Dasara 2021 Sale: అదిరిపోయిన స్మార్ట్‌ఫోన్‌ల ఆన్‌లైన్ అమ్మకాలు.. ప్రతి గంటకూ 68 కోట్లరూపాయల వ్యాపారం!
కరోనా సంక్షోభం మధ్య ఇ-కామర్స్ కంపెనీలకు ఈ సంవత్సరం పండుగ సీజన్ చాలా బాగుంది. పండుగ అమ్మకం మొదటి వారంలో, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు 4.6 బిలియన్ డాలర్లు (32 వేల కోట్ల రూపాయలు) అమ్మకాలు సాధించాయి.
Dasara 2021 Sale: కరోనా సంక్షోభం మధ్య ఇ-కామర్స్ కంపెనీలకు ఈ సంవత్సరం పండుగ సీజన్ చాలా బాగుంది. పండుగ అమ్మకం మొదటి వారంలో, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు 4.6 బిలియన్ డాలర్లు (32 వేల కోట్ల రూపాయలు) అమ్మకాలు సాధించాయి. ఇది వార్షిక ప్రాతిపదికన 32 శాతం వృద్ధిని నమోదు చేసింది. మొత్తం ఇ-కామర్స్ వ్యాపారాల సంఖ్య ఏటా 20 శాతం పెరుగుతూ వస్తోంది. పరిశోధన సంస్థ రెడ్‌సీర్ కన్సల్టింగ్ నివేదిక ప్రకారం, ఈ పండుగ సీజన్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు కొత్త లాంచ్‌లు, ఈఎంఐ(EMI) ఎంపికలు, డిస్కౌంట్ ఆఫర్లు.. అనేక ఇతర ఆకర్షణీయమైన ప్లాన్‌ల కారణంగా ప్రతి గంటకు 68 కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించాయి. ఈ సంవత్సరం, ఫ్లిప్‌కార్ట్ తన వినియోగదారులను అమెజాన్ కంటే ఎక్కువగా ఆకర్షించింది. పండుగ విక్రయంలో దాని మార్కెట్ వాటా 64 శాతానికి దగ్గరగా ఉంది. మొదటి వారంలో, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు 32 వేల కోట్ల అమ్మకాలను సాధించాయి. సెయిల్‌లోని టైర్ -2 నగరాల కొత్త కస్టమర్ల ప్రధాన సహకారం
టైర్ -2, టైర్ -3 నగరాల నుండి పెద్ద సంఖ్యలో కొత్త కస్టమర్లు చేరుతున్నారని నివేదికలో పేర్కొన్నారు. మొత్తంమీద, టైర్ -2 కస్టమర్లలో 61 శాతం మంది కొత్త కస్టమర్లే. 2020 లో ప్రతి కస్టమర్ కొనుగోలుకు సగటు GMV (స్థూల వస్తువుల విలువ) రూ.4980, ఇది 2021 లో రూ .5034 కి పెరిగింది.
రెడ్‌సీర్ కన్సల్టింగ్ అసోసియేట్ పార్ట్‌నర్ ఉజ్వల్ చౌదరి మాట్లాడుతూ, ఈ పండగ సీజన్‌లో, ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు సరసమైన భావనపై అమ్మకాలను రూపొందించాయని చెప్పారు. ఇది కాకుండా, ఇప్పుడు కొనండి.. తరువాత చెల్లించండి అంటే BNPL, బ్యాంకులతో టై-అప్‌లు, విక్రేతల నుండి బంపర్ డిస్కౌంట్లు వినియోగదారులను ఆకర్షించాయి. కరోనా కాలంలో ఇది రెండో సెల్. 2020 సంవత్సరంలో వచ్చిన సేల్.. కరోనా వేవ్ మధ్య నిర్వహించారు. ప్రజలు ఖర్చు చేయడానికి భయపడ్డారు. ఈసారి విషయం వేరేలా ఉంది. ఆర్థిక వ్యవస్థ వేగంగా మెరుగుపడుతోంది. ప్రజలు ఖర్చు చేస్తున్నారు.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్..మైంత్రాలో సేల్ తేదీలు ఇలా..
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2021 యొక్క ఎనిమిదవ ఎడిషన్ ఈ సంవత్సరం అక్టోబర్ 3 నుండి అక్టోబర్ 10 వరకు నిర్వహించారు. అదే సమయంలో, అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ (Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2021) అక్టోబర్ 4 నుండి ప్రారంభమైంది, ఇది ఒక నెల పాటు కొనసాగుతుంది. అక్టోబర్ 3-10 మధ్య (మైంట్రా బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్ 2021) సేల్ ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ కంపెనీ మైంత్రలో నిర్వహించారు. త్వరలో ఫ్లిప్‌కార్ట్ మరోసారి దీపావళి ప్రత్యెక సేల్ ప్రారంభం కానుంది.
Dasara 2021: సీసాలో దుర్గామాత.. ఆకట్టుకుంటున్న ఒడిశా కళాకారుని అద్భుత మీనియేచర్ సృష్టి!