AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BSNL Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.197 ప్లాన్‌లో మార్పులు.. ఇప్పుడు అన్ని ప్రయోజనాలు 54 రోజులు!

BSNL Plan: ఈ ప్లాన్ చెల్లుబాటు, ప్రయోజనాలలో పెద్ద మార్పు కనిపిస్తుంది. ఈ చౌక ప్లాన్ ఎక్కువ చెల్లుబాటును మాత్రమే కాకుండా డేటా, కాలింగ్, ఎస్‌ఎంఎస్‌ అన్ని ప్రయోజనాలను కూడా ఇస్తుంది. రూ.200 కంటే తక్కువ ధరలో వచ్చే ఈ రీఛార్జ్..

BSNL Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.197 ప్లాన్‌లో మార్పులు.. ఇప్పుడు అన్ని ప్రయోజనాలు 54 రోజులు!
Subhash Goud
|

Updated on: Jul 22, 2025 | 6:51 PM

Share

ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL కూడా వినియోగదారులను ఆకర్షించడానికి ఏ అవకాశాన్ని వదులుకోదు. సరికొత్త ప్లాన్స్‌ను ప్రవేశపెడుతూ వినియగదారులను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు కంపెనీ తన రూ.197 చౌక ప్లాన్‌లో మార్పులు చేసింది. ఈ ప్లాన్ చెల్లుబాటు, ప్రయోజనాలలో పెద్ద మార్పు కనిపిస్తుంది. ఈ చౌక ప్లాన్ ఎక్కువ చెల్లుబాటును మాత్రమే కాకుండా డేటా, కాలింగ్, ఎస్‌ఎంఎస్‌ అన్ని ప్రయోజనాలను కూడా ఇస్తుంది. రూ.200 కంటే తక్కువ ధరలో వచ్చే ఈ రీఛార్జ్ ప్లాన్‌తో మీకు ఏ ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్లాన్‌లో పెద్ద మార్పు ఏమిటో తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: Bank Holiday: ఖాతాదారులకు అలర్ట్‌.. జూలై 23న బ్యాంకులు మూసి ఉంటాయా? లేదా?

కొత్త, పాత ప్రయోజనాలు:

ఇవి కూడా చదవండి

పాత ప్రయోజనాలు: రూ. 197 ప్లాన్ తో మీరు రోజుకు 2 GB హై స్పీడ్ డేటా , అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS పొందేవారు. అలాగే ప్రయోజనాలన్నీ కూడా 15 రోజులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.  ఒక్క వ్యాలిడిటీ మాత్రం 70 రోజుల వరకు ఉండేది. తక్కువ ధరకు ఎక్కువ కాలం సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచాలనుకునే వారు ఈ ప్లాన్‌ను ఇష్టపడతారు. కానీ ఇప్పుడు ఈ ప్లాన్‌లో అందుబాటులో ఉన్న ప్రయోజనాలు మారాయి.

కొత్త ప్రయోజనాలు: ఈ ప్లాన్‌లో మీరు ఇప్పుడు మొత్తం 4 GB డేటా, 100 SMS, 300 నిమిషాల వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను పొందుతారు. కానీ ఈ ప్లాన్ ప్రయోజనాలు 15 రోజులు కాకుండా పూర్తి 54 రోజులు అందుబాటులో ఉంటాయి.

జియో 198 ప్లాన్

198 రూపాయల ప్లాన్ తో మీకు ప్రతిరోజూ 2 GB డేటా, కాలింగ్, ప్రతిరోజూ 100 SMSలు లభిస్తాయి. కానీ ఈ ప్లాన్ 14 రోజుల చెల్లుబాటును మాత్రమే ఇస్తుంది. ఈ ప్లాన్ తో జియో టీవీ, జియో AI క్లౌడ్ స్టోరేజ్ ప్రయోజనం లభిస్తుంది.

ఎయిర్‌టెల్‌ రూ.199 ప్లాన్:

ఎయిర్‌టెల్‌లో మీకు రూ.197 ప్లాన్ కనిపించదు. కానీ కంపెనీ రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్‌తో 28 రోజుల చెల్లుబాటుతో 2 GB హై స్పీడ్ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు మాత్రమే అందిస్తుంది. ఉచిత హెలోట్యూన్ ప్రయోజనం, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్, స్పామ్ హెచ్చరికలు వంటి కొన్ని అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

ఇది కూడా చదవండి: Toll Tax Free: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. వీరికి టోల్‌ ట్యాక్స్‌ ఉండదు!

ఇది కూడా చదవండి: Auto News: మీ కారు మైలేజీ ఇవ్వడం లేదా? ఈ ట్రిక్‌తో పది నిమిషాల్లోనే మైలేజీ పెంచుకోవచ్చు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..
ఓ వైపు ఏలియన్స్‌, మరో వైపు ముంచుకొస్తున్న AI ..దడ పుట్టిస్తున్న
ఓ వైపు ఏలియన్స్‌, మరో వైపు ముంచుకొస్తున్న AI ..దడ పుట్టిస్తున్న
ఇంకా మిస్టరీగానే చందానగర్ బాలుడి మరణం..
ఇంకా మిస్టరీగానే చందానగర్ బాలుడి మరణం..
విశ్వం అంతం కానుందా?ప్రపంచ ఫ్రిడ్జ్ కాలిపోతోంది..నదులు ఎర్రగామారి
విశ్వం అంతం కానుందా?ప్రపంచ ఫ్రిడ్జ్ కాలిపోతోంది..నదులు ఎర్రగామారి