Hero Splendor Plus Bike: బంపర్ ఆఫర్స్.. రూ.18 వేలకే Hero Splendor Plus బైక్..! అతి తక్కువ EMIతో అందుబాటులో..

హీరో స్ప్లెండర్ ప్లస్ దాని మైలేజ్, విశ్వసనీయతకు ప్రసిద్ధి చెందింది. మీరు కూడా ఈ బైక్ కొనాలని ఆలోచిస్తే ఇప్పుడు కేవలం 18వేల రూపాయలు కడితే చాలు.. ఈ బైక్‌ మీ సొంతకానుంది. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

Hero Splendor Plus Bike: బంపర్ ఆఫర్స్.. రూ.18 వేలకే Hero Splendor Plus బైక్..! అతి తక్కువ EMIతో అందుబాటులో..
Hero Splendor Plus
Follow us

|

Updated on: Mar 13, 2023 | 1:28 PM

హీరో స్ప్లెండర్ ప్లస్ దాని మైలేజ్, విశ్వసనీయతకు ప్రసిద్ధి చెందిన బైక్‌. మీరు కూడా ఈ బైక్ కొనాలని ఆలోచిస్తే కేవలం ఇప్పుడు కేవలం 18 వేలకే ఇప్పుడు ఈ బండి మీ ఇంటికి వచ్చేస్తుంది. భారతదేశంలో సరసమైన, ప్రజాదరణ పొందిన కమ్యూటర్ బైక్‌ల విషయానికి వస్తే, హీరో స్ప్లెండర్ పేరు మొదటగా పరిగణనలోకి వస్తుంది. దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న మోటార్‌సైకిల్ ఇది. స్ప్లెండర్ ప్లస్ 97.2cc ఎయిర్-కూల్డ్, ఫోర్-స్ట్రోక్ సింగిల్-సిలిండర్ ఇంజన్‌తో పనిచేస్తుంది, ఇది 8000 rpm వద్ద 8.02 PS గరిష్ట శక్తిని, 6000 rpm 8.05 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హీరో స్ప్లెండర్ ప్లస్ దాని మైలేజ్, విశ్వసనీయతకు ప్రసిద్ధి చెందింది. మీరు కూడా ఈ బైక్ కొనాలని ఆలోచిస్తే ఇప్పుడు కేవలం 18వేల రూపాయలు కడితే చాలు.. ఈ బైక్‌ మీ సొంతకానుంది. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

హీరో స్ప్లెండర్ ధర..

హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ మొత్తం 4 వేరియంట్లలో వస్తుంది. దీని బేస్ వేరియంట్ (డ్రమ్ సెల్ఫ్ స్టార్ట్) ధర 72 వేల రూపాయల నుండి ప్రారంభమవుతుంది. టాప్ వేరియంట్ (i3s డ్రమ్ సెల్ఫ్ స్టార్ట్ మాట్ గోల్డ్) ధర రూ.74,400. ఈ ధర ఢిల్లీ ఎక్స్-షోరూమ్. దీని ఆన్-రోడ్ ధర ఇంకా ఎక్కువ. అయితే, మీరు కోరుకుంటే, మీరు బైక్‌ను లోన్‌పై కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ మేము మీకు Splendor Plus EMI కాలిక్యులేటర్‌ని మీకు అందుబాటులో ఉంది.

18 వేలకే మీ ఇంటికి బైక్..

ఉదాహరణకు, మీరు బైక్ టాప్ వేరియంట్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నారని అనుకుందాం. మీ ఆన్-రోడ్ ధర రూ. 86,864. ఇప్పుడు మీరు ఈ వేరియంట్‌ను లోన్‌పై కొనుగోలు చేస్తున్నారని అనుకుందాం. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే, మీరు ఎంచుకున్న దాన్ని బట్టి ఎక్కువ డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు. వివిధ బ్యాంకులలో వడ్డీ రేటు భిన్నంగా ఉంటుంది. లోన్ కాలపరిమితి 1 నుండి 7 సంవత్సరాల వరకు కూడా ఎంచుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఉదాహరణకు, రూ. 18,000 (20%), వడ్డీ రేటు 10%, 3 సంవత్సరాల రుణ కాలవ్యవధిని గమనించినట్టయితే, మీరు ప్రతి నెలా రూ. 2,222 EMI చెల్లించాలి. మీరు మొత్తం లోన్ మొత్తానికి (రూ. 68,864) అదనంగా రూ. 11,128 చెల్లిస్తారు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..