అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం గదబూరులో భారీ గిరినాగు కలకలం రేపింది. ఆహారం కోసం వెతుక్కుంటూ పశువుల షెడ్డులోకి చేరిన సుమారు 13 అడుగుల కింగ్ కోబ్రా రైతు శేఖర్‌ను భయభ్రాంతులకు గురి చేసింది. శబ్దాలు విని లేచిన ఆయన పాము కనిపించడంతో బయటకు పరుగులు తీశారు.