Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Spicejet: స్పైస్‌జెట్‌పై కీలక నిర్ణయం తీసుకున్న డీజీసీఏ.. మరికొంత కాలం ఆంక్షలు తప్పవంటూ..

Spicejet: స్పైస్‌జెట్‌ ఎయిర్‌లెన్స్ విమానాల్లో తలెత్తిన సాంకేతిక సమస్యలు ఎంతటి చర్చకు దారి తీశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రయాణికుల భద్రతతో స్పైస్‌జెట్‌ చెలగాటమాడుతోందని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌..

Spicejet: స్పైస్‌జెట్‌పై కీలక నిర్ణయం తీసుకున్న డీజీసీఏ.. మరికొంత కాలం ఆంక్షలు తప్పవంటూ..
SpiceJet
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 22, 2022 | 8:09 AM

Spicejet: స్పైస్‌జెట్‌ ఎయిర్‌లెన్స్ విమానాల్లో తలెత్తిన సాంకేతిక సమస్యలు ఎంతటి చర్చకు దారి తీశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రయాణికుల భద్రతతో స్పైస్‌జెట్‌ చెలగాటమాడుతోందని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) ఆ సంస్థపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా స్పైస్‌జెట్‌ ఎయిర్‌లైన్స్‌పై ఆంక్షలను అక్టోబర్‌ 29 వరకు కొనసాగించాలని డీసీసీఏ నిర్ణయించింది. అక్టోబర్‌ 29వ తేదీ వరకు సగం కెపాసిటీతోనే విమానాలను నడపాలని స్పైస్‌జెట్‌ యాజమాన్యాన్ని DGCA ఆదేశించింది.

గత కొద్దినెలలుగా స్పైస్‌జెట్‌ విమానాల్లో తరచుగా సాంకేతిక లోపాలు బయపడుతున్నాయి. తృటిలో ఘోర ప్రమాదాలు తప్పుతున్నాయి. ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు రావడంతో DGCA ఈ చర్యలు తీసుకుంది. కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో స్సైస్‌జెట్‌ విమానం ఇంజన్‌లో మంటలు చెలరేగడం తీవ్ర సంచలనం రేపింది. సాంకేతిక లోపాలతో ఈ సంస్థకు చెందిన విమానాలు తరచుగా ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ అయ్యాయి. ఫిర్యాదులను పరిశీలించిన తరువాత DGCA కఠిన చర్యలు తీసుకుంది. తదుపరి ఆదేశాల అందేవరకు సంస్థకు చెందిన సగం విమానాలనే ఆపరేట్‌ చేయాలని ఆదేశించింది. అయితే ఇప్పటికి కూడా స్పైస్‌జెట్‌ యాజమాన్యం తీరుమారలేదన్న విమర్శలు వస్తున్నాయి. అందుకే ఆంక్షలు కొనసాగించాలని DGCA నిర్ణయించింది.

స్పైస్‌జెట్ కీలక నిర్ణయం..

ఎయిర్ లైన్స్ బోయింగ్, బాంబార్డియర్ ఫ్టీట్ కు చెందిన పైలెట్లు మూడు నెలల పాటు సెలవులపై వెళ్లాలని స్పైస్‌జెట్‌ యాజమాన్యం ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. ఈ కాలానికిగాను ఎలాంటి జీతం చెల్లించబడదని కూడా స్పష్టం చేసింది. ఈ నిర్ణయం పట్ల ఉద్యోగులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. అలాగే స్పైస్‌జెట్‌ ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రస్తుతం అనిశ్చితి నెలకొంది. కొన్ని రోజుల్లో ఇది సర్దుకుంటుందని అంతా భావిస్తున్నారు. అయితే స్పైస్‌జెట్‌ ఎయిర్‌లైన్స్‌ కూడా దివాళా తీస్తుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ప్రయాణాలంటే చాలు ఇంట్లో క్షణం ఉండరు ప్రపంచాన్ని చుట్టేయాలనుకుంటార
ప్రయాణాలంటే చాలు ఇంట్లో క్షణం ఉండరు ప్రపంచాన్ని చుట్టేయాలనుకుంటార
ట్రెడిషనల్ డ్రెస్ లో ముద్దు ముద్దుగా మెస్మరైజ్ చేస్తున్న బ్రిగిడ
ట్రెడిషనల్ డ్రెస్ లో ముద్దు ముద్దుగా మెస్మరైజ్ చేస్తున్న బ్రిగిడ
హిల్ స్టేషన్ పై.. హీట్ పుట్టిస్తున్న అనన్య స్టన్నింగ్ లుక్స్
హిల్ స్టేషన్ పై.. హీట్ పుట్టిస్తున్న అనన్య స్టన్నింగ్ లుక్స్
హ్యాపీ హ్యాపీ‎గా.. సంతోషంగా చిందులేస్తున్న శ్రీలీల
హ్యాపీ హ్యాపీ‎గా.. సంతోషంగా చిందులేస్తున్న శ్రీలీల
అల్లు అర్జున్‌కు చెల్లిగా.. సిద్దూజొన్నలగడ్డకు లవర్‌గా
అల్లు అర్జున్‌కు చెల్లిగా.. సిద్దూజొన్నలగడ్డకు లవర్‌గా
మరో మూడు రోజులు వర్షాలే.. ఏపీ వెదర్ రిపోర్ట్ ఇదే..
మరో మూడు రోజులు వర్షాలే.. ఏపీ వెదర్ రిపోర్ట్ ఇదే..
సిలిండర్ ధరలు పెంచారని వినూత్న నిరసన..కర్నూల్లో ఏం చేశారో చూడండి?
సిలిండర్ ధరలు పెంచారని వినూత్న నిరసన..కర్నూల్లో ఏం చేశారో చూడండి?
ఈ జ్యూస్ అమృతంతో సమానం..ప్రతిరోజూతీసుకుంటే బాడీలో మిరాకిల్స్ ఖాయం
ఈ జ్యూస్ అమృతంతో సమానం..ప్రతిరోజూతీసుకుంటే బాడీలో మిరాకిల్స్ ఖాయం
ఉజ్జయినిలో హనుమాన్ జయంతి నాడు ప్రపంచ రికార్డు? .. ఎందుకంటే
ఉజ్జయినిలో హనుమాన్ జయంతి నాడు ప్రపంచ రికార్డు? .. ఎందుకంటే
మెగాస్టార్‌తో డాన్స్ చేస్తున్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా.?
మెగాస్టార్‌తో డాన్స్ చేస్తున్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా.?