BSNL: బీఎస్ఎన్ఎల్ బిగ్ షాక్.. ఆ ప్లాన్ వ్యాలిడిటీ తగ్గింపు.. కేవలం ఇన్ని రోజులే..
బీఎస్ఎన్ఎల్ తన ప్రజాదరణ పొందిన రూ.107 ప్రీపెయిడ్ ప్లాన్ వ్యాలిడిటీని 35 రోజుల నుండి 22 రోజులకు తగ్గించింది. ఇది వినియోగదారులకు పెద్ద షాక్. రూ.197 ప్లాన్ గడువు కూడా తగ్గించింది. ఈ నిర్ణయంతో యూజర్లు తరచుగా రీఛార్జ్ చేయాల్సి వస్తుంది. తద్వారా ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి.

ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ మరోసారి తన ప్రీపెయిడ్ ప్లాన్‌ల విషయంలో కఠిన నిర్ణయం తీసుకుంది. కంపెనీ తన అత్యంత పాపులర్ అయిన రూ.107 రీఛార్జ్ ప్లాన్ చెల్లుబాటును భారీగా తగ్గించింది. గతంలో 35 రోజులు ఉన్న ఈ ప్లాన్ గడువును ఇప్పుడు కేవలం 22 రోజులకు మాత్రమే కుదించింది. ఈ ఆకస్మిక మార్పు యూజర్లకు బిగ్ షాక్‌గా అనిపించవచ్చు.
35 రోజుల నుండి 22 రోజులకు..
BSNL తన ప్రీపెయిడ్ ప్లాన్‌ల ప్రయోజనాలను తగ్గించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో రూ.107 ప్లాన్ వ్యాలిడిటీని 35 రోజుల నుండి 28 రోజులకు తగ్గించారు. ఇప్పుడు అదే ప్లాన్‌ను మరోసారి సవరించి 22 రోజులు మాత్రమే అందిస్తున్నారు. అలాగే కంపెనీ ఇటీవల దాని రూ.197 ప్లాన్ వ్యాలిడిటీని కూడా 54 రోజుల నుండి 42 రోజులకు తగ్గించింది. ఈ వరుస తగ్గింపులను బట్టి చూస్తే BSNL భవిష్యత్తులో ఇతర ప్లాన్‌ల ప్రయోజనాలను కూడా తగ్గించే అవకాశం ఉందని టెలికాం పరిశ్రమలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
రూ.107 ప్లాన్ ప్రయోజనాలు ఇవే
బీఎస్ఎన్ఎల్ క్విక్ రీఛార్జ్ పేజీలో రూ.107 ప్రీపెయిడ్ ప్యాక్ వ్యాలిడిటీ 22 రోజులకు తగ్గినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ప్రయోజనాలలో మాత్రం ఎటువంటి మార్పు లేదు.
డేటా: 3GB డేటా లభిస్తుంది.
కాలింగ్: 200 నిమిషాల లోకల్, STD, రోమింగ్ కాలింగ్ అందుబాటులో ఉంటుంది.
డేటా FUP: 3GB పరిమితి తర్వాత ఇంటర్నెట్ వేగం 40 kbpsకి తగ్గుతుంది.
వ్యాలిడిటీ తగ్గితే ఖర్చు డబుల్
ప్లాన్ గడువు తగ్గడం వలన వినియోగదారులు తక్కువ రోజుల్లోనే రీఛార్జ్ చేయాల్సి వస్తుంది. అలాగే ప్లాన్ యొక్క 200 నిమిషాల కాలింగ్ పరిమితి లేదా 3GB డేటా పరిమితి పూర్తి అయితే ఖర్చు పెరుగుతుంది.
లిమిట్ తర్వాత ఛార్జీలు
- డేటా: 3GB డేటా అయిపోయిన తర్వాత ప్రతి MB కి 25 పైసలు ఛార్జ్ అవుతుంది.
- లోకల్ SMS: రూ.80 పైసలు
- నేషనల్ SMS: రూ.1.20
- అంతర్జాతీయ SMS: రూ.6
BSNL యొక్క ఈ కొత్త విధానం తక్కువ కాల వ్యవధిలో ఎక్కువ ఖర్చుకు దారి తీసే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
