Business Ideas: మీ లైఫ్ మార్చేసే బిజినెస్..! తక్కువ పెట్టుబడి.. భారీ ఆదాయం! ఒక్కసారి సెట్ అయితే తరతరాలు ఉంటుంది
వ్యాపారం చేయాలనుకుంటున్నారా? నిలకడైన డిమాండ్ గల కాఫీ షాప్ వ్యాపారం మీకు మంచి ఎంపిక. సరైన ప్రణాళిక, నాణ్యమైన సేవలు, ఆకర్షణీయమైన వాతావరణం, విద్యా సంస్థలు లేదా ఐటీ కంపెనీల దగ్గర మంచి లొకేషన్ ఎంచుకోవడం ద్వారా భారీ లాభాలు పొందవచ్చు.

వ్యాపారం చేయాలనే కల చాలా మందికి ఉంటుంది. కానీ, పెట్టుబడి లేక, ధైర్యం చేయలేక, ఏ వ్యాపారం చేయాలో సరైన అవగాహన లేక చాలా మంది బ్యాక్ స్టెప్ వేస్తుంటారు. కానీ బిజినెస్‌లు సరిగ్గా ప్లాన్ చేసి స్టార్ట్ చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది. అలాంటి ఓ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఎప్పుడూ డిమాండ్ తగ్గని బిజినెస్ ఏదైనా ఉందంటే అంది టీ, కాఫీ షాప్. ఎప్పుడు కస్టమర్లతో కళకళలాడుతూ ఉంటుంది.
అయితే సాధారణ టీ కొట్టులా కాకుండా.. కాస్త క్లాస్‌గా రిచ్‌గా కాఫీ షాప్ ప్లాన్ చేస్తే లాంగ్ లైఫ్‌తో పాటు మంచి ఆదాయం కూడా ఉంటుంది. ఇప్పటికీ ఈ ట్రెండ్ కొనసాగుతోంది. కొంతమంది కాఫీ షాప్ ఫ్రాంచైజ్ కూడా ఆఫర్ చేస్తుంటారు. అయితే అలాంటి ఫ్రాంచైజ్ తీసుకోవడం కంటే కూడా సొంతంగా మీరే ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవడం ఉత్తమం. మంచి క్వాలిటీతో మంచి సిట్టింగ్ ఏరియాతో సరైన లోకేషన్‌లో కనుక కాఫీ షాప్ పెడితే సక్సెస్ ఈజీ కావొచ్చు. ముఖ్యంగా విద్యాసంస్థలు, ఐటీ కంపెనీలు, బిజీ కమర్షియల్ ఏరియాలు కాఫీ షాపులకు బెస్ట్ లొకేషన్లు. కేవలం కాఫీ మాత్రమే కాకుండా చిన్నపాటి స్నాక్స్, చైనీస్ లేదా కాంటినెంటల్ వంటకాలు, నార్త్ ఇండియన్ ఫుడ్, ఫాస్ట్‌ఫుడ్ ఐటమ్స్ అందుబాటులో ఉంచితే ఎక్కువ బిజినెస్ అవుతుంది.
కాఫీ షాప్ విజయానికి క్వాలిటీ, అంబియన్స్, సర్వీస్ ఈ మూడు కీలకం. మంచి లైటింగ్, కంఫర్టబుల్ సీటింగ్, ఆకర్షణీయమైన ఇన్‌టీరియర్ ఉంటే యువత ఎక్కువసేపు అక్కడే గడపడానికి ఇష్టపడతారు. అదనంగా లైవ్ మ్యూజిక్ సెషన్స్, వీకెండ్ ఆఫర్లు, స్టూడెంట్ డిస్కౌంట్స్ వంటి ప్రత్యేకతలు ఇవ్వడం ద్వారా బిజినెస్ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




