AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fuel Tax: కేంద్రం సంచలన నిర్ణయం.. ఇంధనంపై 100 శాతం పన్ను మినహాయింపు!

Fuel Tax: ఇరాన్‌-ఇజ్రాయెల్‌, అమెరికా యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన పెరుగుతోంది. ఒక వైపు గ్యాస్ కొరత, పెట్రోల్‌ కొరతను తీర్చేందుకు కేంద్రం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శ్రీరామనవమి రోజున కీలక నిర్ణయాలు తీసుకుంది. అలాగే..

Fuel Tax: కేంద్రం సంచలన నిర్ణయం.. ఇంధనంపై 100 శాతం పన్ను మినహాయింపు!
Aircraft Fuel
Subhash Goud
|

Updated on: Mar 27, 2026 | 11:58 AM

Share

Fuel Tax: ఇరాన్‌-ఇజ్రాయెల్‌, అమెరికా యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన పెరుగుతోంది. ఒక వైపు గ్యాస్ కొరత, పెట్రోల్‌ కొరతను తీర్చేందుకు కేంద్రం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శ్రీరామనవమి రోజున కీలక నిర్ణయాలు తీసుకుంది. పెట్రోల్‌, డీజిల్‌పై సుంకం తగ్గించగా, ఇప్పుడు విమాన ఇంధనంపై కూడా భారీగా పన్ను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. విమాన ఇంధనంపై 100 శాతం పన్ను మినహాయింపు ఇస్తు్న్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. డొమెస్టిక్‌ విమానాల ఇంధనంపై పూర్తిగా పన్ను రద్దు చేసింది.

ఎగుమతులపై ఆంక్షలు:

అలాగే  దేశీయంగా ఇంధన లభ్యత తగ్గకుండా చూసేందుకు ప్రభుత్వం మరో వ్యూహాత్మక అడుగు వేసింది. డీజిల్, విమాన ఇంధనం (ATF) ఎగుమతులపై ప్రభుత్వం సుంకాన్ని విధించింది. డీజిల్ ఎగుమతి సుంకం లీటరుకు రూ. 21.5. విమాన ఇంధనం (ATF) ఎగుమతి సుంకం లీటరుకు రూ. 29.5. ఈ చర్య ద్వారా ఇంధన కంపెనీలు లాభాల కోసం విదేశాలకు తరలించకుండా, దేశీయ మార్కెట్ అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చేలా ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us