AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BSNL Rechage Plan: బీఎస్‌ఎన్‌ఎల్ అదిరిపోయ్ రీఛార్జ్ ప్లాన్.. 6 నెలల వ్యాలిడీ.. రూ. 498 లకే.. వివరాలివే..

Rechage Plan: ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL తన వినియోగదారుల కోసం షాకింగ్ రీఛార్జ్ ప్లాన్‌తో ముందుకు వచ్చింది. మీరు సుదీర్ఘ వ్యాలిడిటీతో ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే.. మీకు గొప్ప అవకాశం ఉంది. కంపెనీ ఒక ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. దీనిలో మీరు చాలా తక్కువ ధరలో 180 రోజుల సుదీర్ఘ కాలవ్యవధిని పొందుతారు. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి. దీంతో మీరు ఆరు నెలల పాటు చింతలేకుండా మాట్లాడుకోండి.

BSNL Rechage Plan: బీఎస్‌ఎన్‌ఎల్ అదిరిపోయ్ రీఛార్జ్ ప్లాన్.. 6 నెలల వ్యాలిడీ.. రూ. 498 లకే.. వివరాలివే..
BSNL
Sanjay Kasula
|

Updated on: Aug 09, 2023 | 7:45 AM

Share

రీఛార్జ్ ప్లాన్‌లు గత కొన్ని సంవత్సరాలుగా ఖరీదైనవిగా మారాయి. అన్ని టెలికాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్‌ను ఖరీదైనవిగా మార్చాయి. ప్రతి నెలా రీఛార్జ్ చేయకపోయినా, సిమ్‌లో మొదట అవుట్‌గోయింగ్.. ఆ తర్వాత ఇన్‌కమింగ్ సౌకర్యం ఆగిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రెండు సిమ్‌కార్డులు ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మీరు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే.. చౌక రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే.. మీ కోసం ఇక్కడ ఒక మంచి ప్లాన్ ఉంది. ఈ రీఛార్జ్ ప్లాన్ మరింత చెల్లుబాటుతో పాటు తక్కువ ధరతో వస్తుంది. ఈ రీఛార్జ్ కింద, మీరు కాల్ చేసే సౌకర్యాన్ని పొందవచ్చు. ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ ఎల్లప్పుడూ తన వినియోగదారుల కోసం సరసమైన, చౌక రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తుంది. జియో, ఎయిర్‌టెల్‌లకు పోటీగా బీఎస్‌ఎన్‌ఎల్ రంగంలోకి దిగింది.

ఈ మధ్యకాలంలో అదిరిపోయే ఆఫర్‌లతో ప్లాన్‌లను తీసుకొచ్చింది. బీఎస్‌ఎన్‌ఎల్ రీఛార్జ్ పోర్ట్‌ఫోలియోలో ఇటువంటి అనేక ప్లాన్‌లు తీసుకొచింది. అందులో కొన్ని  డేటా,  టాప్‌ అప్ వంటి ప్లాన్స్ ఉండగా.. ఈ మధ్య బీఎస్‌ఎన్‌ఎల్ తీసుకొచ్చిన ప్లాన్‌పై మార్కెట్లో పెద్ద ఎత్తున  చర్చ జరుగుతోంది. ఈ ప్రత్యేక ప్లాన్‌లో బీఎస్‌ఎన్‌ఎల్ దాని వినియోగదారులకు ఒకటి లేదా రెండు నెలలు కాకుండా ఏకంగా 6 నెలల సుదీర్ఘ చెల్లుబాటు ప్లాన్‌ పరిచయం చేసింది. దీంతో మీరు ఒక్కసారి రీచార్జ్ చేస్తే చాలా ఆరు నెలలు నిరంతరాయంగా మాట్లాడొచ్చు.

రీఛార్జ్ ప్లాన్ 180 రోజుల.. రూ.500 కంటే తక్కువ..

ఎక్కువ రోజులు తక్కువ ప్లాన్.. ఇతర కంపెనీల కంటే ఎక్కువ ఆఫర్లను అందిస్తుంది బీఎస్‌ఎన్‌ఎల్. మీరు రూ.500 కంటే తక్కువ ధరతో లాంగ్‌టర్మ్ ప్లాన్ తీసుకుని.. అనేక ఇతర ప్రయోజనాలను కూడా పొందవచ్చు. మీరు బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారు అయితే.. రూ. 498తో రీఛార్జ్ చేసుకుంటే.. ఈ ప్లాన్‌లో మీకు పూర్తి 180 రోజుల చెల్లుబాటు లభిస్తుంది. ఈ ప్లాన్ తీసుకున్న తర్వాత మీరు తరచుగా రీఛార్జ్ చేసే సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఏడాదిలో రెండు సార్లు మాత్రమే రీఛార్జ్ చేసుకుంటే చాలు..

రూ. 498తో రీఛార్జ్ ఇలా..

తక్కువ కాలింగ్ అవసరం, ఎక్కువ కాలం చెల్లుబాటు కావాల్సిన వారికి ఈ ప్లాన్ మంచిది. ఈ ప్లాన్‌లో మీరు నిమిషానికి 10 పైసల చొప్పున బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్‌కు కాల్ చేసే సౌకర్యం ఇవ్వబడింది. మీరు ఏదైనా ఇతర నెట్‌వర్క్‌లో కాల్ చేస్తే, మీరు నిమిషానికి 30 పైసలు చెల్లించాలి. ఈ ప్లాన్‌తో కంపెనీ మీకు రూ.100 టాక్ టైమ్ ఇస్తుంది.

మీకు ఉచిత డేటా, ఉచిత కాలింగ్ సౌకర్యం కావాలంటే.. మీరు ఈ ప్లాన్‌లో పొందలేరు. కానీ మీకు ఎక్కువ డేటా, కాలింగ్ అవసరం లేకపోతే.. మీరు ఖచ్చితంగా ఈ ప్లాన్‌ని యాక్టివేట్ చేయవచ్చు. ఇతర కంపెనీలు 180 రోజుల చెల్లుబాటు కోసం బీఎస్‌ఎన్‌ఎల్ కంటే చాలా ఎక్కువ వసూలు చేస్తాయి.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం