RBI విడుదల చేసిన రూ. 100 కాయిన్ కావాలా? అయితే ఇలా చేయండి!
RSS శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రధాని మోదీ విడుదల చేసిన రూ.100 ప్రత్యేక నాణెం కొనాలనుకుంటున్నారా? సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL) వెబ్‌సైట్ ద్వారా మాత్రమే అధికారికంగా కొనుగోలు చేయవచ్చు. నకిలీ సైట్‌లను నమ్మకుండా, SPMCILలో నమోదు చేసుకొని ఇంటి వద్దకే డెలివరీ పొందండి.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా అక్టోబర్ 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక తపాలా బిళ్ళ, ప్రత్యేక రూ.100 నాణెం విడుదల చేశారు. అయితే దేశవ్యాప్తంగా చాలా మంది ఈ ప్రత్యేక నాణెం కొనాలని ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఎక్కడ కొనాలో తెలియదు. కాబట్టి, ఈ నాణెం ఎక్కడ కొనాలో? ఎలా కొనాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక సంస్థ లేదా వ్యక్తి జ్ఞాపకార్థం నాణేలను భారత ప్రభుత్వ అనుబంధ సంస్థ అయిన సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL) జారీ చేస్తుంది. అందువల్ల దీనిని అక్కడి నుండి మాత్రమే కొనుగోలు చేయవచ్చు. ఆసక్తి ఉన్న వ్యక్తులు ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెడితే, ఇంటికి డెలవరీ చేస్తారు. ఈ నాణెం ప్రస్తుతం అందుబాటులో లేనప్పటికీ, ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత కొనుగోలు చేయవచ్చు.
ప్రత్యేక నాణెం ఎలా పొందాలి?
వాయిస్ ఆఫ్ బ్యాంకింగ్ వ్యవస్థాపకురాలు అశ్విని రాణా ప్రకారం.. RSS శతాబ్ది సంవత్సరం రూ.100 నాణెం ప్రభుత్వ మింట్ నుండి నేరుగా జారీ అవుతుంది. దీన్ని స్వీకరించడానికి, ఎవరైనా అధికారిక SPMCIL వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చు . రిజిస్ట్రేషన్ తర్వాత మీరు నాణెం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత, నాణెం నేరుగా మీ ఇంటికి డెలివరీ చేస్తారు.
అధికారిక వెబ్‌సైట్ నుండి మాత్రమే బుకింగ్ చేసుకోవాలి..
నాణేలను బుక్ చేసుకోవడానికి, మీరు అధికారిక SPMCIL వెబ్‌సైట్ లేదా RBI వెబ్‌సైట్‌ను మాత్రమే ఉపయోగించాలి. అనధికార లేదా మోసపూరిత సైట్‌లతో మోసపోయే ప్రమాదం ఉంది. అధికారిక వెబ్‌సైట్ మాత్రమే నమోదు చేసుకోవడానికి, బుక్ చేసుకోవడానికి సురక్షితమైన మార్గం.
జాగ్రత్త వహించండి
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేటప్పుడు మీ వ్యక్తిగత సమాచారాన్ని రక్షించుకోండి. మీ డేటాను నమోదు చేసిన తర్వాతే బుకింగ్‌లు నిర్ధారించబడతాయి. నకిలీ వెబ్‌సైట్‌లు లేదా లింక్‌లను సందర్శించడం మోసానికి దారితీస్తుంది. అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవడం సురక్షితం.
హోమ్ డెలివరీ ఎలా జరుగుతుంది?
SPMCIL ద్వారా బుక్ చేసుకున్న నాణేలు నేరుగా మీ ఇంటి వద్దకే డెలివరీ చేయబడతాయి. దీని వలన ప్రజలు ఈ ప్రత్యేక నాణేన్ని వారి ఇంటి వద్దనే పొందగలుగుతారు. కొనుగోలు చేయడానికి, ముందుగానే నమోదు చేసుకోవడం, అధికారిక వెబ్‌సైట్‌ను ఉపయోగించడం ముఖ్యం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




