New Rules: ఆధార్, పాన్ విషయంలో కేంద్రం కొత్త రూల్స్.. ఎన్నడూ లేనంతగా కొత్త నిబంధనలు.. కీలక మార్పులు ఇవే..
దేశ ప్రజల సమాచారం, సున్నితమైన వివరాలకు భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం కొత్త క్లౌడ్ ఎంపిక ఫ్రేమ్ వర్క్‌ను తీసుకొచ్చింది. ఇక నుంచి పబ్లిక్ ప్రొవైడర్ల వద్ద డేటా హోస్ట్ చేయవద్దని సూచించింది. ప్రభుత్వ సదుపాయాలను మాత్రమే ఉపయోగించాలని తెలిపింది.

ఆధార్, పాన్, ఓటర్ ఐడీ, యూపీఐ లాంటి సున్నితమైన డేటాకు భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డేటా దుర్వినియోగం కాకుండా సురక్షితంగా ఉంచేందుకు కఠినతరమైన నిబంధలను విడుదల చేసింది. ఈ మేరకు ఇప్పటివరకు ఉన్న క్లౌడ్ హోస్ట్ ఫ్రేమ్‌వర్క్‌లో కీలక మార్పులు చేసింది. ఇక నుంచి ఆధార్, పాన్, యూపీఐ, పాన్, పాస్ పోర్ట్ లాంటి ప్రభుత్వ డేటాను పబ్లిక్ క్లౌడ్ ప్రొవైడర్ల దగ్గర స్టోర్ చేయడానికి వీల్దేదు. కేవలం ప్రభుత్వ నియంత్రణలోకి క్లౌడ్ మౌలిక సదుపాయాల్లో మాత్రమే హోస్ట్ చేయాల్సి ఉంటుందని కేంద్రం కొత్త నిబంధనల్లో పేర్కొంది.
డేటాకు మరింత భద్రత
సున్నితమైన డేటాకు భద్రత కల్పించడంలో భాగంగా విదేశీయులు హ్యాక్ చేయడం, డేటా లీక్‌లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం, సిస్టమ్ బలహీనతల ప్రమాదాల నుంచి డేటాను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి డేటా స్టోరేజ్ కోసం కమర్షియల్ పబ్లిక్ క్లౌడ్ ప్రొవైడర్లపై ఆధారపడకూడదు. ఇక నుంచి ప్రభుత్వ ఆధీనంతోని క్లౌడ్ వ్యవస్థలోనే హోస్ట్ చేయాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్పర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ తన నిబంధనల్లో పేర్కొంది. డేటా, అప్లికేషన్లు ఎలా హోస్ట్ చేయాలనే దానిపై ఓ విధానాన్ని రూపొందించింది. డేటా భద్రతపై పెరుగుతున్న ఆందోళనల క్రమంలో కొత్త మార్పులకు నాంది పలికింది. యూపీఐ చెల్లింపులు, ప్రభుత్వ డాక్యుమెంట్ల వంటి భద్రతకు డిజిటల్ మౌలిక సదుపాయాల విషయంలో ఈ నిర్ణయంతో మార్పులు చోటుచేసుకున్నాయి.
రెండు వర్గాలుగా విభజన
క్లౌడ్ విషయంలో డేటా స్టోరేజ్‌కు సంబంధించి రెండు కేటగిరీలను రూపొందించింది. కేటగిరీ-ఏలో జాతీయ భద్రతను ప్రభావితం చేసే, ఆర్ధిక నష్టాలకు దారితీసే, కార్యకలాపాలకు అంతరాయం కలిగించే అప్లికేషన్లు, డేటా సెట్‌లు ఉంటాయి. ఇక కేటగిరీ బీ-లో ప్రజలకు అందుబాటులో ఉండే పోర్టల్‌లు, సంక్షేమ పథకాల సమాచారం, సున్నితైన డేటా సెట్‌లు ఉంటాయి. కేటగిరీ -ఏలో వర్క్ లోడ్‌లకు కఠినమైన నియంత్రణలు వర్తిస్తాయి. ప్రభుత్వ మద్దతుగల మౌలిక సదుపాయాలను మాత్రమే డేటా స్టోరేజ్‌ల కోసం ఉపయోగించుకోవాలి. జాతీయ సమాచార కేంద్రం, రాష్ట్రాల డేటా సెంటర్లు, ఇతర ఆమోదిత సౌర్వభౌమ క్లౌడ్ ప్రొవైడర్ల సేవలను మాత్రమే ఉపయోగించుకోవాలి. అయితే కేటగిరీ- బీలో తక్కువ రిస్క్ గల వర్క్ లోడ్‌లకు మాత్రమే ప్రైవేట్ ఆపరేటర్లు అర్హత సాధిస్తారు. సున్నితమైన డేటా చట్టపరమైన, ప్రభుత్వ నియంత్రణలో ఉండేందుకు ఈ కొత్త ఫ్రేమ్ వర్క్ ఉపయోగపుతుంది. ప్రజల డేటాకు భద్రత కల్పించడంలో ఈ నిర్ణయాలు ఎంతో ఉపయోగపడతాయని కేంద్రం పేర్కొంది.
