AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Car Wrapping: డార్లింగ్ ప్రభాస్ వాడే కారు ఇదే.. కొత్త లుక్ అదిరిపోయిందిగా..

సీని స్టార్లు ఏం చేసినా అది సెన్సేషనే. ముఖ్యంగా టాలివుడ్లో హీరోలను దైవంగా భావించే అభిమానులకు తక్కువ లేదు. ఈ క్రమంలో మన బాహుబలి, డార్లింగ్ ప్రభాస్ అకస్మాత్తుగా వార్తల్లో నిలిచాడు. మళ్లీ ఏదైనా పాన్ ఇండియా సినిమా గురించేమో అనుకుంటున్నారా? మొదటి అందరూ అలాగే అనుకున్నారు. కానీ అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోయారు.

Car Wrapping: డార్లింగ్ ప్రభాస్ వాడే కారు ఇదే.. కొత్త లుక్ అదిరిపోయిందిగా..
Lamborghini Aventador S Roadster
Madhu
|

Updated on: Feb 19, 2024 | 7:53 AM

Share

సీని స్టార్లు ఏం చేసినా అది సెన్సేషనే. ముఖ్యంగా టాలివుడ్లో హీరోలను దైవంగా భావించే అభిమానులకు తక్కువ లేదు. ఈ క్రమంలో మన బాహుబలి, డార్లింగ్ ప్రభాస్ అకస్మాత్తుగా వార్తల్లో నిలిచాడు. మళ్లీ ఏదైనా పాన్ ఇండియా సినిమా గురించేమో అనుకుంటున్నారా? మొదటి అందరూ అలాగే అనుకున్నారు. కానీ అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోయారు. ఇటీవల కార్ ర్యాపింగ్ ట్రెండ్ అనేది మన దేశంలో బాగా పాపులర్ అయ్యింది. సోషల్ మీడియా దానిపై అధికంగా ఫోకస్ పెడుతోంది. బాగా వైరల్ అవడంతో పాటు ట్రెండింగ్ లోకి వస్తోంది. ఈ క్రమంలో సెలబ్రిటీల దగ్గర నుంచి మీడియా ప్రముఖులు, హీరోలు, హీరోయిన్ల వరకూ అందరూ కార్ ర్యాపింగ్ ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. ఇంతకీ కార్ ర్యాపింగ్ అంటే ఏమిటా అని ఆలోచిస్తున్నారా? ఏమి లేదండి.. మీ కారుకు ఎటువంటి పెయింటింగ్స్ లేకుండా తక్కువ ఖర్చుతో పెయింట్ స్ప్రెయింగ్ చేసినట్లుగానే కనిపించే స్టిక్కరింగ్ చేయడం. ఇప్పుడు దీనిని మన డార్లింగ్ ప్రభాస్ కూడా ఫాలోఅయ్యాడు. తన గ్యారేజ్ లోని లాంబోర్గినీ అవెంటడార్ ఎస్ రోడ్‌స్టర్‌ను ప్రత్యేకమైన ర్యాప్‌గా మార్చారు. ఆరెంజ్ కలర్ లో ఉండే టెక్-లోడెడ్ బ్రాండ్-న్యూ లంబోర్ఘిని అవెంటడోర్ ఎస్ రోడ్‌స్టర్‌ను శాటిన్ బ్లాక్ కలర్‌గా మార్చాడు. దీనిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త ఫుల్ వైరల్ అయిపోయింది.

సోషల్ మీడియా పోస్ట్ ఇలా..

కాగా ఈ లంబోర్ఘిని అవెంటడోర్ ఎస్ రోడ్‌స్టర్ ర్యాపింగ్ చేసిన తర్వాత ఫొటోలు కార్ క్రేజీ ఇండియా అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా షేర్ అయ్యాయి. ఇది యాక్టర్ ప్రభాస్ కు చెందిన కారు.. ఇంతకు ముందు ఇది ఆరంజ్ కలర్ ఉండేది. ఇప్పుడు శాటిన్ బ్లాక్ ర్యాప్ చేశామని ఆ పోస్ట్లో రాశారు.

ఇవి కూడా చదవండి

లంబోర్ఘిని అవెంటడోర్ ఎస్ రోడ్‌స్టర్ ధర..

ప్రభాస్ వినియోగిస్తున్న టెక్-లోడెడ్ బ్రాండ్-న్యూ లంబోర్ఘిని అవెంటడోర్ ఎస్ రోడ్‌స్టర్‌ గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది చాలా అధిక సామర్థ్యం కలిగిన కారు. అలాగే చాలా ఎక్స్ పెన్సివ్ కూడా. దీనిని ప్రభాస్ రూ. 5.8 కోట్ల (ఎక్స్-షోరూమ్) ధరతో కొనుగోలు చేశారు. రోల్స్ రాయిస్ ఫాంటమ్ తర్వాత ఇది ఆయన గ్యారేజీలో రెండో అత్యంత ఖరీదైన వాహనం. రోల్స్ రాయిస్ ఫాంటమ్ ధర దాదాపు రూ. 8 కోట్లు (ఎక్స్-షోరూమ్). అదనపు ఉపకరణాల కోసం ఆయన ఇంకా అదనంగా ఇంకా ఏమైనా పెట్టుబడి పెట్టారేమో తెలియదు.

లంబోర్ఘిని అవెంటడోర్ ఎస్ రోడ్‌స్టర్ ఇంజిన్..

లంబోర్ఘిని అవెంటడోర్ ఎస్ రోడ్‌స్టర్ ను ఆ కంపెనీ లైనప్‌లోని అత్యంత శక్తివంతమైన స్పోర్ట్స్ కార్లలో ఒకటిగా పరిగణిస్తారు. ఇది సహజంగా 6.5-లీటర్ మాన్‌స్ట్రస్ వీ12 ఇంజిన్‌తో ఆధారంగా పనిచేస్తుంది. ఇది 730బీహెచ్పీ 690ఎన్ఎం శక్తిని ఉత్పత్తి చేస్తుంది.ఈ రోడ్‌స్టర్ కేవలం 3.0 సెకన్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలుగుతుంది. అదే సమయంలో గరిష్టంగా 350 కిలోమీటర్ల వేగందో ప్రయాణించగలుగుతుందని ఈ ఇటాలియన్ కార్ల తయారీ సంస్థ పేర్కొంది. ఈ కారులో ఏడు-స్పీడ్ ఇండిపెండెంట్ షిఫ్టింగ్ రాడ్ (ఐఎస్ఆర్) ట్రాన్స్‌మిషన్ ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..