AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: ఆంధ్రప్రదేశ్‌లో హీరో మహేష్ బాబు పోలికలతో రాముడి విగ్రహం.. ఫొటోస్ వైరల్

శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఓ గుడిలో ఉన్న శ్రీరాముడి విగ్రహం ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఎందుకంటే ఈ రాములోరి విగ్రహం అచ్చం హీరో మహేశ్‌ బాబులాగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఓ దేవాలయంలో ఆ రాముడి విగ్రహం ఉందని ఓ నెటిజన్‌ పోస్ట్‌ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది.

Mahesh Babu: ఆంధ్రప్రదేశ్‌లో హీరో మహేష్ బాబు పోలికలతో రాముడి విగ్రహం.. ఫొటోస్ వైరల్
Mahesh Babu
Basha Shek
|

Updated on: Mar 27, 2026 | 3:55 PM

Share

దేశమంతటా శ్రీరామనవవి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భద్రాచలం, ఒంటిమిట్ట, శ్రీశైలం వంటి ప్రధాన ఆలయాలతో పాటు చిన్న చిన్న దేవాలయాల్లోనూ విశిష్ట పూజలు, కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రాములోరి కల్యాణానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. ఇదే నేపథ్యంలో ఓ గుడిలో కొలువైన శ్రీరాముడి విగ్రహం ఫొటో ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇందులో విశేషమేముంది? అనుకుంటున్నారా? ఈ రాములోరి విగ్రహం అచ్చం సూపర్ స్టార్ మహేష్ బాబు లాగా ఉంది. ఒక నెటిజన్ ఈ ఫొటోను పోస్ట్ చేస్తూ.. ‘15 ఏళ్ల క్రితం ఆంధ్రాలో ఎక్కడో గుడిలోని రాముడు.. అచ్చం మహేశ్‌ బాబులాగే కనిపిస్తున్నాడు’ కదా అని రాసుకొచ్చాడు. అయితే ఆ గుడి ఎక్కడుందో క్లియర్ గా చెప్పలేకపోయాడు. దీంతో ఈ ఫొటో నెట్టింట వైర ల్ గ మారింది. దీనిని చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. అది నిజమైన విగ్రహం కాదని, ఒకవేళ నిజంగానే ఉంటే.. ఈ పాటికే అందరికి తెలిసిపోయేది కదా? అని కామెంట్లు చేస్తున్నారు. కేవలం వ్యూస్‌, రీచ్‌ కోసమే ఇలాంటి ఏఐ ఫోటోలను షేర్‌ చేస్తున్నారంటూ మరికొంత మంది నెటిజన్స్‌ మండిపడుతున్నారు.

రాముడిగా మహేశ్‌?

అయితే మహేశ్ బాబాబు‌ అభిమానులు మాత్రం శ్రీరాముడిగా కనిపిస్తున్న తమ హీరోని చూసుకొని మురిసిపోతున్నారు. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న వారణాసి సినిమాలో మహేష్ బాబు శ్రీరాముడిగా కనిపించనున్నాడు. సుమారు రూ. 1000 కోట్ల బడ్జెట్‌ లో హాలీవుడ్‌ రేంజ్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో మహేశ్‌ బాబు సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రకాష్ రాజ్ తదితరులు ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోన్న వారణాసి సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేశ్‌ బాబును పోలిన రాముడి విగ్రహం వైరల్‌ కావడానికి వారణసి సినిమా కూడా ఒక కారణమని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

నెట్టింట వైరలవుతోన్న రాములోరి విగ్రహం ఇదే..

రాజమౌళి వారణాసి సినిమాలో రాముడిగా మహేశ్‌?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
5 ఏళ్ల ప్రజాసేవ.. 75 గంటల ‘మోదీ జాతర’.. తిరుపతిలో భారీ కార్యక్రమం
5 ఏళ్ల ప్రజాసేవ.. 75 గంటల ‘మోదీ జాతర’.. తిరుపతిలో భారీ కార్యక్రమం
గుడ్లు ఉడికించేటప్పుడు దీన్ని వేస్తే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది..
గుడ్లు ఉడికించేటప్పుడు దీన్ని వేస్తే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది..
విద్యార్ధులకు అలర్ట్.. ఇక ఇంటర్‌ మార్కుల మెమోపై ఇక 11 అంకెల PEN
విద్యార్ధులకు అలర్ట్.. ఇక ఇంటర్‌ మార్కుల మెమోపై ఇక 11 అంకెల PEN
42 బంతుల్లో సెంచరీ.. రోహిత్, విరాట్ సరసన టీమిండియా కెప్టెన్
42 బంతుల్లో సెంచరీ.. రోహిత్, విరాట్ సరసన టీమిండియా కెప్టెన్
కొనసాగుతున్న నైరుతి నిష్క్రమణ.. తెలుగురాష్ట్రాల్లో వెదర్ ఎలా...
కొనసాగుతున్న నైరుతి నిష్క్రమణ.. తెలుగురాష్ట్రాల్లో వెదర్ ఎలా...
మనల్ని ఇతరులతో పోల్చుకోకూడదు.. హంసను చూసి అసూయపడిన కాకి కథ
మనల్ని ఇతరులతో పోల్చుకోకూడదు.. హంసను చూసి అసూయపడిన కాకి కథ
ఇంటి వద్దకే బస్సు.. బస్టాండ్ వరకు అక్కర్లేదు.. ఆర్టీసీ డెసిషన్..
ఇంటి వద్దకే బస్సు.. బస్టాండ్ వరకు అక్కర్లేదు.. ఆర్టీసీ డెసిషన్..
ఆరు ఓటీటీల్లో మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ..
ఆరు ఓటీటీల్లో మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ..
ద్వాదశి శ్రాద్ధం ఎందుకు ప్రత్యేకం? సన్యాసి శ్రాద్ధం అని ఎందుకు..
ద్వాదశి శ్రాద్ధం ఎందుకు ప్రత్యేకం? సన్యాసి శ్రాద్ధం అని ఎందుకు..
నిమ్మరసం ఇలా తాగితేనే అసలైన ఫలితం.. మీకు తెలియని సీక్రెట్స్..
నిమ్మరసం ఇలా తాగితేనే అసలైన ఫలితం.. మీకు తెలియని సీక్రెట్స్..