ప్రీమియం వందే భారత్ ఎక్స్ప్రెస్లో నాసిరకం భోజనం, పురుగులు కనిపించడంపై కేంద్ర రైల్వేశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. పాట్నా-టాటానగర్ వందే భారత్ రైలులో రితేష్ కుమార్ అనే ప్రయాణికుడు ఫిర్యాదు చేయడంతో, రైల్వేశాఖ తన సొంత సంస్థ ఐఆర్సీటీసీకి రూ. 10 లక్షల భారీ జరిమానా విధించింది. ఆహార నాణ్యత విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేసింది.