Business Idea: కేవలం రూ. 2 లక్షల పెట్టుబడితో అద్భుతమైన వ్యాపారం.. ప్రతి నెల లక్షల్లో ఆదాయం
ఆదాయం సమకూర్చుకునేందుకు ఎన్నో మార్గాలున్నాయి. వ్యాపారం చేయడం ద్వారా అధిక మొత్తంలో లాభాలు పొందవచ్చు. మంచి అవగాహన ఉండి, డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే అధిక రాబడి వచ్చే..

ఆదాయం సమకూర్చుకునేందుకు ఎన్నో మార్గాలున్నాయి. వ్యాపారం చేయడం ద్వారా అధిక మొత్తంలో లాభాలు పొందవచ్చు. మంచి అవగాహన ఉండి, డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే అధిక రాబడి వచ్చే వ్యాపారాలు చాలా ఉన్నాయి. మీరు మంచి లాభం కోసం మీ స్వంత చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే పేపర్ స్ట్రా తయారీని ఎంచుకోవచ్చు. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా మీరు ప్రతి నెలా లక్షల రూపాయలు సంపాదించవచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం 1 జూలై 2022 నుండి ప్లాస్టిక్ స్ట్రాస్‌తో పాటు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించింది. బండ్లపై లభించే రసాల నుండి ప్యాక్ చేసిన పానీయాలలో ప్లాస్టిక్ స్ట్రాలను ఉపయోగిస్తారు. ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధించడంతో పేపర్ స్ట్రాకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. మార్కెట్‌లో పేపర్ స్ట్రాకు డిమాండ్ పెరగడం వల్ల ఎంతో మంది ఈ బిజినెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. అటువంటి పరిస్థితిలో కాగితపు స్ట్రా తయారీ వ్యాపారం మంచి ఆప్షన్‌గా ఉంటుంది. మీరు ఈ వ్యాపారం నుంచి లక్షల రూపాయలు సంపాదించవచ్చు.
ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ) పేపర్ స్ట్రా యూనిట్‌పై ప్రాజెక్ట్ నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదిక ప్రకారం, పేపర్ స్ట్రా తయారీ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు, ప్రభుత్వం నుండి అనుమతి, రిజిస్ట్రేషన్ అవసరం. ఈ ప్రాజెక్ట్ కోసం జీఎస్టీ రిజిస్ట్రేషన్, వ్యాపారం చేసే వ్యక్తి ఆధార్, ఉత్పత్తి బ్రాండ్ పేరు, అవసరమైతే రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నుండి ట్రేడ్‌మార్క్, ఎన్‌ఓసీ వంటి ప్రాథమిక అంశాలు అవసరం.
కేవీఐసీ వివరాల ప్రకారం.. పేపర్ స్ట్రా తయారీ వ్యాపారం ప్రాజెక్ట్ వ్యయం రూ.19.44 లక్షలు. ఇందులో మీరు రూ.1.94 లక్షలు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తం రూ.13.5 లక్షల టర్మ్ లోన్ తీసుకోవచ్చు. అలాగే వర్కింగ్ క్యాపిటల్ కోసం రూ.4 లక్షలు ఫైనాన్స్ చేయవచ్చు. మొత్తం ప్రాసెస్‌లో భాగంగా మీ వ్యాపారం 5 నుండి 6 నెలల్లో ప్రారంభించుకోవచ్చు. వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీరు PM ముద్రా లోన్ పథకం కింద కూడా లోన్ తీసుకోవచ్చు.




పేపర్ స్ట్రా తయారీకి ముడి పదార్థాలు:
పేపర్ స్ట్రా తయారీ కోసం ముడి పదార్థాలలో మూడు అవసరమైన ఉంటాయి. దీనికి ఫుడ్ గ్రేడ్ పేపర్, ఫుడ్ గ్రేడ్ గమ్ పౌడర్, ప్యాకేజింగ్ మెటీరియల్ అవసరం. ఇది కాకుండా, పేపర్ స్ట్రా మేకింగ్ మెషిన్ అవసరం. దీని ధర సుమారు 9,00000 రూపాయలు. ఇతర పరికరాలకు సుమారు 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది.
పేపర్ స్ట్రాలు తయారు చేయడం ఎలా?
పేపర్ స్ట్రాలు ఒకటి కంటే ఎక్కువ రంగులలో కూడా తయారు చేసుకోవచ్చు. రంగు అవసరం ప్రకారం.. కాగితం రోల్స్ యంత్రం రోలర్ స్టాండ్‌లో ఉంచడం జరుగుతుంది. ఆ తర్వాత యంత్రం రెండింటినీ కలపడం ద్వారా పేపర్ స్ట్రాలను తయారు చేస్తారు. అయితే కాగితం అవసరమైన కొలతలు ప్రకారం తయారు చేసుకోవచ్చు. స్ట్రా లోపలి వ్యాసం 4.7 మిమీ నుండి 20 మిమీ వరకు మారవచ్చు. పేపర్ స్ట్రిప్స్ ఒకదానికొకటి అతికించే ఉంటాయి. దీని తరువాత కట్టర్ల సహాయంతో కట్టింగ్ చేస్తుంటుంది యాత్రం. పేపర్ పొడవు ప్రకారం డబ్బాల్లో సేకరిస్తారు. దీని తరువాత, పరిమాణం ప్రకారం వాటిని ప్యాక్ చేసి సరఫరా చేస్తారు.
రూ.లక్షల్లో ఆదాయం:
పేపర్ స్ట్రా తయారీ వ్యాపారంలో సంపాదన లక్షల్లో ఉంటుంది ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ నివేదికలు చెబుతున్నాయి. మీరు 75% సామర్థ్యంతో పేపర్ స్ట్రాలను తయారు చేయడం ప్రారంభిస్తే మీ స్థూల విక్రయం రూ.85.67 లక్షలు అవుతుంది. ఇందులో ఖర్చులు, పన్నులు అన్నీ తీసుకున్నాక ఏడాదికి రూ.9.64 లక్షల ఆదాయం ఉంటుంది. అంటే మీరు ప్రతి నెలా రూ.80,000 కంటే ఎక్కువ సంపాదించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




