Credit Card: మీరు క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి..

ఈ మధ్య క్రెడిట్ కార్డుల వినియోగం పెరిగిపోయింది. క్రెడిట్ కార్డ్‌లను సరిగ్గా ఉపయోగించడం ద్వారా, మీరు బలమైన క్రెడిట్ స్కోర్‌ను నిర్మించుకోవచ్చు.

Credit Card: మీరు క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి..
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Jan 23, 2022 | 9:31 AM

ఈ మధ్య క్రెడిట్ కార్డుల వినియోగం పెరిగిపోయింది. క్రెడిట్ కార్డ్‌లను సరిగ్గా ఉపయోగించడం ద్వారా, మీరు బలమైన క్రెడిట్ స్కోర్‌ను నిర్మించుకోవచ్చు. దీనితో మీరు భవిష్యత్తులో లోన్‌పై మంచి ఆఫర్‌లను పొందుతారు. అయితే క్రెడిట్ కార్డులను నిర్లక్ష్యంగా ఉపయోగిస్తే సమస్యలు ఎదుర్కోవచ్చు. క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగిస్తున్నప్పుడు మీరు జాగ్రత్తలు తీసుకోవాలి అవి ఏమిటంటే..

కార్డ్ హోల్డర్లు తమ బకాయిని సరైన సమయంలో చెల్లించాలి. లేకుంటే జరిమానా విధిస్తారు. ఆలస్య చెల్లింపు ఛార్జీలు 5 శాతం వరకు ఉంటాయి. రోజువారీగా చెల్లించని మొత్తంపై ఫైనాన్స్ ఛార్జీలు విస్తారు. క్రెడిట్ కార్డులపై ఫైనాన్స్ ఛార్జీలు చాలా ఎక్కువగా ఉంటాయని గుర్తుంచుకోండి. కొన్ని కార్డులకు ఇది 40 శాతం కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది.

క్రెడిట్ కార్డ్ ద్వారా నగదు ఉపసంహరణపై 3.5 శాతం వరకు నగదు అడ్వాన్స్ ఫీజులు 23 శాతం వరకు ఉంటాయి. ఈ ఛార్జీలు ఉపసంహరణ తేదీ నుండి తిరిగి చెల్లించే వరకు వర్తిస్తాయి. కాబట్టి, మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా నగదు ఉపసంహరణను చేసితిరిగి చెల్లించకపోతే భారీగా ఛార్జీలను వసూల్ చేస్తారు. క్రెడిట్ కార్డు గరిష్ఠ పరిమితి వరకు క్రమం తప్పకుండా ఉపయోగిస్తుంటే, అది మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం యవచ్చు. అందుబాటులో ఉన్న క్రెడిట్ పరిమితిలో 40 శాతం వరకు మాత్రమే ఉపయోగిస్తే మంచింది.

వడ్డీ రహిత వ్యవధి అనేది క్రెడిట్ కార్డ్ లావాదేవీ, చెల్లింపు గడువు తేదీ మధ్య కాలం. ఈ కాలం సాధారణంగా 18 నుంచి 55 రోజుల మధ్య ఉంటుంది. ఈ కాలంలో చేసే క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై ఎటువంటి ఛార్జీ ఉండదు. ప్రయోజనాలను ఎక్కువగా పొందడానికి, వడ్డీ రహిత వ్యవధికి అనుగుణంగా మీ కొనుగోళ్లను ప్లాన్ చేయండి.

Read Also.. Petrol Diesel Price: హ్యాపీ సండే.. పెరగని పెట్రోల్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో కూడా..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే