AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat Express: ఆ రెండు నగరాల మధ్య వందేభారత్ రైలు.. కేవలం గంటన్నర ప్రయాణం.!

జైపూర్-ఢిల్లీ మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్‌లో ప్రారంభమవుతుంది. బుధవారం రైల్వేశాఖ ఈ రెండు నగరాల మధ్య రైలు రూట్ మ్యాప్‌ను..

Vande Bharat Express: ఆ రెండు నగరాల మధ్య వందేభారత్ రైలు.. కేవలం గంటన్నర ప్రయాణం.!
సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో స్టాప్‌లను కలిగి ఉంది. అయితే ఇది నగరాల మధ్య 660 కిమీ ప్రయాణాన్ని కవర్ చేస్తుంది. ఈ రైలు మొదటిరోజు.. సికింద్రాబాద్‌లో ఉదయం 11.30 గంటలకు బయలుదేరి 10 స్టాప్‌లలో ఆగి.. చివరి గమ్యస్థానమైన తిరుపతి రైల్వే స్టేషన్‌కి రాత్రి 9 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు 8 గంటల 30 నిమిషాల వ్యవధిలో గమ్యస్థానానికి చేరుకోనుంది. సికింద్రాబాద్‌ - తిరుపతి ఛైర్‌కార్‌ టికెట్ ధర రూ. 1680 గా నిర్ణయించారు.
Ravi Kiran
|

Updated on: Mar 25, 2023 | 9:17 PM

Share

జైపూర్-ఢిల్లీ మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్‌లో ప్రారంభమవుతుంది. బుధవారం రైల్వేశాఖ ఈ రెండు నగరాల మధ్య రైలు రూట్ మ్యాప్‌ను విడుదల చేసింది. ఢిల్లీ, జైపూర్ మధ్య నడవనున్న వందేభారత్ రైలు మూడు స్టేషన్లలో ఆగుతుంది. గుర్గావ్, రేవారీ, అల్వార్ ఈ జాబితాలో ఉన్నాయి. మొదటి వారంలో ఈ ట్రైన్ వేగం గంటకు 72 కిలోమీటర్లు ఉంటుంది. అన్నీ సవ్యంగా సాగితే రైలు వేగాన్ని గంటకు 150 కిలోమీటర్లకు పెంతుతారు. ఇక ఢిల్లీ-జైపూర్ వందేభారత్ రైలు ట్రయల్ రన్ మార్చి 25 నుంచి ప్రారంభమవుతుంది.

ఈ రైలు ఢిల్లీ నుంచి సాయంత్రం 6.10 గంటలకు బయలుదేరి 6.45 గంటలకు గుర్గావ్ స్టేషన్‌కు చేరుకుంటుంది. అలాగే రేవారి జంక్షన్ వద్ద 7.35 గంటలకు వస్తుంది. ఆ తర్వాత రైలు రాత్రి 8.25 గంటలకు అల్వార్‌కు.. రాత్రి 10.20 గంటలకు జైపూర్‌కు చేరుతుంది. అటు ఈ రైలు మధ్యాహ్నం 12.15 గంటలకు అజ్మీర్ చేరుకుంటుంది. అంటే 442 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైలు ఆరు గంటల ఐదు నిమిషాల్లో చేరుకుంటుంది.

ఇక వందేభారత్ రైలు వేగం గంటకు 150 కి.మీకి పెరిగినప్పుడు కేవలం 1 గంట 45 నిమిషాల్లోనే జైపూర్ నుంచి ఢిల్లీ చేరుకుంటుంది. అలాగే జైపూర్ నుంచి అల్వార్‌కు ఈ రైలు కేవలం ఆరు గంటల్లో చేరుతుంది. బుధవారం మినహా అన్ని రోజులలో ఈ వందేభారత్ రైలు నడుస్తుంది.

మరోవైపు ఈ కొత్త రైలుకు సంబంధించిన ఫుడ్ మెనూని కూడా రైల్వే సిద్ధం చేసింది. ఇందులో ఆనియన్ కచోరీ, జోధ్‌పూర్ పులావ్, దాల్-బాటీ మొదలైనవి ఉంటాయి. వందేభారత్ రైళ్లలో 16 ప్యాసింజర్ కార్లు ఉంటాయి, వీటిలో 1,196 మంది ప్రయాణికులు కూర్చోగలరు. ఒక్కో కోచ్‌లో 78 సీట్లు ఉంటాయి. ఈ రైలు టికెట్ ధర రూ.800 ఉంటుందని అంచనా. అలాగే ఎగ్జిక్యూటివ్ కారు టిక్కెట్ ధర రూ.1800 ఉంటుందని సమాచారం. అయితే టికెట్ ఛార్జీలపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?