Second Hand Car: సెకండ్‌ హ్యాండ్‌ కారు కొంటున్నారా? ఆ విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తప్పనిసరి

ప్రజలు కూడా సేవింగ్స్‌ మొత్తం ఖర్చు అయ్యిపోవడంతో సెకండ్‌ హ్యాండ్‌ వాహనాల కొనుగోలుకే మక్కువ చూపుతున్నారు. ముఖ్యంగా కార్లల్లో కచ్చితం సెకండ్‌ హ్యాండ్‌ కార్లను ఎంచుకుంటున్నారు. సెకండ్‌ హ్యాండ్‌ కారు కొనుగోలు అంటే డబ్బు విషయం ఒక్కటే కాకుండా మొదటి సారిగా కారును కొనుగోలు చేసే వాళ్లు కచ్చితంగా సెకండ్‌ హ్యాండ్‌ కారునే కొనుగోలు చేస్తారు. ఆ కారుతో డ్రైవింగ్‌ మెళకువలన్నీ తెలిశాకే కొత్త కారు కొనుగోలు చేస్తారు.

Second Hand Car: సెకండ్‌ హ్యాండ్‌ కారు కొంటున్నారా? ఆ విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తప్పనిసరి
Second Hand Car
Follow us
Srinu

| Edited By: Ravi Kiran

Updated on: Oct 16, 2023 | 7:01 AM

కరోనా ఆటోమొబైల్‌ మార్కెట్‌ను సంక్షోభంలోకి నెట్టేసింది. ముఖ్యంగా ఉద్యోగ నష్టాలు, జీతాల్లో కోత, కంపెనీల మూత ఇలా ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడంతో ఆటో మొబైల్‌ రంగం తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుంది. చాలా మంది కార్ల కొనుగోలుదారులు ఈఎంఐలను చెల్లించకలేక కార్లను అమ్ముకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం పరిస్థితులు కొంత చక్కబడ్డాయి. అయితే ప్రజలు కూడా సేవింగ్స్‌ మొత్తం ఖర్చు అయ్యిపోవడంతో సెకండ్‌ హ్యాండ్‌ వాహనాల కొనుగోలుకే మక్కువ చూపుతున్నారు. ముఖ్యంగా కార్లల్లో కచ్చితం సెకండ్‌ హ్యాండ్‌ కార్లను ఎంచుకుంటున్నారు. సెకండ్‌ హ్యాండ్‌ కారు కొనుగోలు అంటే డబ్బు విషయం ఒక్కటే కాకుండా మొదటి సారిగా కారును కొనుగోలు చేసే వాళ్లు కచ్చితంగా సెకండ్‌ హ్యాండ్‌ కారునే కొనుగోలు చేస్తారు. ఆ కారుతో డ్రైవింగ్‌ మెళకువలన్నీ తెలిశాకే కొత్త కారు కొనుగోలు చేస్తారు. ఈ నేపథ్యంలో ఆటోమొబైల్‌ మార్కెట్‌లో సెకండ్‌ హ్యాండ్‌ కార్లకు బాగా డిమాండ్‌ పెరిగింది. 2023లో భారతీయ సెకండ్‌ హ్యాండ్‌ కార్ల కొనుగోలు మార్కెట్‌ 2.03 లక్షల కోట్లు ఉండగా 2028 నాటికి ఈ మార్కెట్‌ 4.63 లక్షలకు చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాబట్టి సెకండ్‌ హ్యాండ్‌ కారును కొనుగోలు చేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో? ఓ సారి తెలుసుకుందాం.

బడ్జెట్‌ను సెట్‌ చేయడం 

ముఖ్యంగా సెకండ్‌ హ్యాండ్‌ కారును కొనుగోలు చేయాలనుకునే వాళ్లు కచ్చితంగా బడ్జెట్‌ను సెట్‌ చేయాల్సి ఉంటుంది. మనం ఏ ధరలో కారను కావాలని కోరుకుంటున్నామో? అదే ధరలో కారును కొనాలి? కొంచెం ఎక్కువ పెట్టుకుంటే మంచి కారు వస్తుందనే ఉద్దేశంతో చాలా మంది బడ్జెట్‌ను అంచనావ వేయకుండా కారును కొనుగోలు చేస్తారు. ఇలాంటి చర్యలు మనల్ని అప్పులుపాలు చేస్తాయి. ముఖ్యంగా బీమా, ఇంధన బిల్లులు, నిర్వహణ ఖర్చులన్నీ బేరీజు వేసుకుని కారును కొనుగోలు చేయడం ఉత్తమం.

మార్కెట్‌

సెకండ్‌ హ్యాండ్‌ కారును కొనుగోలు చేసేవాళ్లు కచ్చితంగా మార్కెట్‌ ట్రెండ్స్‌ను ఫాలో అవ్వాలి. కచ్చితంగా కారు మోడల్‌, మైలేజ్‌, ధర వంటి వివరాలను వీలైనంత ఎక్కువ షోరూమ్‌లను సందర్శించి బేరీజు వేసుకున్న తర్వాతే కొనుగోలు చేయాలి. ముఖ్యంగా థర్డ్‌పార్టీ వారితో కాకుండా నేరుగా కారు యజమానితోనే ధరను మాట్లాడుకోవడం మీకు తక్కువ ధరకే కారు లభించడంతో పాటు కారుకు సంబంధించిన సరైన వివరాలు మీకు తెలుస్తాయి. ముఖ్యంగా కారు కొనుగోలు చేసే ముందు టెస్ట్‌ రైడ్‌కు వెళ్లి కారు మీ అంచనాలకు తగినట్లు ఉందో? లేదో? బేరీజు వేసుకోవాలి. 

ఇవి కూడా చదవండి

సరైన విక్రేతను ఎంచుకోవడం

కారు మోడల్స్‌, ధర, మైలేజ్‌ వంటి వివరాలన్నీ బేరీజు వేసుకున్నాక కారు కొనుగోలు చేయడానికి సరైన విక్రేతను ఎంచుకోవడం చాలా ముఖ్యం.  వ్యవస్థీకృత విక్రేతలు వారెంటీ పదవీ కాలం, రాతపని అవాంతరాలు లేని కొనుగోలు ప్రక్రియను అందిస్తారు. అయితే వ్యవస్థికృత విక్రేతలు కారు మార్కెట్‌ ధర కంటే అధికంగా వసూలు చేస్తారు. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

కారు చరిత్రను తెలుసుకోవడం

కారు కొనుగోలు చేసే ముందు కచ్చితంగా కారు స్థితిని అంచనా వేయాలి. ముఖ్యంగా వ్యక్తిగతంగా కారు స్థితిని కొనుగోలుదారులు చూసుకోవాలి. కారుకు సంబంధించిన అనుమానాలు ఉంటే విక్రేతను అడిగి తెలుసుకోవాలి. కారు సాంకేతిక వివరాలను తెలుసుకోవడానికి కచ్చితంగా మన తరఫున ప్రొఫెషనల్‌ టెక్నీషియన్‌ తీసుకెళ్లి తనిఖీ చేయించుకుని కారును కొనుగోలు చేయడం మంచిది. 

నిబంధనలు అనుసరించడం

కారు కొనుగోలు సమయంలో నిబంధనలు పాటించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా సెకండ్‌ హ్యాండ్‌ కారును కొనుగోలు చేస్తారు కాబట్టి పేపర్‌ వర్క్‌ చాలా ఉంటుంది. అందువల్ల కచ్చితంగా అందులో పేర్కొన్న వివరాలను ఒకటికి రెండు సార్లు సరి చూసుకోవాలి. అలా చేయకపోతే కొనుగోలుదారులు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఓరుగల్లు గడ్డపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శపథం..!
ఓరుగల్లు గడ్డపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శపథం..!
కుంభకర్ణుడిది అతి నిద్ర కాదట! పురాణ కథపై కొత్త ట్విస్ట్!
కుంభకర్ణుడిది అతి నిద్ర కాదట! పురాణ కథపై కొత్త ట్విస్ట్!
ఓట్లు వేయమని ఎంపీ ముఖం మీదే చెప్పిన మహిళ ..!
ఓట్లు వేయమని ఎంపీ ముఖం మీదే చెప్పిన మహిళ ..!
కాలరెగరేస్తున్న డాలర్.. మరి రూపాయి పరిస్థితి ఏంటి.?
కాలరెగరేస్తున్న డాలర్.. మరి రూపాయి పరిస్థితి ఏంటి.?
ఆమె మళ్లీ వచ్చింది .. పార్లమెంట్‌ దద్దరిల్లింది.! ఎంపీ డాన్స్
ఆమె మళ్లీ వచ్చింది .. పార్లమెంట్‌ దద్దరిల్లింది.! ఎంపీ డాన్స్
నిద్ర లేవగానే సెల్‌ఫోన్‌ చూస్తున్నారా.? నిపుణులు చెప్పినవి వింటే
నిద్ర లేవగానే సెల్‌ఫోన్‌ చూస్తున్నారా.? నిపుణులు చెప్పినవి వింటే
ఆ 4 వేల మందిని గనిలోనే సమాధి చేస్తారా.? మూసిన బంగారు గనిలో చిక్కు
ఆ 4 వేల మందిని గనిలోనే సమాధి చేస్తారా.? మూసిన బంగారు గనిలో చిక్కు
శివుడు కనిపిస్తాడని వెళ్తే.. ఎలుగుబంట్లు భయపెట్టాయి.! వీడియో..
శివుడు కనిపిస్తాడని వెళ్తే.. ఎలుగుబంట్లు భయపెట్టాయి.! వీడియో..
ఆ పులి.. ఈ పులేనా.? వైరల్‌ అవుతున్న పెద్దపులి వీడియో..
ఆ పులి.. ఈ పులేనా.? వైరల్‌ అవుతున్న పెద్దపులి వీడియో..
మంచుకొండపై మండుతున్న లావా.! ఐస్ ల్యాండ్ లో అగ్ని పర్వతం బ్లాస్ట్!
మంచుకొండపై మండుతున్న లావా.! ఐస్ ల్యాండ్ లో అగ్ని పర్వతం బ్లాస్ట్!