Dirtiest Trains: దేశంలో అత్యంత చెత్తగా ఉండే రైళ్ల గురించి మీకు తెలుసా..?
Indian Railways: ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించేందుకు ప్రత్యేక సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. రైల్వేలో ఇంత అభివృద్ది జరుగుతున్నప్పటికీ.. కొన్ని రైళ్లలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సందర్భాలు ఉన్నాయి. కొన్ని రైళ్లలో ప్రయాణిస్తుంటే ఇలాంటి మురికి రైళ్లు కూడా ఉంటాయా?

ఆర్టిసి బస్సుల్లో ఎంత చెత్తవేసినా, ఎంతలా పాడుచేసిన నిమిషాల్లోనే క్లీన్ చేసుకోవచ్చు. కానీ రైళ్లు ఇలాకాదు.. పదుల సంఖ్యలో బోగీలు ఉంటాయి. ఒకేసారి వేల మంది ప్రయాణిస్తుంటారు. ప్రయాణికులలో బాధ్యత కొరవడితే రైళ్లన్ని చెత్తగా మారుటాయి. భారత రైల్వే ప్రయాణికుల కోసం ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించేందుకు ప్రత్యేక సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. రైల్వేలో ఇంత అభివృద్ది జరుగుతున్నప్పటికీ.. కొన్ని రైళ్లలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సందర్భాలు ఉన్నాయి. కొన్ని రైళ్లలో ప్రయాణిస్తుంటే ఇలాంటి మురికి రైళ్లు కూడా ఉంటాయా? అనే సందేహం వస్తుంటుంది. మరి అలాంటి మురికి రైళ్లు ఏవో తెలుసుకుందాం..

సీమాంచల్ ఎక్స్ప్రెస్:
ఈ రైలు మురికిగా ఉంటుంది. చాలా మంది ప్రయాణికులు దాని పరిశుభ్రత గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2023 లో రైల్వేలకు పరిశుభ్రతకు సంబంధించి 61 ఫిర్యాదులు వచ్చాయి. మీరు ఈ రైలులో టికెట్ బుక్ చేసుకోవాలని ప్లాన్ చేస్తుంటే ఆలోచించడం చాలా ముఖ్యం. ఈ రైలు ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ నుండి బీహార్‌లోని జోగ్ బాని రైల్వే స్టేషన్ మధ్య రాకపోకలు సాగిస్తుంటుంది.
సహర్సా – అమృత్‌సర్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్:
బీహార్ – పంజాబ్ వంటి ప్రధాన రాష్ట్రాలను కలిపే కీలకమైన రైళ్లలో ఇది ఒకటి. ఈ రైలులో చాలా సౌకర్యాలు లేవు. రైళ్లలో కనీస సదుపాయాలు సైతం ఉండవు. మురికి టాయిలెట్లు, మురికి క్యాబిన్లు వంటివి దర్శనమిస్తుంటాయి. ఈ రైళ్లలో ప్రయాణిస్తుంటే మురికి సీట్లలో కూర్చున్నట్లు ఉంటుంది. ఈ రైలులో ప్రయాణికులు ఎక్కడపడితే అక్కడ చెత్త వేయడం కనిపిస్తుంటుంది. నాన్ స్టాప్‌గా ప్రయాణించే ఈ రైలులో శుభ్రం చేయడానికి కనీసం సమయం ఉండదు. దీంతో చెత్త పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతుంది.
మాతా వైష్ణో దేవి-బాంద్రా స్వరాజ్ ఎక్స్‌ప్రెస్:
ఈ రైలు కూడా మురికి రైళ్ల జాబితాలో చేరింది. ఎందుకంటే ఈ రైలులోని శుభ్రత గురించి చాలా మంది ఫిర్యాదు చేశారు. ముంబై నుంచి జమ్మూకశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయానికి రాకపోకలు రైలులో ఎంతో మంది యత్రికులు ప్రయాణిస్తుంటారు.
ఫిరోజ్‌పూర్-అగర్తలా త్రిపుర సుందరి ఎక్స్‌ప్రెస్:
ఈ రైలు పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ నుంచి త్రిపురలోని అగర్తల మధ్య నడుస్తుంది. ఈ రైలు కూడా మురికిగా ఉంటుంది. దీనిపై కూడా ఎన్నో ఫిర్యాదులు ఉన్నాయి. ఈ రైలులో ఎక్కడ చూసినా చెత్తాచెదారంతో నిండి ఉంటుంది. ఇందులో ప్రయాణిస్తుంటే మునికిలో కూర్చున్నట్లు ఉంటుంది. సీట్లు అన్ని కూడా మురికిగా ఉంటాయి.
అజ్మీర్ జమ్ము తావి పూజ ఎక్స్ప్రెస్:
రాజస్థాన్‌లోని అజ్మీర్ నుండి జమ్మూ కాశ్మీర్ లోని జమ్ముతావి వరకు నడిచే ఈ సూపర్ ఫాస్ట్ ట్రైన్ మూడు నాలుగు రాష్ట్రాల మీదుగా వెయ్యి కిలోమీటర్ల పైగా ప్రయాణం చేస్తుంది. ఈ రైలు పూర్తిగా దుర్గంధంగా ఉంటుంది. ఎక్కడ చూసినా అపరిశుభ్రతే దర్శనమిస్తుంది. దుర్వాసన వెదజల్లుతుంది. దేశంలోనే అపరిశుభ్రమైన రైళ్లల్లో ఇది ఒకటి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








