Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Card Mistakes: మీకు క్రెడిట్‌ కార్డు ఉందా? ఫైన్ల బాదుడు తప్పించుకోవాలంటే ఈ టిప్స్‌ పాటించాల్సిందే..!

క్రెడిట్‌ కార్డులు ఉపయోగించడానికి సులభంగా ఉండడంతో పాటు అనుకూలమైన పే-బ్యాక్ ఎంపికలు, తగ్గింపులు, ఆఫర్‌లు, ఇతర గొప్ప డీల్స్‌ను అందిస్తున్నాయి. అయితే సరిగ్గా ఉపయోగించకపోతే మనం చాలా సింపుల్‌గా రుణ బాధల్లో పడిపోతాం. రుణాన్ని సక్రమంగా చెల్లించకపోతే జరిమానా బాదుడు ప్రారంభం అవుతుంది.

Credit Card Mistakes: మీకు క్రెడిట్‌ కార్డు ఉందా? ఫైన్ల బాదుడు తప్పించుకోవాలంటే ఈ టిప్స్‌ పాటించాల్సిందే..!
Cards
Follow us
Srinu

|

Updated on: Aug 15, 2023 | 6:00 PM

క్రెడిట్‌ కార్డులు ఇటీవల కాలంలో మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారాయి. క్రెడిట్‌ కార్డులు ఉపయోగించడానికి సులభంగా ఉండడంతో పాటు అనుకూలమైన పే-బ్యాక్ ఎంపికలు, తగ్గింపులు, ఆఫర్‌లు, ఇతర గొప్ప డీల్స్‌ను అందిస్తున్నాయి. అయితే సరిగ్గా ఉపయోగించకపోతే మనం చాలా సింపుల్‌గా రుణ బాధల్లో పడిపోతాం. రుణాన్ని సక్రమంగా చెల్లించకపోతే జరిమానా బాదుడు ప్రారంభం అవుతుంది. మీరు కొత్త క్రెడిట్ కార్డ్ వినియోగదారుడైతే మీరు మీ పేరు, చిరునామాను తనిఖీ చేయడం, మీరు చేసిన లావాదేవీలను క్రాస్-చెక్ చేయడం, లోపాలు లేదా అనధికారిక ఛార్జీల కోసం వెతకడం వంటి వివరాలను గుర్తుంచుకోవాలి. కొత్త క్రెడిట్ కార్డ్ వినియోగదారులు కార్డుల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఓ సారి తెలుసుకుందాం.

క్రెడిట్‌ పరిమితి

క్రెడిట్ కార్డులపై మెజారిటీకి ప్రారంభ క్రెడిట్ పరిమితులు సాధారణంగా తక్కువగా ఉంటాయి. సమాచారం లేకపోవడం వల్ల కస్టమర్‌లు తమ పూర్తి క్రెడిట్ పరిమితిని ఉపయోగిస్తున్నారు. మొత్తం పరిమితిని ఉపయోగించడం మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపుతుంది. మీ క్రెడిట్ కార్డ్ పరిమితిలో 30 నుంచి 40 శాతం మాత్రమే ఉపయోగించాలని ఆర్థిక నిపుణులు సలహా ఇస్తున్నారు. 

బిల్లు చెల్లింపు

క్రెడిట్ కార్డ్ బిల్లు జనరేట్‌ అయ్యాక వినియోగదారులకు రెండు ఎంపికలు మిగిలి ఉన్నాయి. మొదటి ఎంపిక ఏమిటంటే, వినియోగదారుడు మొత్తం బిల్లును ఒకేసారి చెల్లించాలి. రెండో ఎంపిక కనీస చెల్లింపు. చాలా మంది వినియోగదారులు కనీస చెల్లింపు ఎంపికను ఎంచుకోవడానికి ఇష్టపడతారు. ఇది మీ క్రెడిట్ కార్డ్ బిల్లు బకాయి మొత్తంపై వసూలు చేయబడే అధిక-వడ్డీ రేట్లకు దారి తీస్తుంది. ఇది వినియోగదారుడును అప్పుల ఊబిలోకి నెట్టేస్తుంది. కాబట్టి క్రెడిట్ కార్డ్ బిల్లు మొత్తాన్ని ఒకేసారి చెల్లించడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి

అంతర్జాతీయ లావాదేవీలు 

కొన్ని క్రెడిట్ కార్డుల ద్వారా అంతర్జాతీయ లావాదేవీలపై తరచుగా అనేక మంచి ఆఫర్లు ఉన్నాయి. ఆఫర్ చాలా లాభదాయకంగా అనిపించవచ్చు. కానీ ఇది వినియోగదారుపై అనవసరమైన ఆర్థిక భారాన్ని కలిగిస్తుంది. చాలా మంది క్రెడిట్ కార్డు వినియోగదారులకు అంతర్జాతీయ లావాదేవీలపై, విదేశీ కరెన్సీ లావాదేవీల రుసుములను భారీ మొత్తంలో చెల్లించాల్సి ఉంటుందని తెలియదు. ఒక వినియోగదారు అంతర్జాతీయ లావాదేవీని చేయాలనుకుంటే అలాంటి చెల్లింపుల కోసం క్రెడిట్ కార్డ్‌లకు బదులుగా డెబిట్ కార్డ్‌లు లేదా ఫారెక్స్ కార్డులను ఉపయోగించడం మంచిది.

సమయానికి చెల్లింపులు

కార్డుదారులు అనవసరమైన ఛార్జీలను నివారించాలి. గడువు తేదీలో క్రెడిట్ కార్డ్ చెల్లింపు చేయాలి. వినియోగదారు చెల్లింపును స్వీకరించడానికి బ్యాంక్ ఎదురుచూసే తేదీ ఇది. చెల్లింపును వాయిదా వేయడం వల్ల అదనపు ఛార్జీలు విధిస్తారు. 

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం