AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీకు GST నోటీస్‌ వచ్చిందా? అది ఇలా ఉంటే వెంటనే చింపి పారేయండి! CBIC హెచ్చరిక

ప్రతిరోజూ వందలాది సైబర్ మోసాలు జరుగుతున్న నేపథ్యంలో నకిలీ GST నోటీసులపై CBIC హెచ్చరిక జారీ చేసింది. మోసగాళ్లు అధికారిక పత్రాలను పోలి ఉండే నకిలీ నోటీసులను పంపుతున్నారు. పన్ను చెల్లింపుదారులు తమకు అందిన ప్రతి GST నోటీసులోని "డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నంబర్" (DIN)ని CBIC పోర్టల్‌లో ధృవీకరించాలని సూచించింది.

మీకు GST నోటీస్‌ వచ్చిందా? అది ఇలా ఉంటే వెంటనే చింపి పారేయండి! CBIC హెచ్చరిక
Gst Fraud
SN Pasha
|

Updated on: Jan 11, 2026 | 7:30 AM

Share

దేశవ్యాప్తంగా ప్రతిరోజూ వందలాది సైబర్ మోస కేసులు నమోదవుతున్నాయి. ఈ మోసగాళ్ల బారిన పడి ప్రజలు డబ్బు, విలువైన వస్తువులను కోల్పోతున్నారు. అయితే ప్రభుత్వం ఇటువంటి నేరాలను అరికట్టడానికి నిరంతరం కృషి చేస్తుస్తోంది. ఈ విషయంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) ఇప్పుడు GST నోటీసులకు సంబంధించి ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. కంపెనీలకు నకిలీ GST నోటీసులు పంపడంపై కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (CBIC) హెచ్చరిక జారీ చేసింది. అటువంటి మోసపూరిత కేసులను వెంటనే నివేదించాలని పన్ను చెల్లింపుదారులను కోరింది.

మోసపూరిత GST నోటీసులు పంపబడుతున్నాయని ప్రైవేట్ కంపెనీలు, వ్యాపారాలను హెచ్చరిస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) హెచ్చరిక జారీ చేసింది. GST పన్ను చెల్లింపుదారులు అటువంటి మోసపూరిత కేసులను వెంటనే నివేదించాలని కోరారు. నకిలీ నోటీసులు ఆన్‌లైన్‌లో లేదా వ్యక్తిగతంగా పంపబడుతున్నాయి, నకిలీ GST అధికారులు కూడా ఫోన్ కాల్స్ చేస్తున్నారు.

CBIC ఏం చెప్పిందంటే..

మోసగాళ్ళు అధికారిక GST పత్రాలను కాపీ చేయడం ద్వారా నకిలీ సమన్లను పంపుతున్నారని CBIC తెలిపింది. వారు సెంట్రల్ GST లోగోలు నకిలీ DIN నంబర్‌లను ఉపయోగించి వాటిని నిజమైనవిగా చూపిస్తున్నారు. పన్ను చెల్లింపుదారులు తమ శాఖ నుండి అందిన ప్రతి కమ్యూనికేషన్ లేదా లేఖలో జాబితా చేయబడిన “డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నంబర్” (DIN)ని CBSE పోర్టల్‌ని సందర్శించి ధృవీకరించాలని బోర్డు సూచించింది. నోటీసు నిజమైనదైతే అది ధృవీకరించబడుతుందని, అలా లేకుంటే వెంటనే తమకు తెలియజేయాలని బోర్డు పేర్కొంది. ఎక్స్‌లో ఒక వినియోగదారుడు GST అధికారి నుండి కాల్స్ అందుకున్నట్లు ఫిర్యాదు చేసిన దానికి ప్రతిస్పందనగా CBIC ఈ వివరణ జారీ చేసింది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మీకు GST నోటీస్‌ వచ్చిందా? అది నిజమైందా? ఫేకా ఇలా తెలుసుకోండి!
మీకు GST నోటీస్‌ వచ్చిందా? అది నిజమైందా? ఫేకా ఇలా తెలుసుకోండి!
టమోటాలను ఫ్రిజ్‌లో పెడుతున్నారా? అయితే మీరు పెద్ద తప్పు చేసినట్టే
టమోటాలను ఫ్రిజ్‌లో పెడుతున్నారా? అయితే మీరు పెద్ద తప్పు చేసినట్టే
అద్దం అక్కడ ఉందా..? మీ ఇంట్లో ఈ సమస్యలు ఖాయం.. వెంటనే ఇలా..
అద్దం అక్కడ ఉందా..? మీ ఇంట్లో ఈ సమస్యలు ఖాయం.. వెంటనే ఇలా..
ప్రాణం తీసిన పొగమంచు.. నలుగురు దుర్మరణం..!
ప్రాణం తీసిన పొగమంచు.. నలుగురు దుర్మరణం..!
ఉడికించిన గుడ్లను ఎంతటైంలోపు తొనొచ్చు? వాటిని ఎలా స్టోర్ చేయాలి
ఉడికించిన గుడ్లను ఎంతటైంలోపు తొనొచ్చు? వాటిని ఎలా స్టోర్ చేయాలి
చికెన్ లెగ్ పీస్ ఎందుకు అంత స్పెషల్.. దాన్ని టేస్ట్ వెనకున్న..
చికెన్ లెగ్ పీస్ ఎందుకు అంత స్పెషల్.. దాన్ని టేస్ట్ వెనకున్న..
చైనాకు చెక్‌? అమెరికా నుంచి భారత్‌కు ప్రత్యేక ఆహ్వానం!
చైనాకు చెక్‌? అమెరికా నుంచి భారత్‌కు ప్రత్యేక ఆహ్వానం!
AP SET 2025 నోటిఫికేషన్‌ విడుదల.. ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం
AP SET 2025 నోటిఫికేషన్‌ విడుదల.. ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం
జిమ్‌కు వెళ్లక్కర్లేదు.. చలికాలంలో ఈ పండ్లు తింటే ఈజీగా బరువు..
జిమ్‌కు వెళ్లక్కర్లేదు.. చలికాలంలో ఈ పండ్లు తింటే ఈజీగా బరువు..
EV బ్యాటరీ ప్యాక్‌లపై ఆధార్‌ నంబర్‌ ఎందుకంత ముఖ్యం!
EV బ్యాటరీ ప్యాక్‌లపై ఆధార్‌ నంబర్‌ ఎందుకంత ముఖ్యం!