Cow Dung Products: ఆవు పేడకు ఓ మంచి బిజినెస్ ఐడియా తోడైతే కాసుల వర్షమే.. మీరూ ట్రై చేయొచ్చు
Cow dung products: హిందువులకు ఆవు ఆరాధ్య జంతువు. ఆవుని గోమాతగా భావించి పూజిస్తుంటారు. ఆవులో సకల దేవతలు ఉంటారని పురాణాలు కథనం. ఆవు పాలు తల్లిపాలతో సమానం.. ఆవు పంచకం ఔషధాలు నెలవు..
Cow Dung Products: హిందువులకు ఆవు ఆరాధ్య జంతువు. ఆవుని గోమాతగా భావించి పూజిస్తుంటారు. ఆవులో సకల దేవతలు ఉంటారని పురాణాలు కథనం. ఆవు పాలు తల్లిపాలతో సమానం.. ఆవు పంచకం ఔషధాలు నెలవు.. ఇక గ్రామాలలో ఆవు పేడను పిడకలుగా తయారు చేసి వంటచెరకుగా ఉపయోగిస్తారు. ఇక ఇంట్లో పాడి ఉన్న ఇల్లాలికి చేతి నిండా పనే.. చేతి నిండా డబ్బులే.. పాడితో పాలు, పెరుగు, వెన్న, నెయ్యి చేసి అమ్ముకుని డబ్బులు సంపాదించుకుంటారు గ్రామీణ మహిళలు. అయితే ఇప్పుడు ఆవు పేడకు ఫుల్ డిమాండ్ పెరిగింది. దీంతో ఆదాయవనరుగా మార్చుకుని తమలోని సృజనాత్మకతకు పదును పెట్టి రకరకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నారు ఛత్తీస్‌ఘడ్‌లోని మహిళలు. వివరాల్లోకి వెళ్తే..
ఛత్తీస్‌గఢ్‌లో ‘గోధన్ న్యయ్ యోజన’ అనే పథకాన్ని ప్రారంభించింది. పాడి రైతుల నుండి ఆవు పేడను కిలోకు రూ. 2 చొప్పున కొనుగోలు చేసి వారికి ఆర్థిక సాయం అందిస్తోంది. రాజ్‌నంద్‌గావ్ జిల్లాలోని చౌరియా, అంబగోర్, తహ్‌షిల్, గుమ్కా, సింఘాల, తెందెసాల్ లతో పాటు మరికొన్ని ఎన్నో గ్రామాల్లోని ఆడవారికి ఆవు పేడ ఆదాయ వనరుగా మారింది. ఈ గ్రామాలోని మహిళలు స్వయం సహాయక బృందాలుగా ఏర్పడి ఆవుపేడతో పిడకలే కాకుండా విగ్రహాలు, మొబైల్ ఫోన్‌స్టాండ్లు, నర్సరీ పాట్స్ వంటి ఎన్నో ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. వాటిని మార్కెట్ చేసి చక్కటి ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ ఆవు పేడతో చేసిన ఉత్పత్తులను ఈ కామర్స్ ద్వారా మార్కెట్ చేయడంతో అంతర్జాతీయ స్థాయికి తీసుకుని వెళ్లారు. దీంతో రోజు రోజుకీ అమ్మలు పెరిగాయి. ఈ వస్తువుల అమ్మకంగా ద్వారా చక్కటి ఆదాయాన్ని పొందుతున్నారు. ఒకప్పుడు మహిళలు చేస్తున్న ఈ వ్యాపారాన్ని ఎగతాళి చేసేవారు సైతం ఇప్పుడు ఆవు పేడే లక్ష్మీదేవి అని అంటున్నారు.
ఇప్పటి వరకు , మహిళా స్వయం సహాయక బృందాలు తయారు చేసిన రూ. 1.5 కోట్ల విలువైన 53,000 క్వింటాళ్ల వర్మీ కంపోస్ట్ అమ్ముడయ్యాయి. ఇంతకుముందు, ఎరువును పశువుల కొట్టాలలో మాత్రమే విక్రయించేవారు.. కానీ ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుండి కూడా ఎరువుకు డిమాండ్ పెరగడంతో అమెజాన్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారు. దీంతో ఆవు పేడ వ్యాపారాన్ని అధ్యయనం చేయడానికి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమబెంగాల్ వంటి ఎన్నో రాష్ట్రాల నుంచి మహిళలు ఎంతోమంది బృందాలుగా ఛత్తీస్ ఘడ్ లోని రాజ్‌నంద్‌గావ్ జిల్లాకు వస్తుంటారు. ఆయా గ్రామాల్లోని మహిళ నుంచి ఎన్నో విషయాలు అడిగి తెలుసుకుంటారు. అధికారులు కూడా ఆవు పేడ వ్యాపారం గురించి ఆరాతీయడానికి వస్తుంటారు. ఇదే విషయంపై స్పందిస్తూ అంబగోర్ గ్రామానికి చెందిన సబిత .. ఒకప్పుడు మా పొరుగింటి ఆవిడ పేడ వ్యాపారం గురించి చెబితే నవ్వింది.. ఇప్పుడు ఆమె కూడా ఈ వ్యాపారం చేయడానికి ఆసక్తి చూపిస్తుందని తెలిపింది.
ఉత్తరప్రదేశ్‌లో అపర్ణ అనే లాయర్ .. ఆవుపేడ వ్యాపారంలోకి అడుగు పెట్టింది. తన వ్యాపారం కోసం 10 ఎకరాల విస్తీర్ణంలో గోశాల నిర్వహిస్తు..దాదాపు 130 ఆవుల్ని పెంచుతున్నారు. వాటిపేడతో రకరకాల వస్తువులు తయారుచేసి మార్కెట్‌లో విక్రయిస్తు లాయర్ గా ఉన్నప్పటి సంపాదన కంటే ఎఎక్కువగా సంపాదిస్తున్నారు.
అంతేకాదు ఇప్పుడు అపర్ణ తన వద్దకు వచ్చే మహిళలకు ‘ఆవుపేడతో ఎలాంటి వస్తువులు తయారుచేయవచ్చు?’ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?’‘మార్కెట్ ఎలా చేసుకోవాలి? పేడ నుంచి వర్మీ కంపోస్ట్ ఎలా తయారు చేస్తారు?వంటి విషయాల్లో ఇతరులకు సలహాలు ఇస్తుంది. ఇప్పుడిప్పుడే ఆవు పేడతో వ్యాపారం విషయం తెలిసి మరిన్ని రాష్ట్రాల్లోని మహిళలు తమ మెదడకు పదును పెడుతున్నారు. ఛత్తీస్ గడ్ మహిళల బాటలోనే పంజాబ్ లోని పలు గ్రామాల్లో మహిళలు ఆవు పేడతో బిజినెస్ మొదలు పెట్టారు. గతంలో ఆవు పేడను పడేసేవారు కాస్తా ఇప్పుడు మాత్రం ఆవు పేడను బంగారంతో సమానంగా చూసుకుంటున్నారు. 10 మంది మహిళలు ఒక బృందంగా ఏర్పడి పిడకలతో పాటు రకరకాల వస్తువులు తయారు చేసి మార్కెట్‌లో విక్రయిస్తు ఆదాయాన్ని పొందుతున్నారు. ఇప్పుడు వీరి బాటలోనే ఎన్నో మహిళాబృందాలు పయనిస్తున్నాయి. ఆవుపేడను ఆదాయ వనరుగా మార్చుకుని ఆర్ధికంగా ఒక మెట్టు పైకి ఎదుగుతున్నారు.
Also Read: త్వరలో బుల్లితెరపై సందడి చేయనున్న బిగ్‌బాస్.. ఆగష్టు 22 నుంచి కంటెస్టెంట్లు క్వారంటైన్‌లోకి