నిర్మల్ జిల్లా బాసర ఆలయం సమీపంలోని శ్రీను పటేల్ షాప్‌లోకి 8 అడుగుల భారీ పాము దూరి కలకలం రేపింది. స్థానికులు భయాందోళన చెందగా, స్నేక్ క్యాచర్ ఫయాజ్ పామును సురక్షితంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఎండల తీవ్రతకు పాములు బయటకు వస్తాయని ఫయాజ్ హెచ్చరించారు.