Car sales: పండగవేళ అమ్మకాల జోరు.. ఆటోమొబైల్ రంగంలో సరికొత్త జోష్‌..

దీపావళి వేళ దేశంలో కార్ల అమ్మకాలు ఓ రేంజ్ లో పెరిగాయి. ముఖ్యంగా ధంతేరాస్ రోజున భారీగా అమ్మకాలు జరిగినట్లు గణంకాలు చెబుతున్నాయి. మారుతి సుజుకీ మొదలు, మరికొన్ని సంస్థలకు చెందిన కార్ల అమ్మకాలు పెరిగాయి. ధంతేరాస్‌ కారణంగా బుధవారం వాహనాల అమ్మకాలు భారీగా జరిగాయి. దీపావళి రోజు కూడా అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు..

Car sales: పండగవేళ అమ్మకాల జోరు.. ఆటోమొబైల్ రంగంలో సరికొత్త జోష్‌..
Car Sale
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 31, 2024 | 4:11 PM

భారతీయులకు దీపావళి పండుగ ఎంతో సెంటిమెంట్‌ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ పండక్కి ఏదో ఒక కొత్త వస్తువును కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా దీపావళికి వాహనాలు కొనుగోలు చేసే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. అయితే ఈ ఏడాది ఈ కొనుగోల్లు సరికొత్త రికార్డులను సృష్టించాయి. అక్టోబర్ నెలలో వాహనాల అమ్మకాలు ఊపందుకున్నాయని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ధంతేరాస్‌ కారణంగా బుధవారం వాహనాల అమ్మకాలు భారీగా జరిగాయి. దీపావళి రోజు కూడా అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సజుకీ ఇండియా.. మార్కెటింగ్ అండ్‌ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ మాట్లాడుతూ.. ఈ అక్టోబర్‌లోవ మారుతి సుజుకీ రెండు లక్షల డెలివరీలతో అత్యధిక రిటైల్ అమ్మకాలను నమోదు చేయనున్నట్లు తెలిపారు. 2020-21 అక్టోబర్‌లో గరిష్టంగా 1,91,476 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ధంతేరాస్‌ (మంగళవారం) ఒక్క రోజే తాము 32,000 యూనిట్లను విక్రయించినట్లు తెలిపారు. అయితే బుధవారం కూడా మరో 10,000 యూనిట్లను విక్రయించారు. ఈ లెక్కన మొత్తం ధంతేరాస్‌ అమ్మకాలు 42 వేలకు చేరాయని బెనర్జీ తెలిపారు. గతేడాది ధంతేరాస్‌ సందర్భంగా మారుతి సుజుకీ 23,000 యూనిట్లను విక్రయించింది.

అయితే కేవలం ధంతేరాస్‌, దీపావళి మాత్రమే కాకుండా ఈ ట్రెండ్‌ 20 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఆటోమొబైల్ డీలర్స్‌ అసోసియేషన్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు విఘ్నేశ్వర్‌ ఇదే విషయమై మాట్లాడుతూ.. అక్టోబర్ నెలలో కార్ల విక్రయాలు భారీగా పెరిగాయన్నారు.

అయితే మధ్యలో వర్షాల కారణంగా కొంత అంతరాయం ఏర్పడినా.. రానున్న రోజుల్లో విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు మెరుగైన పంట దిగుబడి రావడం కారణంగా పండుగ సీజన్‌లో ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్ల విక్రయాలు పెంచుకునేందుకు కొత్త లాంచ్‌లను ప్లాన్‌ చేస్తున్నాయని చెప్పుకొచ్చారు.

ఇక టాటా మోటార్స్‌ సైతం గతేడాది పోల్చితే అక్టోబర్‌లో కార్ల రిజిస్ట్రేషన్లు 30 శాతం పెరితాయి. ఫలితంగా ఎన్నడూ లేని విధంగా టాటా మోటార్స్‌ రిజిస్ట్రేషన్లు జరిగాయి. ధంతేరాస్‌లో బలమైన డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో.. తాము 15000 వాహనాలను డెలివరీ చేయనున్నామని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ అండ్‌ టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర తెలిపారు.

ఇక ఈవీ అమ్మకాలు సైతం ఈ అక్టోబర్‌లో జోరందుకున్నాయి. JSW MG మోటార్ ఇండియా కూడా ధంతేరాస్‌లో ఢిల్లీ-NCR ప్రాంతంలో ఒకే రోజు 101 EVలను డెలివరీ చేసినట్లు తెలిపింది. ఇక రాయ్‌పుర్‌లోని ఒక డీలర్‌ ధంతేరాస్‌ రోజున 100 కంటే ఎక్కువ కార్లను డెలివరీ చేసినట్లు రెనాల్ట్ తెలిపింది. సేల్‌లో 52 ట్రైబర్, 30 కిగర్, 18 క్విడ్ ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!