AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brain Exercises: మెదడు చురుగ్గా ఉండాలంటే ఏం చేయాలి.. పరిశోధకులు ఏమంటున్నారు..?

ఎప్పుడు కూడా మెదడును చురుకుగ్గా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. మెదడులో ఏదైనా సమస్య తలెత్తితో తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే లక్షలాది రూపాయలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి..

Brain Exercises: మెదడు చురుగ్గా ఉండాలంటే ఏం చేయాలి.. పరిశోధకులు ఏమంటున్నారు..?
Brain Exercises
Subhash Goud
|

Updated on: Feb 14, 2023 | 7:30 AM

Share

ఎప్పుడు కూడా మెదడును చురుకుగ్గా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. మెదడులో ఏదైనా సమస్య తలెత్తితో తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే లక్షలాది రూపాయలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంటుంది. అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాలున్న ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు వైద్య నిపుణులు. అలాగే ఆరోగ్యానికి వ్యాయామం చేయడం ముఖ్యం. రోజువారీగా వ్యాయామం చేయడం వల్ల అద్భుతమైన ఉపయోగాలుంటాయి. శరీర శ్రమ కండరాల మీద మాత్రమే ఫలితం చూపకుండా ఊపిరితిత్తుల్లకి చేరే గాలి మీద, మెదడుకు అందే ప్రాణవాయువు మీద, ఆలోచన మీద ఇలా అన్నింటిపైనా సానుకూలమైన ప్రభావం చూపిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారి మానసిక ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉండేందుకు ఇదొక కారణమనే చెప్పాలి. 50-74 ఏళ్ల వయసు మధ్య ఉన్న 90 మందిపై కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఓ పరిశోధన చేశారు. వారి జీవితంలో రోజువారీ శరీర శ్రమను గుర్తించే ట్రాకర్స్‌ అమర్చారు. అయితే ఈ పరిశోధనలో శరీర శ్రమ ఎక్కువగా చేసిన రోజున వారి మెదడు మరింతగా చురుగ్గా పని చేయడాన్ని పరిశోధకులు గుర్తించారు. నడివయసులో కూడా మన విశ్లేషణా సామర్థ్యాన్ని మెరుగ్గా ఉంచుకోవాలి.

రోజుకు కనీసం 30 నిమిషాల వ్యాయమం:

రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయమం లేదా శారీరక శ్రమ చేసేవారి మెదడు పనితీరు చురుగ్గా ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. శారీరక శ్రమ వల్ల గుండె, ఊపిరితిత్తులు బాగా పనిచేసి.. శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని, శారీరకంగా ఫిట్‌గా ఉండేందుకు దోహదపడుతుందంటున్నారు. అయితే శరీరంలో డిప్రెషన్, యాంగ్జైటీ వంటి వాటికి కారణమయ్యే హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోయి.. మెదడుపై ఒత్తిడి తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

వ్యాయమంలో మెదడు చురుకుదనం:

వ్యాయామం చేస్తే కండరాలే శరీరంలోని శక్తిలో ఎక్కువ భాగాన్ని వినియోగించుకుంటాయి. దీంతో ఇతర భాగాలు, అవయవాలు, మెదడుకు కూడా గ్లూకోజ్ సరిపడినంతగా అందదు. మెదడు, నాడీ వ్యవస్థలోని నాడీ కణాలు అత్యంత సున్నితమైనవి. దీంతో వ్యాయామం వల్ల శరీరంలో శక్తి తగ్గినప్పుడు.. మెదడును, నాడీ కణాలను రక్షించుకునేందుకు అవసరమయ్యే ప్రొటీన్లు, హార్మోన్లు వంటివి విడుదలవుతాయి. ఇదే సమయంలో ఇతర అవయవాలకు శక్తి రవాణాను తగ్గించి.. మెదడుకు అందిస్తాయి. దాంతో మెదడు మరింత శక్తిని పొందుతుందని పరిశోధకులు గుర్తించారు. అలాగే మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే మన తీసుకునే ఆహారంపైనా దృష్టి పెట్టాలంటున్నారు. ముఖ్యంగా ఆహారంలో కార్బొహైడ్రేట్లు, కొవ్వులు, ప్రొటీన్లు అవసరమైన మేరకు ఉండేలా చూసుకోవాలని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎల్లమ్మలో విలన్‌గా ఒకప్పటి లవర్ బాయ్..
ఎల్లమ్మలో విలన్‌గా ఒకప్పటి లవర్ బాయ్..
పుష్కరానికోసారి పూసే అరుదైన పుష్పం.. చూడాలంటే అదృష్టం ఉండాలి
పుష్కరానికోసారి పూసే అరుదైన పుష్పం.. చూడాలంటే అదృష్టం ఉండాలి
భూమి కింద మిస్సైల్ బేస్‌.. ప్రపంచానికి చాటిన'ఇరాన్'
భూమి కింద మిస్సైల్ బేస్‌.. ప్రపంచానికి చాటిన'ఇరాన్'
బీజేపీ మున్సిపల్ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల
బీజేపీ మున్సిపల్ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల
ఈ వస్తువులు మీ చేతుల్లోంచి జారిపడ్డాయా? అయితే జాగ్రత్త!
ఈ వస్తువులు మీ చేతుల్లోంచి జారిపడ్డాయా? అయితే జాగ్రత్త!
జలుబు లేదా ఫ్లూతో ఇబ్బందా.. ఒక్కసారి ఈ చికెన్ సూప్ ట్ర చేయండి..
జలుబు లేదా ఫ్లూతో ఇబ్బందా.. ఒక్కసారి ఈ చికెన్ సూప్ ట్ర చేయండి..
విమానంలో బాలున్ని ఎక్కనివ్వని ఎయిర్‌లైన్స్‌.. షాకిచ్చిన కోర్టు
విమానంలో బాలున్ని ఎక్కనివ్వని ఎయిర్‌లైన్స్‌.. షాకిచ్చిన కోర్టు
ప్రియుడిని పిలిచి ప్లాన్ చేసి.. భర్తను వాకింగ్‌కు తీసుకెళ్లింది..
ప్రియుడిని పిలిచి ప్లాన్ చేసి.. భర్తను వాకింగ్‌కు తీసుకెళ్లింది..
శివుడికి తులసిని ఎందుకు సమర్పించకూడదు..? ఆధ్యాత్మిక కారణాలివే
శివుడికి తులసిని ఎందుకు సమర్పించకూడదు..? ఆధ్యాత్మిక కారణాలివే
సముద్రంలో ఈది కుటుంబాన్ని కాపాడుకున్న 13 ఏళ్ల బాలుడు
సముద్రంలో ఈది కుటుంబాన్ని కాపాడుకున్న 13 ఏళ్ల బాలుడు