నారాయణపేట జిల్లా మద్దూరు ప్రభుత్వ పాఠశాలలో మార్చి 8న ఓ ఉపాధ్యాయుడు విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ వికృత చేష్టలు కంప్యూటర్ ల్యాబ్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టి, బాధ్యుడైన ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. విద్యార్థి సంఘాలు కఠిన చర్యలు డిమాండ్ చేశాయి.