Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Taxpayers Alert: మార్చి ముగిసేలోపు ఇవి పూర్తి చేయండి.. లేకుంటే చాలా నష్టపోతారు.. వివరాలు తెలుసుకోండి..

ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న ప్రస్తుత తరుణంగా పన్ను చెల్లింపులు దారులు పలు విషయాలను సరిచూసుకోవాల్సి ఉంటుంది. కొన్ని ప్రధాన అంశాలు ఈ నెలాఖరులోపే పూర్తి చేయాల్సి ఉంటుంది. అవేంటో చూద్దాం..

Taxpayers Alert: మార్చి ముగిసేలోపు ఇవి పూర్తి చేయండి.. లేకుంటే చాలా నష్టపోతారు.. వివరాలు తెలుసుకోండి..
Income Tax
Follow us
Madhu

|

Updated on: Mar 13, 2023 | 1:30 PM

మార్చి నెలతో 2022-23 ఆర్థిక సంవ్సతరం ముగుస్తోంది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతోంది. అయితే ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న ప్రస్తుత తరుణంగా పన్ను చెల్లింపు దారులు పలు విషయాలను సరిచూసుకోవాల్సి ఉంటుంది. అలాగే పాన్ నంబర్, ఆధార్ నంబర్ లింక్ చేయడం, అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించడం, అప్ డేటెడ్ ఐటీఆర్ దాఖలు చేయడం వంటి ప్రధాన్య అంశాలు ఈ నెలాఖరులోపే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ చేయలేకపోతే పెనాల్టీ పడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆర్థిక సంవత్సరం ముగింపు సమయంలో ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులు చేయవలసిన ప్రాధాన్యమైన ఐదు పనుల గురించి ఇప్పుడు చూద్దాం..

పాన్, ఆధార్ లింక్.. ఇప్పటికే దీనికి సంబంధించిన డెడ్ లైన్ చాలా సార్లు పొడిగించారు. అయితే 2023 మార్చి 31 నాటికి భారతీయ పౌరులైన ప్రతి ఒక్కరూ తమ ఆధార్ కార్డుకి పాన్ నంబర్ ను లింక్ చేయాల్సిందేనని ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చెప్పింది. లేకుంటే పెనాల్టీ విధిస్తామని ప్రకటించింది. అప్పటి చేయకపోతే మీ పాన్ కార్డు ఇన్ యాక్టివ్ అయిపోతుందని హెచ్చరించింది.

ఐటీఆర్ దాఖలు.. 2023, మార్చి 31 నాటికి అప్ డేటెడ్ ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. 2019-20, 2020-221 కి సంబంధించిన ఐటీఆర్ లను సబ్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత పన్ను చెల్లింపు దారులు అప్ డేటెడ్ ఐటీఆర్ ను దాఖలు చేయలేరు.

ఇవి కూడా చదవండి

ట్యాక్స్ సేవింగ్స్ ఇన్మెవెస్ట్ మెంట్స్.. ఆర్థిక సంవత్సరం ముగింపు సమయానికి వచ్చేసరికి మీరు ట్యాక్స్ సేవింగ్ పథకాలలో ఏమైన పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఈ లోపే ప్రారంభించాల్సి ఉంటుంది. పీపీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్, బ్యాంక్ ఎఫ్ డీ వంటివి వాటిల్లో ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపే పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది.

అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్.. ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ లెక్కల ప్రకారం అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్ చేయడానికి మార్చి 15 ఆఖరు తేది. రూ. 10,000 మించిన పన్నులను వెంటనే చెల్లించాల్సి ఉంటుంది.

ట్యాక్స్ సేవింగ్ ఇన్స్యూరెన్స్ ఆప్షన్స్.. పన్ను చెల్లింపుదారులు పన్ను ఆదా మార్గాలతో పాటు జీవిత బీమాను చూసుకోవడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆదాయపు పన్ను రాయితీని క్లెయిమ్ చేయడానికి జీతం పొందే వ్యక్తికి బీమా పాలసీ సహాయం చేయగలిగినప్పటికీ, దానిని విడిగా పరిగణించాలి. అలాగే రూ. 5 లక్షల వార్షిక ప్రీమియం కంటే ఎక్కువ జీవిత బీమా పాలసీలపై వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1, 2023 నుండి పన్ను విధించబడతాయని గమనించాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..