AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC: లోయర్ బెర్త్ కన్ఫార్మ్ అవుతుందని చెప్పడానికి వీలుండదు.. రైల్వే ప్రయాణికులకు షాకిచ్చిన ఐఆర్‌సీటీసీ..!

IRCTC: రైలు ప్రయాణం చేసేవారు ముందుగా ఐఆర్‌సీటీసీలో టికెట్లను బుకింగ్‌ చేసుకుంటారు. టికెట్ల బుకింగ్‌ విషయాలలో ఐఆర్‌సీటీసీ ఎన్నో సేవలు అందిస్తోంది.

IRCTC: లోయర్ బెర్త్ కన్ఫార్మ్ అవుతుందని చెప్పడానికి వీలుండదు.. రైల్వే ప్రయాణికులకు షాకిచ్చిన ఐఆర్‌సీటీసీ..!
Subhash Goud
|

Updated on: Sep 14, 2021 | 1:53 PM

Share

IRCTC: రైలు ప్రయాణం చేసేవారు ముందుగా ఐఆర్‌సీటీసీలో టికెట్లను బుకింగ్‌ చేసుకుంటారు. టికెట్ల బుకింగ్‌ విషయాలలో ఐఆర్‌సీటీసీ ఎన్నో సేవలు అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఇండియన్ రైల్వేస్ సీనియర్ సిటిజన్స్‌కు ఝలక్ ఇచ్చింది. ట్రైన్ టికెట్ బుకింగ్ నిబంధనలను సవరించింది. ఈ రూల్స్‌ సవరణతో సీనియర్ సిటిజన్స్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే సీనియర్ సిటిజన్స్ సాధారణంగా రైలు ప్రయాణం చేయాలని భావిస్తే టికెట్ బుకింగ్ సమయంలో లోయర్ బెర్త్ కావాలనే ఆప్షన్ ఎంపిక చేసుకుంటారు. ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ పైన ఉన్న బెర్తుల్లో సౌకర్యవంతంగా కూర్చొలేరు. అందుకే లోయర్ బెర్త్‌కు ప్రాధాన్యం ఇస్తుంటారు. టికెట్ బుకింగ్ సమయంలో లోయర్ బెర్త్ పెట్టుకుంటే లోయర్ బెర్త్ కన్ఫార్మ్ అవుతుందని చెప్పడానికి ఇక వీలుండదు. మీరు ప్రయాణం చేసే తోటి ప్యాసింజర్ల ప్రాతిపదికన మీకు సీటు లభ్యత ఆధారపడి ఉంటుంది. ఈ అంశంపై ఐఆర్‌సీటీసీ తాజాగా వివరణ ఇచ్చింది.

సీనియర్ సిటిజన్ కోటా కింద లోయర్ బెర్త్ పొందవచ్చు. 60 ఏళ్లు లేదా ఆ పైన వయసు కలిగిన మగ వారు, 45 ఏళ్లు లేదా ఆ పైన వయసు కలిగిన మహిళలు ఈ కోటా కింద లోయర్ బెర్త్ పొందే అవకాశం ఉంటుంది. అయితే దీనికి కొన్ని షరతులు ఉన్నాయని గమనించాల్సి ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ ఒంటరిగా లేదా ఒకే టికెట్‌పై ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తే.. వారికి లోయర్ బెర్త్ లభిస్తుంది. ఇలా కాకుండా ఇద్దరు సీనియర్ సిటిజన్స్‌ కన్నా ఎక్కువ మంది ఉన్నా లేదంటే ఒక సీనియర్ సిటిజన్ ఇతర ప్రయాణికులు సీనియర్ సిటిజన్స్ కాకపోయినా అప్పుడు వారికి లోయర్ బెర్త్ లభించదని ఐఆర్‌సీటీసీ స్పష్టం చేసింది.

ఇవీ కూడా చదవండి: WhatsApp Payments Service: భారత్‌లో అందరికి అందుబాటుకి వచ్చిన వాట్సాప్‌ పేమెంట్ సర్వీస్‌.. ఎలా చేయాలంటే..!

Parking FASTag: పార్కింగ్‌ చేసే వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. పార్కింగ్‌లోనూ ఫాస్టాగ్‌..!

SBI Special Deposit Scheme: ఎస్‌బీఐ కస్టమర్లు అలర్ట్‌.. నేడే చివరి అవకాశం.. పూర్తి వివరాలు..!