Gold Hallmarking: హాల్‌మార్కింగ్‌ విధానంలో కేంద్రం కొత్త నిబంధనలు.. ఆగస్టు 31 నుంచి మరనున్న రూల్స్‌..!

Gold Hallmarking: బంగారు అభరణాలపై హాల్‌మార్క్‌ స్వచ్చతకు నిదర్శనం. చాలా మందికి హాల్‌మార్క్‌ అనే విషయం పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. బంగారం విషయంలో అవగాహన..

Gold Hallmarking: హాల్‌మార్కింగ్‌ విధానంలో కేంద్రం కొత్త నిబంధనలు.. ఆగస్టు 31 నుంచి మరనున్న రూల్స్‌..!
Gold Hallmarking
Follow us

|

Updated on: Aug 14, 2021 | 8:10 PM

Gold Hallmarking: బంగారు అభరణాలపై హాల్‌మార్క్‌ స్వచ్చతకు నిదర్శనం. చాలా మందికి హాల్‌మార్క్‌ అనే విషయం పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. బంగారం విషయంలో అవగాహన ఉన్నవారికి మాత్రమే తెలిసి ఉంటుంది. అయితే ఆగస్టు 31 నుంచి కొత్త నిబంధనలు అమలు చేయనుంది కేంద్ర ప్రభుత్వం. హాల్‌మార్కింగ్‌ లేని అభరణాలు అమ్మితే కేంద్రం చర్యలు చేపట్టనుంది. బులియన్‌ వ్యాపారులు హాల్‌మార్కింగ్‌ కోసం ఒక్కసారి మాత్రమే నమోదు చేసుకోవాలి. తర్వాత పునరుద్ధరణ అనేది ఉండదు. హాల్‌ మార్కింగ్‌ అనేది తప్పనిసరిగా పాటించాలి. దీని వల్ల వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది బంగారం స్వేచ్ఛత గురించి తెలియజేస్తుంది. హాల్‌మార్కింగ్‌లేని అభరణాలు విక్రయించినట్లయితే కేంద్ర చర్యలు చేపట్టనుంది. అంతేకాదు అలాంటి అభరణాల విలువ కూడా తగ్గిపోతుంది. మీరు ఏవైనా బంగారు అభరణాలు కొనుగోలు చేసినట్లయితే ముందుగా హాల్‌మార్కింగ్‌ ఉందో లేదో తెలుసుకోండి. హాల్‌మార్కింగ్‌ ఉన్న నగలను కొనుగోలు చేసినట్లయితే తర్వాత అమ్మేటప్పుడు కూడా పూర్తి ధరను పొందుతారు. లేకపోతే వాటి విలువ తగ్గిపోతుంది. అయితే చిన్న చిన్న వ్యాపారులు ఈ హాల్‌ మార్కింగ్‌ విధానానికి పెద్దగా అలవాటు పడలేదు. బంగారు అభరణాలపై కేంద్ర ప్రభుత్వం హాల్‌ మార్క్‌ విధానం తప్పనిసరి చేయడం వల్ల చిన్న చిన్న వ్యాపారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అందుకే సంస్థలు కంప్యూటర్‌, హాల్‌ మార్కింగ్‌ పరిజ్ఞానం ఉన్న ఉద్యోగులను నియమించుకోవాలి.

బంగారు నగల అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్‌ 15 నుంచి బంగారం అమ్మకాలపై హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి అమలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆగస్టు 31 తర్వాత హాల్ మార్కింగ్ విధానం పటిష్టంగా అమలు చేయనుంది కేంద్రం.  బంగారం స్వచ్ఛతకు ధ్రువీకరణే హాల్‌మార్కింగ్‌. ప్రస్తుతానికి ఇది ఐచ్ఛికం. ఇప్పటికే పెద్ద పెద్ద ఆభరణ వర్తకులు హాల్‌మార్కింగ్‌ నగలనే విక్రయిస్తున్నారు. దేశవ్యాప్తంగా బంగారు ఆభరణాలు, ఉత్పత్తులకు హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి. అయితే ఈ విధానాన్ని 2019 నవంబరులో ప్రభుత్వం ప్రకటించింది

హాల్‌మార్కింగ్‌ అంటే ఏమిటి..?

మీరు బంగారం కొనుగోలు చేసే సమయంలో ఒరిజినల్‌ నగలను ఎలా గుర్తించాలో తెలియదు. చాలా మందికి ఒరిజినల్‌, నకిలీవి అనేవి తెలియవు. కొందరు చూడాగానే గుర్తిస్తారు. బంగారం నాణ్యతను గుర్తించేందుకు మీకు హాల్‌మార్కింగ్‌ ఉపయోగపడుతుంది. నగల షాపుల్లో కేవలం హాల్‌మార్కింగ్‌ ఉన్న బంగారు అభరణాలను మాత్రమే అమ్మాలి. హాల్‌మార్కింగ్‌ లేని నగలు అమ్మడానికి వీలులేదు. అలా అమ్మినట్లయితే చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. ప్రస్తుతం నగల షాపుల్లో హాల్‌మార్కింగ్‌ లేని నగలు కూడా లభిస్తున్నాయి.

బంగారం నగలు కొనుగోలు చేసే కొందరు హాల్‌మార్కింగ్‌ తప్పనిసరిగా కావాలని అడిడే వారు కూడా ఉన్నారు. అయితే మీరు ఇప్పటికే నగలు కొన్నట్లయితే స్వచ్ఛత గురించి తెలుసుకోవాలంటే బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (BIS) గుర్తింపు పొందిన అస్సేయింగ్‌ అండ్‌ హాల్‌మార్కింగ్‌ సెంటర్‌కు వెళ్లవచ్చు. ఈ సెంటర్ ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాల్లోనూ ఉంటాయి. ఎక్కడెక్కడ ఈ సెంటర్లు ఉన్నాయో తెలుసుకోవడానికి వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం 40 శాతం మాత్రమే బంగారు అభరణాలు హాల్‌ మార్క్‌ నిబంధనలు పాటిస్తున్నారు. ఈ విధానం ద్వారా కస్టమర్లు స్వచ్ఛమైన బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు.

ఇవీ కూడా చదవండి

Emojis: ఎమోజీలు పసుపు రంగులో ఎందుకు ఉంటాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా.? అసలు కారణం ఇదే..!

LIC: కస్టమర్లు అలర్ట్‌.. మీరు ఎల్‌ఐసీ పాలసీని తీసుకున్నారా.? అయితే ఇలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండండి..!

Bank FD: ఈ బ్యాంకు మూడు సంవత్సరాల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అధిక శాతం వడ్డీ.. ఆగస్టు 16 వరకు అవకాశం..!

Latest Articles
ఐస్ క్రీం తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని తినకండి..
ఐస్ క్రీం తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని తినకండి..
చింతపండు బస్తాలే అనుకున్నారు.. లోపల చెక్ చేయగా...
చింతపండు బస్తాలే అనుకున్నారు.. లోపల చెక్ చేయగా...
పోలా..అదిరిపోలా..4 చక్రాలతో ఎలక్ట్రిక్ బైక్.. వీడియో చూస్తే ఫిదా
పోలా..అదిరిపోలా..4 చక్రాలతో ఎలక్ట్రిక్ బైక్.. వీడియో చూస్తే ఫిదా
జాబ్‌ కోసం ప్రయత్నించి ఫెయిల్ అయిన యువతి నేడు సక్సెస్‌కు చిరునామా
జాబ్‌ కోసం ప్రయత్నించి ఫెయిల్ అయిన యువతి నేడు సక్సెస్‌కు చిరునామా
ఏపీ కొత్త డీజీపీగా ఆయనకు అవకాశం..? రేసులో నలుగురు ఐపీఎస్‎లు..
ఏపీ కొత్త డీజీపీగా ఆయనకు అవకాశం..? రేసులో నలుగురు ఐపీఎస్‎లు..
నేను చనిపోయానంటూ వార్తలు పుట్టించారు..
నేను చనిపోయానంటూ వార్తలు పుట్టించారు..
ఈ హైవేను నిర్మించిన తీరుపై ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యం
ఈ హైవేను నిర్మించిన తీరుపై ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యం
బయటకు వెళ్లి ఏం తినేటట్టు లేదు.. చివరికి ఐస్ క్రీం కూడా
బయటకు వెళ్లి ఏం తినేటట్టు లేదు.. చివరికి ఐస్ క్రీం కూడా
ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.. నేటి రాశి ఫలాలు
ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.. నేటి రాశి ఫలాలు
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ రిలీజ్
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ రిలీజ్