WhatsApp Payments Service: భారత్‌లో అందరికి అందుబాటుకి వచ్చిన వాట్సాప్ పేమెంట్ సర్వీస్.. ఎలా చేయాలంటే..!
WhatsApp Payments Service: ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ నుంచి డిజిటల్ చెల్లింపుల సేవలు ప్రారంభమైన విషయం తెలిసిందే. దశల వారీగా డిజిటల్ చెల్లింపుల..
WhatsApp Payments Service: ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ నుంచి డిజిటల్ చెల్లింపుల సేవలు ప్రారంభమైన విషయం తెలిసిందే. దశల వారీగా డిజిటల్ చెల్లింపుల ఫ్లాట్‌పాం వాట్సాప్ పే సేవలను ప్రారంభించింది. ఈ సేవలు భారతదేశంలో 2020 నవంబర్‌లో ప్రారంభించింది. ఇప్పుడు ఈ చెల్లింపు సర్వీసు భారతదేశంలోని వినియోగదారులందరికి అందుబాటులోకి వచ్చింది. వినియోగదారులు మొబైల్‌లో వాట్సాప్‌ను ఓపెన్ చేసి ఈ సేవలను వినియోగించుకోవచ్చు. ఆర్‌బీఐ అనుమతి లభించిన కొద్దిరోజులకే ఎన్‌పీసీఐ నుంచి ఆమోదం లభించడంతో వాట్సాప్ పే యూజర్లకు అందుబాటులోకి వచ్చేందుకు మార్గం సుగమమైంది. వాట్సాప్ చెల్లింపులు అనేది యూపీఐ ఆధారిత సేవ. ఇది ప్రత్యేకంగా వాట్సాప్ ఇండియా పేమెంట్ గోప్యతా విధానికి లోబడి ఉంటుంది.
వాట్సాప్ పేమెంట్ నగదు బదిలీ చేయడం ఎలా..
ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ యాప్‌ను ఓపెన్ చేసిన తర్వాత మీరు నగదు పంపించాలనుకుంటున్న అవతలి వ్యక్తి కాంటాక్ట్ పై క్లిక్ చేయండి. వారి చాట్‌లోకి వెళ్లి అటాచ్మెంట్ బటన్‌పై క్లిక్ చేయండి. యాక్సెప్ట్, కంటిన్యూ ఆప్షన్లపై క్లిక్ చేయాలి. జాబితాలోని మీ బ్యాంకు పేరును ఎంచుకుని, ఎస్‌ఎంఎస్ వెరిఫికేషన్ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎస్‌ఎంఎస్ ద్వారా మీ ఫోన్‌లో వెరిఫికేషన్ కోడ్‌ను అందుకుంటారు. తర్వాత మీ రిజిస్టర్డ్ నంబర్‌తో లింక్ చేయబడిన బ్యాంక్ అకౌంట్ ప్రదర్శించబడుతుంది. మీరు పంపే మొత్తాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ ట్రాన్సాక్షన్‌ను ధృవీకరించడానికి మీ బ్యాంకు యూపీఐ పిన్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి. తద్వారా మీ పేమెంట్ ప్రాసెస్ చేయబడుతుంది. దీని తరువాత మీ వాట్సాప్ చాట్ మెసేజ్ బాక్స్‌లో మీరు ట్రాన్స్ఫర్ చేసిన మొత్తం అమౌంట్‌ను చూసుకోవచ్చు. ప్రస్తుతం టెక్నాలజీ అభివృద్ధి చెందుతుండటంతో అన్ని కూడా ఆన్‌లైన్‌లోనే జరిగిపోతున్నాయి. ఎక్కువగా ఉపయోగిస్తున్న మొబైల్ యాప్స్ అన్ని రకాల పేమెంట్ సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పే, వాట్సాప్ వంటి యాప్స్ కూడా పేమెంట్ సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి.