Hyundai: బంపర్ ఆఫర్.. రూ. 15 లక్షల హ్యుందాయ్ కారు.. కేవలం రూ. 4.54 లక్షలకే.. వివరాలు ఇవిగో!

హ్యుందాయ్ వెర్నా బెస్ట్ ఆప్షన్. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.9.65-15.72 లక్షల వరకు ఉంటుంది. అయితే, మీరు అంత ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.

Hyundai: బంపర్ ఆఫర్.. రూ. 15 లక్షల హ్యుందాయ్ కారు.. కేవలం రూ. 4.54 లక్షలకే.. వివరాలు ఇవిగో!
Second Hand Car
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 21, 2023 | 9:10 PM

భారతదేశంలో SUV కార్లకు క్రేజ్ విపరీతంగా పెరుగుతోంది. అయినప్పటికీ, ప్రజలు ఇప్పటికీ సెడాన్ కార్లను బాగా ఇష్టపడుతున్నారు. మీరు కూడా సెడాన్‌ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేసి ఉంటే, హ్యుందాయ్ వెర్నా బెస్ట్ ఆప్షన్. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.9.65-15.72 లక్షల వరకు ఉంటుంది. అయితే, మీరు అంత ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, సెకండ్ హ్యాండ్‌లో బెస్ట్ ఫీచర్లతో మీరు ఈ కారును కేవలం రూ.4.54 లక్షలకే ఇంటికి తెచ్చుకోవచ్చు. సెకండ్ హ్యాండ్ కార్లను అమ్మకానికి ఉంచే పలు ప్రముఖ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లు హ్యుందాయ్ వెర్నాపై అదిరిపోయే ఆఫర్లను ప్రకటించాయి. మీరనుకున్న బడ్జెట్‌లో ఆ కారును కొనుగోలు చేయొచ్చు.

  • OLX హ్యుందాయ్ వెర్నా ఆఫర్:

ఈ వెబ్‌సైట్‌లో హ్యుందాయ్ వెర్నా 2017 మోడల్ అమ్మకానికి అందుబాటులో ఉంది. ఈ మోడల్ పేరు FLUIDIC 1.6 CRDi S AT. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన డీజిల్ కారు. మీరు ఈ కారును రూ.6.75 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతానికి ఈ కారు 54,000 కిలోమీటర్లు నడిచింది. దీని రిజిస్ట్రేషన్ ఢిల్లీలో జరిగింది.

  • CarWale హ్యుందాయ్ వెర్నా ఆఫర్:

ఈ వెబ్‌సైట్‌లో హ్యుందాయ్ వెర్నా 2013 మోడల్ అమ్మకానికి ఉంచారు. ఇక్కడ Fluidic 1.4 VTVT 2013 మోడల్‌ను రూ.4.75 లక్షలకే కొనుగోలు చేయవచ్చు. ఇది పెట్రోల్ కారు కాగా, ఇప్పటివరకు 61,513 కి.మీ. నడిచింది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన ఈ వాహనం కూడా ఢిల్లీ రిజిస్ట్రేషన్‌తో పొందొచ్చు.

  • Spinny హ్యుందాయ్ వెర్నా ఆఫర్:

ఈ వెబ్‌సైట్‌లో హ్యుందాయ్ వెర్నాపై చౌకైన ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ డీల్‌లో, Fluidic 1.4 CRDi 2015 మోడల్‌ను రూ.4.54 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. ఈ కారు ఇప్పటివరకు 73,946 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించింది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన ఈ డీజిల్ కారు ఘజియాబాద్ సర్కిల్‌లో అందుబాటులో ఉంది. దీని రిజిస్ట్రేషన్ ఢిల్లీలో జరిగింది. కాగా, సెకండ్ హ్యాండ్ బైక్‌లు లేదా కార్లు కొనేటప్పుడు బైక్ యజమానిని కలవకుండా, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ స్వయంగా ధృవీకరించకుండా ఆర్ధిక లావాదేవీలు చేయకండి. పైన సమాచారం కేవలం సదరు వెబ్‌సైట్‌లోని వివరాల మేరకు ఇచ్చినది మాత్రమే.

Second Hand Cars