నాటికి 43 లక్షలకు పైగా చెక్ బౌన్స్ కేసులు పెండింగ్ లో ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. రాష్ట్రాల వారీగా అత్యధికంగా 6.4 లక్షల కేసులతో రాజస్థాన్ ప్రథమస్థానంలో కొనసాగుతోంది. తర్వాత స్థానాలలో మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. భారతీయ కోర్టుల్లోని పెండింగ్ లో ఉన్న కేసులలో ట్రాఫిక్ చలాన్లు, చెక్ బౌన్స్ లు ఎక్కువగా ఉంటాయి. అయితే ట్రాఫిక్ కేసులను వర్చువల్ కోర్టుల ద్వారా పరిష్కరించే అవకాశం ఉంది. దీంతో వాటిని పరిష్కరించడం కొంచెం సులభంగానే ఉంది. కానీ చెక్ బౌన్స్ ల కేసుల స్వభావం నేపథ్యంలో వాటికి సాధారణ కోర్టులలో మాత్రమే పరిష్కరించాలి.

చెక్ బౌన్స్ కేసుల పరిష్కారంలో జాప్యానికి అనేక కారణాలు ఉన్నాయని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. తరచూ వాయిదాలు, పర్యవేక్షణ యంత్రాంగం లేకపోవడం, కాలపరిమితి లేకపోవడం, సాక్షులు తదితర అంశాలు దీనికి ప్రధానమన్నారు.

ఇవి కూడా చదవండి

నెగోషియబల్ ఇన్ స్ట్రుమెంట్ యాక్ట్ కింద కేసులను త్వరితగతిన పరిష్కరించే మార్గాలను అన్వేషించడానికి సుప్రీంకోర్టు 2021 మార్చిలో పది మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ప్రత్యేక చర్చల సాధన కోర్టులను ఏర్పాటు చేయాలని ఆ కమిటీకి ప్రతిపాదించింది. దీని సాధ్యాసాధ్యాలను అంచనా వేయడానికి మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ, యూపీలో పైలట్ ప్రాజెక్టులను అమలు చేయాలని సూచించింది. ఈ మేరకు 2022 మేలో ఏడాది పాటు 25 ప్రత్యేక కోర్టులలో పైలట్ అధ్యయనం నిర్వహించాలని ఆదేశించింది. అయితే ఆ కోర్టుల పురోగతి అస్పష్టంగానే ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

త్వరలో మార్చుకోనున్న కుజుడు.. 45 రోజులు ఈ రాశులవారు జాగ్రత్త సుమా
త్వరలో మార్చుకోనున్న కుజుడు.. 45 రోజులు ఈ రాశులవారు జాగ్రత్త సుమా
క్యాన్సర్ నుంచి బటయటపడ్డ శివన్న.. కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియో.!
క్యాన్సర్ నుంచి బటయటపడ్డ శివన్న.. కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియో.!
వందేభారత్‌లో విమానం లాంటి ప్రయాణం.. గంటకు 180 కిమీ వేగం..
వందేభారత్‌లో విమానం లాంటి ప్రయాణం.. గంటకు 180 కిమీ వేగం..
భారతదేశంలో ఆడి సూపర్ రికార్డు.. లక్ష కార్ల అమ్మకమే టార్గెట్
భారతదేశంలో ఆడి సూపర్ రికార్డు.. లక్ష కార్ల అమ్మకమే టార్గెట్
దిల్ రాజు కోసం తగ్గిన చరణ్‌.! |తొక్కిసలాట ఘటనలో బన్నీ తప్పేం ఉంది
దిల్ రాజు కోసం తగ్గిన చరణ్‌.! |తొక్కిసలాట ఘటనలో బన్నీ తప్పేం ఉంది
టెస్ట్ కెరీర్‌కు రోహిత్ గుడ్‌ బై.. సెండ్ ఆఫ్ మ్యాచ్ లేకుండానే..
టెస్ట్ కెరీర్‌కు రోహిత్ గుడ్‌ బై.. సెండ్ ఆఫ్ మ్యాచ్ లేకుండానే..
కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తున్న భామ..
కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తున్న భామ..
చూయింగ్ గమ్‌తో అధిక బరువుకు చెక్.. ఎలాగంటే..
చూయింగ్ గమ్‌తో అధిక బరువుకు చెక్.. ఎలాగంటే..
IPL వేలంలో తక్కువ, గ్రౌండ్‌లో ఎక్కువ! డారిల్ మిచెల్ సిక్సర్ల మోత
IPL వేలంలో తక్కువ, గ్రౌండ్‌లో ఎక్కువ! డారిల్ మిచెల్ సిక్సర్ల మోత
మోదీ హయాంలో దేశంలో నిరుద్యోగిత భారీగా తగ్గింది: కార్మిక మంత్రి
మోదీ హయాంలో దేశంలో నిరుద్యోగిత భారీగా తగ్గింది: కార్మిక మంత్రి
క్యాన్సర్ నుంచి బటయటపడ్డ శివన్న.. కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియో.!
క్యాన్సర్ నుంచి బటయటపడ్డ శివన్న.. కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియో.!
దిల్ రాజు కోసం తగ్గిన చరణ్‌.! |తొక్కిసలాట ఘటనలో బన్నీ తప్పేం ఉంది
దిల్ రాజు కోసం తగ్గిన చరణ్‌.! |తొక్కిసలాట ఘటనలో బన్నీ తప్పేం ఉంది
అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఛాదర్‌ను పంపిన ప్రధాని మోదీ..
అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఛాదర్‌ను పంపిన ప్రధాని మోదీ..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..