Cyber Fraud: తెలిసినవారి గొంతుతో ఫోన్లు.. వారికి డబ్బిచ్చారో గోవిందా.. కొత్త రకం మోసం!

డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్. 2023లో ఇలాంటి మోసాలు.. ఎంతో మందిని లక్ష్యంగా చేసుకున్నాయి. స్కామర్‌లు కాల్ చేస్తారు. వారు కొరియర్ కంపెనీ నుండి వచ్చినట్లు చెప్పుకుంటారు. మీ కొరియర్‌ను కస్టమ్ డిపార్ట్‌మెంట్ స్వాధీనం చేసుకున్నట్లు వారు పేర్కొంటారు. ఆ వ్యక్తి ఆధార్ నెంబర్‌ను చదువుతారు. ఈ ఆధార్ ఐడీకి అనేక చట్టవిరుద్ధ కార్యకలాపాలు లింక్ అయినట్టుగా చెబుతాడు. వారు కాల్‌ను పోలీసు క్రైమ్ బ్రాంచ్‌కు..

Cyber Fraud: తెలిసినవారి గొంతుతో ఫోన్లు.. వారికి డబ్బిచ్చారో గోవిందా.. కొత్త రకం మోసం!
Cyber Fraud
Follow us
Subhash Goud

|

Updated on: Jan 04, 2024 | 3:59 PM

2023లో సైబర్ మోసంలో AI-ఆధారిత డీప్‌ఫేక్ టెక్నాలజీని ఉపయోగించడాన్ని ప్రముఖంగా చెప్పుకోవాలి. FraudGPT లేదా WormGPT వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రజలను మోసం చేయడానికి వారి గొంతులను కాపీ చేసేశారు. వారిని తమ కాల్స్ తో కన్విన్స్ చేయడానికి ప్రయత్నించేవారు. అలాంటి గొంతులతోనే ఫోన్ చేసేవారు. సాంకేతికత ఎంత పెరిగినా నిజమైనదానికి, నకిలీకి మధ్య తేడాను గురించడం నిజంగానే సవాల్ విసురుతోంది. ఇక్కడ మీ గుండెలు పిండేసే ఓ కథ గురించి చెప్పుకోవాలి. ఇటువంటి మోసాల వల్ల.. కేరళలో 300 మందికి పైగా ప్రజలు… 4 కోట్ల రూపాయలకు పైగా నష్టపోయారు.

ఇన్‌కమింగ్ కాల్‌లను గుడ్డిగా నమ్మకూడదని.. ఈ స్టోరీ మనకు తెలియజేస్తుంది. మీకు తెలిసిన గొంతుతోనే ఎవరైనా ఫోన్ చేసినా.. మీరు డబ్బును పంపే ముందు తిరిగి కాల్ చేయడం చాలా ముఖ్యం. మీకు చెప్పిన ఈ స్టోరీని మీకు తెలిసినవారితోనూ ఓసారి క్రాస్ చెక్ చేయండి.

డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్. 2023లో ఇలాంటి మోసాలు.. ఎంతో మందిని లక్ష్యంగా చేసుకున్నాయి. స్కామర్‌లు కాల్ చేస్తారు. వారు కొరియర్ కంపెనీ నుండి వచ్చినట్లు చెప్పుకుంటారు. మీ కొరియర్‌ను కస్టమ్ డిపార్ట్‌మెంట్ స్వాధీనం చేసుకున్నట్లు వారు పేర్కొంటారు. ఆ వ్యక్తి ఆధార్ నెంబర్‌ను చదువుతారు. ఈ ఆధార్ ఐడీకి అనేక చట్టవిరుద్ధ కార్యకలాపాలు లింక్ అయినట్టుగా చెబుతాడు. వారు కాల్‌ను పోలీసు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేస్తారు, స్కైప్ కాల్‌లో చేరమని వారిని అడుగుతారు. వారు బాధితుల బ్యాంకు ఖాతాతో అనేక మనీలాండరింగ్ కేసులు లింక్ అయి ఉన్నాయంటారు. ఆపై డబ్బు బదిలీ అయిన తర్వాత,  స్కామర్‌లు మాయమైపోతారు. తాజాగా నోయిడాలో ఓ మహిళ ఇలాంటి మోసానికి గురై 11 లక్షల రూపాయలకు పైగా నష్టపోయింది.

ఇవి కూడా చదవండి

కస్టమ్స్, పోలీస్ క్రైమ్ బ్రాంచ్, మనీలాండరింగ్ వంటి పదాలను ఉపయోగించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. మీరు ఎటువంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలలో పాల్గొనకపోతే, అలాంటి కాల్‌లను పట్టించుకోవద్దు. 2023లో, కొరియర్ సేవల స్కాముల్లాగే.. ఉద్యోగ సంబంధిత మోసాలు కూడా బాగా పెరిగాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తామని చెప్పే కాల్స్ పెరిగాయి. YouTube వీడియోలను లైక్ చేసినా, ఆన్‌లైన్ కంటెంట్‌ను రేట్ చేసినా లేదా సోషల్ మీడియా పోస్ట్‌లను లైక్ చేసినా వారికి డబ్బులు ఇస్తామని చెబుతారు. మొదట్లో మోసగాళ్లు.. ఈ టాస్క్‌ల కోసం 500-700 రూపాయలు ఆఫర్ చేశారు. తరువాత ఉచితంగా సభ్యత్వం ఇస్తామనే నెపంతో చెల్లింపును స్టాప్ చేశారు. ముంబైలోని ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు ఇలాంటి సంఘటనే ఎదురైంది. అతనికి హోటల్ రేటింగ్ స్కీమ్‌లో పార్ట్‌టైమ్ జాబ్ ఆఫర్ వచ్చింది. అతను 18 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తానికే మోసపోయాడు.

కరెంటు బిల్లు కట్టండి, లేదంటే మీపై చర్యలు తీసుకుంటాం. ఈ సందేశం 2023లో చాలా మందిని ఇబ్బంది పెట్టింది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్‌లు సులభంగా టార్గెట్‌ అయ్యారు. బిల్లు చెల్లించకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని బెదిరిస్తూ మెసేజ్ పంపించారు. ఈ పేమెంట్ చెల్లించడానికి వీలుగా ఆ మోసగాళ్లు ఓ లింక్‌ను పంపిస్తారు. లింక్‌పై క్లిక్ చేస్తే థర్డ్ పార్టీ యాప్ ఒకటి డౌన్ లోడ్ అవుతుంది. దీంతో నెట్ బ్యాంకింగ్ ద్వారా మోసపూరిత లావాదేవీలకు కోరి మరీ అనుమతి ఇచ్చినట్టవుతుంది. ముంబైలో జరిగిన ఓ ఘటనలో ఓ సీనియర్ సిటిజన్ ఈ విధంగా 11 లక్షల రూపాయలకు పైగా మోసపోయాడు.

2022లో ఆన్‌లైన్ ఆర్థిక మోసాలు 2,296 కోట్ల రూపాయలకు చేరుకున్నాయని హోం మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి తెలియజేసింది. 2023లో అది 5,574 కోట్ల రూపాయలకు పెరిగింది. లాక్ లేని ఫోన్లు దొంగతనానికి గురైనప్పుడు హాని జరుగుతుంది. ఎందుకంటే.. బాధితులు తమకు తెలియకుండానే వివరాలను పంచుకోవడం కాని, పేమెంట్స్ ను కాని చేస్తారు. 2023తో పోలిస్తే.. 2024లో మోసాలు మూడు రెట్లు పెరిగే అవకాశముంది. అందుకే మోసపోకుండా ఉండాలంటే.. అప్రమత్తంగా ఉండటం చాలా కీలకం. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండడానికి గత ఏడాది జరిగిన తప్పుల నుంచి పాఠం నేర్చుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి